AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అర్ధరాత్రి గ్యారేజీలో అలజడి.. ! ఏంటా అని నిద్రలేచిన యజమానికి ఎదురుగా ఊహించని సీన్‌.. ఏం జరిగిందంటే..

ఈ దారుణ ఘటన మే 15 (సోమవారం) తెల్లవారుజామున 2 గంటలకు చోటుచేసుకుంది. వీడియోలో చుట్టుపక్కల కొన్ని ట్రక్కులు కనిపిస్తున్నాయి. కొందరు వ్యక్తులు బహిరంగ ప్రదేశంలో మంచాలు వేసుకు పడుకుని ఉన్నారు. ఒక మంచం దగ్గరగానే ఒక కుక్క కూడా పడుకుని ఉంది. ఇంతలోనే ఆగివున్న వాహనాల మధ్యలోంచి మెల్లిగా నడుచుకుంటూ వచ్చిందో

అర్ధరాత్రి గ్యారేజీలో అలజడి.. ! ఏంటా అని నిద్రలేచిన యజమానికి ఎదురుగా ఊహించని సీన్‌.. ఏం జరిగిందంటే..
Eopard Attack On Dog
Jyothi Gadda
|

Updated on: May 18, 2023 | 7:17 AM

Share

సోషల్ మీడియాలో అనేక వైరల్‌ వీడియోలు కనిపిస్తుంటాయి. కొన్ని వీడియోలు జనాల్ని షాక్‌కు గురిచేస్తుండగా, మరికొన్ని వీడియోలు ఆశ్చర్యపోయేలా చేస్తుంటాయి. ఇంకొన్ని వీడియోలు చూస్తే భయంతో ఒళ్లు గగ్గుర్పొడిచేలా ఉంటాయి. అలాంటిదే ఈ వీడియో కూడా.. అర్ధరాత్రి జనారణ్యంలోకి ప్రవేశించిన ఒక పెద్ద పులి స్థానికుల్ని హడలెత్తించింది. ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతున్న సమయంలో వచ్చిన పెద్ద పులి ఏం చేసిందో చూస్తే హడలెత్తిపోవాల్సిందే. ఈ ఘటన పూణేలోని జున్నార్ నగరంలో జరిగింది. చిరుతపులి దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోమవారం రాత్రి చీకట్లో ఓ చిరుతపులి బహిరంగ ప్రదేశంలో నిద్రిస్తున్న వారి దగ్గరికి వచ్చి గాఢనిద్రలో ఉన్న కుక్కను ఎత్తుకెళ్లింది. ఈ దృశ్యాలన్ని అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డవ్వడంతో జనం షాక్‌కు గురయ్యారు.

ఈ సీసీటీవీ ఫుటేజీ ప్రకారం.. ఈ దారుణ ఘటన మే 15 (సోమవారం) తెల్లవారుజామున 2 గంటలకు చోటుచేసుకుంది. వీడియోలో చుట్టుపక్కల కొన్ని ట్రక్కులు కనిపిస్తున్నాయి. కొందరు వ్యక్తులు బహిరంగ ప్రదేశంలో మంచాలు వేసుకు పడుకుని ఉన్నారు. ఒక మంచం దగ్గరగానే ఒక కుక్క కూడా పడుకుని ఉంది. ఇంతలోనే ఆగివున్న వాహనాల మధ్యలోంచి మెల్లిగా నడుచుకుంటూ వచ్చిందో పెద్దపులి.. చుట్టూ ఉన్న వాతావరణాన్ని పసిగడుతూ నెమ్మదిగా ముందుకు సాగింది. అక్కడ పడుకుని ఉన్నకుక్క దగ్గరకు చేరింది. ఏ మాత్రం శబ్ధం లేకుండా ఒక్కసారిగా కుక్కను నోటకరుచుని అక్కడ్నుంచి పారిపోయింది. కుక్క అరుపులు విని మంచం మీద పడుకున్న వ్యక్తి వెంటనే నిద్రలోంచి మేల్కోని చూసేసరికి పెద్దపులి అక్కడ్నుంచి వెళ్లిపోయింది.

ఇవి కూడా చదవండి

పూణే, పరిసర ప్రాంతాల్లో ఇలాంటి చిరుతలు కనిపించడం కొత్తేమీ కాదు. ఇలాంటి ఘటనలతో ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావాలంటేనే భయంతో వణికిపోతున్నారు. ఈ షాకింగ్ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది.. ఇప్పటికే 33 వేలకు పైగా వీక్షణలు, వేల సంఖ్యలో లైక్‌లు వచ్చాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..