AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajwain water Benefits: ఖాళీ కడుపుతో వాము వాటర్ తాగితే దివ్యౌషధంలా పనిచేస్తుంది..

వాము గురించి అందరికీ తెలుసు. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. పూర్వం నుంచి వామును మన వంటల్లో ఉపయోగిస్తూ ఉంటున్నారు. ఇప్పుడంటే వాడకం బాగా తగ్గిపోయింది కానీ.. పూర్వం ఎక్కువగా తీసుకునేవారు. అందుకే అప్పటి పెద్దవాళ్లు ఎలాంటి జబ్బులు, అనారోగ్య సమస్యలు వచ్చినా తట్టుకుని నిలబడేవారు. వాములో ఎన్నో ఆయుర్వేద గుణాలు దాగి ఉన్నాయి. మనం నిత్యం ఉపయోగించే వాటితోనే..

Ajwain water Benefits: ఖాళీ కడుపుతో వాము వాటర్ తాగితే దివ్యౌషధంలా పనిచేస్తుంది..
Ajwain Water
Chinni Enni
| Edited By: |

Updated on: May 24, 2024 | 1:55 PM

Share

వాము గురించి అందరికీ తెలుసు. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. పూర్వం నుంచి వామును మన వంటల్లో ఉపయోగిస్తూ ఉంటున్నారు. ఇప్పుడంటే వాడకం బాగా తగ్గిపోయింది కానీ.. పూర్వం ఎక్కువగా తీసుకునేవారు. అందుకే అప్పటి పెద్దవాళ్లు ఎలాంటి జబ్బులు, అనారోగ్య సమస్యలు వచ్చినా తట్టుకుని నిలబడేవారు. వాములో ఎన్నో ఆయుర్వేద గుణాలు దాగి ఉన్నాయి. మనం నిత్యం ఉపయోగించే వాటితోనే.. ఎన్నో సమస్యల్ని తగ్గించుకోవచ్చు. అలాగే వాముతో కూడా చాలా సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ముఖ్యంగా జీర్ణ సమస్యల్ని మాయం చేస్తుంది వాము. అదే విధంగా ఉదయం ఖాళీ కడుపుతో వాము నీటిని తాగితే.. శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. పరగడుపున వాము వాటర్ తీసుకోవడం వల్ల బాడీలో ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం.

మెటబాలిజం రేటు పెరుగుతుంది:

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే.. మెటబాటిజం సరిగ్గా ఉండాలి. మెటబాలిజం తక్కువగా ఉంటే.. రోగ నిరోధక శక్తి తగ్గి.. ఎన్నో సమస్యలు వస్తాయి. కాబట్టి ఖాళీ కడుపుతో వాము వాటర్ తాగితే.. శరీరంలో అమాంతం మెటబాలిజం రేటు పెరుగుతుంది. ఇవి క్యాలరీలను కరిగించి.. సులభంగా వెయిట్ లాస్ అయ్యేలా చేస్తుంది. వెయిల్ లాస్ అవ్వాలి అనుకునేవారు ఇలా ట్రై చేయండి.

శరీరాన్ని డిటాక్సిఫికేషన్ చేస్తుంది:

శరీరం డిటాక్సిఫికేషన్ అవ్వడం చాలా ముఖ్యం. వాము నీటిని తీసుకున్నా, వాము తిన్నా.. కడుపులోని మలినాలను, విష పదార్థాలను మూత్ర విసర్జన ద్వారా బయటకు పంపిచేస్తుంది వాము. పేగుల ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తుంది. దీంతో కాలేయం, మూత్ర పిండాల ఆరోగ్యం కూడా పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

వెయిట్ లాస్:

ప్రస్తుతం కాలంలో చాలా మంది అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు మంచి డైట్, వ్యాయామంతో పాటు వాము నీటిని తాగడం వల్ల మంచి ఫలితాలను తక్కువ సమయంలోనే అందుకుంటారు. వాము నీరు శరీరంలోని కేలరీలను తగ్గించి.. వెయిట్ తగ్గేలా చేస్తుంది.

జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం:

ఉదయం ఖాళీ కడుపుతో వాము నీటిని తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. కడుపులోని, ప్రేగులను శుభ్ర పరిచి.. విష పదార్థాలను బయటకు పంపుతుంది. వాము నీరు తాగడం వల్ల మలబద్ధకం, అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఆర్మీ ఉద్యోగాల కోసం లాస్ట్ డేట్ పొడిగింపు.. ఇదే చివరి అవకాశం
ఆర్మీ ఉద్యోగాల కోసం లాస్ట్ డేట్ పొడిగింపు.. ఇదే చివరి అవకాశం
గుడిలో ప్రసాదంగా నూడుల్స్, పిజ్జా.. దేశాలు దాటిన ఈ ఆలయ చరిత్ర..
గుడిలో ప్రసాదంగా నూడుల్స్, పిజ్జా.. దేశాలు దాటిన ఈ ఆలయ చరిత్ర..
ఈ నెల 6 నుంచి హెల్త్ వీక్.. రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు
ఈ నెల 6 నుంచి హెల్త్ వీక్.. రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు
గాయంతో విలవిల.. కన్నీళ్లు పెట్టిన మహ్మద్ సిరాజ్
గాయంతో విలవిల.. కన్నీళ్లు పెట్టిన మహ్మద్ సిరాజ్
మష్రూమ్ దొండకాయ ఇలా చేసి తింటే.. టేస్ట్ నెక్స్ట్ లెవెల్
మష్రూమ్ దొండకాయ ఇలా చేసి తింటే.. టేస్ట్ నెక్స్ట్ లెవెల్
ఈత కొడితే శరీరంలో ఇన్ని జరుగుతాయా.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఈత కొడితే శరీరంలో ఇన్ని జరుగుతాయా.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
'ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ'
'ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ'
ఆ హీరో నన్ను తిట్టాడు.. ఆరోజు చాలా గొడవ జరిగింది..
ఆ హీరో నన్ను తిట్టాడు.. ఆరోజు చాలా గొడవ జరిగింది..
ఉల్లికాడల ఎగ్ పులుసు.. ఒకసారి వండి తింటే ఉంటాది నా సామిరంగా..
ఉల్లికాడల ఎగ్ పులుసు.. ఒకసారి వండి తింటే ఉంటాది నా సామిరంగా..
ఇంట్లో ఈ దిశలో పొరపాటున కూడా చెత్త వేయకండి.. దరిద్రం దశావతారమే..
ఇంట్లో ఈ దిశలో పొరపాటున కూడా చెత్త వేయకండి.. దరిద్రం దశావతారమే..