చిత్తూరు జిల్లా చామంతిపురంలో 37 ఏళ్ల వివాహిత తన పిల్లల వయసున్న 17 ఏళ్ల బాలుడితో వివాహేతర సంబంధం కొనసాగించింది. భర్త, అత్త అడ్డుగా ఉండడంతో వారిని హత్య చేయడానికి మైనర్ బాలుడితో కలిసి పథకం వేసింది. అత్తను చంపేందుకు ప్రయత్నించగా విఫలమైంది. ప్రస్తుతం బాలుడు జువైనల్ హోమ్‌లో ఉండగా, మహిళ పరారీలో ఉంది.