AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఛీ.. ఛీ.. సభ్యసమాజం తలదించుకునే ఘటన.. రూ.2వేల ఇంటి అద్దె కట్టలేక భార్య, కూతురినీ..

ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో అద్దె డబ్బులు చెల్లించలేకపోవడంతో ఓ వ్యక్తి తన భార్య, 13 ఏళ్ల కుమార్తెపై ఇంటి యజమాని లైంగిక దాడులకు అనుమతించాడనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. బాధితుల కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఛీ.. ఛీ.. సభ్యసమాజం తలదించుకునే ఘటన.. రూ.2వేల ఇంటి అద్దె కట్టలేక భార్య, కూతురినీ..
Gujarat Crime News
Shaik Madar Saheb
|

Updated on: May 16, 2026 | 5:26 PM

Share

ఆ దంపతులకు ఓ కుమార్తె.. పేదరికంలో మగ్గుతున్నారు.. ఈ క్రమంలో ఏదైనా పనిచేసుకుని బతుకుదామని ఊరు కాని ఊరు వెళ్లారు.. రూ.2వేలకు ఓ ఇంట్లో అద్దెకు దిగారు. ఏమైందో ఏమో కానీ, అద్దె చెల్లించేందుకు ఆ కుటుంబం దగ్గర డబ్బుల్లేవు.. ఏం చేయాలో అర్థం కాలేదు.. నాలుగు నెలలుగా అద్దె బకాయి ఉంది.. దీంతో ఆ ఇంటి యజమాని గొడవ చేయడం మొదలుపెట్టాడు.. ఏం చేయాలో అర్థం కాక మనోవేదనకు లోనయ్యాడు. చివరకు దారుణ నిర్ణయం తీసుకున్నాడు.. అద్దె చెల్లించేందుకు డబ్బుల్లేక ఆ వ్యక్తి తన భార్య, మైనర్‌ కుమార్తెను ఇంటి యజమాని దగ్గరకు పంపేలా అతనితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో ఆ ఇంటి యజమాని.. అటు తల్లి .. ఇటు కూతురిపై వరుసగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు.. సభ్యసమాజం తలదించుకునే ఈ దారుణ ఘటన గుజరాత్‌ రాష్ట్రంలో కలకలం రేపింది. బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్‌లోని సురేంద్రనగర్‌ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం జీవనోపాధి కోసం సుమారు 6 నెలల క్రితం మోర్బికి వలస వచ్చింది. అక్కడ నెలకు రూ.2వేలు అద్దెతో వారు ఒక ఇంట్లో నివాసం ఉంటున్నారు. అయితే.. మొదట్లో అద్దె చెల్లించినప్పటికీ.. ఆర్థిక సమస్యల కారణంగా నాలుగు నెలలుగా వారు అద్దె చెల్లించలేకపోయారు.

దీంతో ఆ ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయాలని గొడవ చేశాడు.. అయితే, తాను అద్దె చెల్లించలేనని దానికి బదులుగా తన భార్య, మైనర్‌ కుమార్తెను పంపిస్తానని ఆ వ్యక్తి యజమానితో ఒప్పందం చేసుకున్నాడు.. ఆ తర్వాత.. ఆ ఇంటి యజమాని తల్లీ కుమార్తెలపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు.

తీవ్ర మనస్థాపానికి గురైన మహిళ.. ఈ విషయం గురించి తన తల్లికి చెప్పింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ వ్యక్తితోపాటు ఇంటి యజమానిని అరెస్ట్‌ చేశారు. ఈ నేరంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో వ్యక్తి కోసం గాలింపు కొనసాగుతోందని.. పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us