Egg Recipe : ఉడికించిన గుడ్లు, ఆమ్లెట్లతో విసిగిపోయారా? కోడి గుడ్డు ఫ్రిటాటా కొత్త వంటకం ట్రై చేయండి..
కోడి గుడ్లు అనేక విటమిన్లు, మినరల్స్ కలిగి ఉన్న పూర్తి స్థాయి పోషక ఆహారం. ఇవి మెదడు ఆరోగ్యానికి, గుండె ఆరోగ్యానికి, కంటి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.

కోడి గుడ్లు అనేక విటమిన్లు, మినరల్స్ కలిగి ఉన్న పూర్తి స్థాయి పోషక ఆహారం. ఇవి మెదడు ఆరోగ్యానికి, గుండె ఆరోగ్యానికి, కంటి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. న్యూట్రసీ లైఫ్‌స్టైల్ వ్యవస్థాపకుడు మరియు పోషకాహార నిపుణుడి ప్రకారం, ఒక గుడ్డులో విటమిన్ ఎ (6 శాతం), విటమిన్ బి5 (7 శాతం), విటమిన్ బి12 (9 శాతం), ఫాస్పరస్ (9 శాతం), విటమిన్ బి2 (15 శాతం), సెలీనియం (22) ఉంటాయి. కోడి గుడ్డుతో చేసిన వంటలను చాలా మంది ఇష్టపడతారు. ఉడకబెట్టిన గుడ్డు, ఆమ్లెట్, ఎగ్ బుర్జి , ఎగ్ కర్రీ వంటి మనకు తెలిసిన అనేక గుడ్డు వంటకాలు ఉన్నాయి. అయితే సెలబ్రిటీ ఫిట్‌నెస్ ట్రైనర్ యాస్మిన్ కరాచీవాలా ఈ సూపర్ హెల్తీ, రుచికరమైన, సులభంగా తయారు చేయగల ఎగ్ ఫ్రిటాటా రెసిపీని మీకు అందిస్తున్నారు.
కావలసినవి:
గుడ్డులోని తెల్లసొన – 3




అల్లం ముక్క – 1 కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలిక్యారెట్ – 1, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
చీజ్ – కావలసినంతఆలివ్ నూనె – 1 టేబుల్ స్పూన్.
తరిగిన వెల్లుల్లి – 1 టీస్పూన్ఉప్పు – చిటికెడు.
నల్ల మిరియాల పొడి – 1 tspపుదీనా ఆకులు – అలంకరించేందుకు.
ఎలా సిద్ధం చేయాలి:
-ఒక కప్పులో నీటిని మరిగించండి.
– అందులో ఉప్పు, క్యారెట్ ముక్కలు, వెల్లుల్లి వేసి 5 నిమిషాలు ఉడికించాలి. అల్లం, క్యారెట్ మెత్తబడే వరకు ఉడకబెట్టండి.
-నీటి నుండి కూరగాయలను తీసివేసి పక్కన పెట్టండి?
– గుడ్డులోని తెల్లసొనను ఒక గిన్నెలోకి తీసుకుని బాగా గిలకొట్టండి.
-ఒక పాన్ తీసుకుని, అందులో ఆలివ్ ఆయిల్ వేసి తక్కువ మంట మీద వేడి చేయాలి. అందులో గుడ్డు తెల్లసొన పోయాలి. పైన ఉడికించిన కూరగాయలను చల్లుకోండి.
-రెండు నిమిషాలు కాల్చండి. రుచికరమైన ఎగ్ ఫ్రిటాటా టోమాటో సాస్ తో సర్వ్ చేసుకొని తినండి..
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



