AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎండకు మీ ముఖం కమిలిపోయిందా..? టమాటా ప్యాక్‌ ట్రై చేయండి.. మెరుపు ఖాయం..!

ది నేచురల్ రెమిడీ కాబట్టి ఎప్పుడైనా ట్రై చేయొచ్చు. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇలా చేయడం వల్ల కేవలం మచ్చలు తగ్గడమే కాకుండా... మొటిమల సమస్య కూడా తగ్గుతుంది. ఇది ముఖం కాంతివంతంగా మారడానికి, పేరుకుపోయిన మురికిని తొలగించడానికి సహాయపడుతుంది.

ఎండకు మీ ముఖం కమిలిపోయిందా..? టమాటా ప్యాక్‌ ట్రై చేయండి.. మెరుపు ఖాయం..!
Tomato Face Packs
Jyothi Gadda
|

Updated on: May 18, 2023 | 7:43 AM

Share

చర్మాన్ని రిఫ్రెష్ చేయడానికి.. హైడ్రేటెడ్‌గా ఉంచడానికి టమాటా అద్భుతంగా పనిచేస్తుంది. టమాటా రసాన్ని చర్మానికి అప్టై చేయడం వల్ల ట్యానింగ్ సమస్యలు కూడా దూరమవుతాయి. టమాటా లో విటమిన్ C ఎక్కువగా ఉంటుంది. చర్మం రంగు ని మెరుగుపరచడంలో మేలు చేస్తుంది. దీన్ని ఉపయోగించడం వల్ల ముఖంపై మచ్చలు, మొటిమలు నుంచి ఉపశమనం పొందుతాం. ఇందుకోసం కొన్ని ప్యాక్స్ వాడొచ్చు. ముందుగా రెండు చెంచాల టమాట గుజ్జు తీసుకోవాలి. ఇందులో కాస్తా తేనె కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖం, మెడపై అప్లై చేయాలి. ఆరిన తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి తగినంత తేమ అందుతుంది.

కొద్దిగా శనగ పిండిని తీసుకుని అందులో టమాటా గుజ్జుని కలపాలి. ఈ మెత్త టి పేస్ట్‌ని ముఖానికి పూతలా వేయాలి. ఆరిన తర్వాత నీళ్లు చల్లుకుంటూ స్క్రబ్‌లా చేస్తూ క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం తాజాగా మారుతుంది.

ఓపెన్ పోర్స్ సమస్య ఉన్నవారు కొద్దిగా ముల్తానీ మట్టిలో టమాట జ్యూస్ వేసి బాగా కలుపుకుని ప్యాక్‌లా తయారు చేసుకోండి.. ఇలా తయారైన ప్యాక్‌ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత చల్లని నీటితో కడగండి. ఇలా చేయడం వల్ల సమస్య చాలా వరకూ తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

ఎండకు కమిలిన చర్మాన్నితిరిగి అందంగా మార్చడంలో టమాటా బాగా పనిచేస్తుంది. కొద్దిగా టమాట రసం తీసుకుని అందులో కాస్తా మజ్జిగ కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. కాస్తా ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగితే మంచి ఫలితం ఉంటుంది. దీన్ని రాయడం వల్ల ట్యాన్ సమస్య తగ్గుతుంది.

టమోటా, చక్కెర చాలా మంది ఉపయోగించే సులభమైన స్క్రబ్. టమోటాను సగానికి కట్ చేసి చక్కెరలో ముంచి ముఖానికి స్క్రబ్ చేయండి. ఇది ముఖం కాంతివంతంగా మారడానికి, పేరుకుపోయిన మురికిని తొలగించడానికి సహాయపడుతుంది.

పెరుగు, నిమ్మరసం, టమోటా పేస్ట్‌తో మాస్క్‌ను తయారు చేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ల టమోటా గుజ్జులో 1 టేబుల్ స్పూన్ పెరుగు, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ప్యాక్ తయారు చేయండి. తర్వాత దానిని మీ ముఖం, మెడపై అప్లై చేసుకోండి. ఈ ప్యాక్‌ని వారానికి రెండు లేదా మూడు సార్లు అప్లై చేయండి.

టమాట గుజ్జులో ఏం కలపకుండా కూడా అది మాత్రమే ముఖం, మెడకు రాసి ఆరిన తర్వాత కడిగినా మంచి ఫలితముంటుంది. ఇది నేచురల్ రెమిడీ కాబట్టి ఎప్పుడైనా ట్రై చేయొచ్చు. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇలా చేయడం వల్ల కేవలం మచ్చలు తగ్గడమే కాకుండా… మొటిమల సమస్య కూడా తగ్గుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..