AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna: ఫిల్మ్ ఇండస్ట్రీలో బాలయ్య బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? ఆ స్టార్ హీరో మాత్రం కాదు

నటసింహం నందమూరి బాలకృష్ణ అంటేనే ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన క్రేజ్. ఆయన కోపం, జాలి గుండె గురించి అందరికీ తెలిసిందే. అయితే టాలీవుడ్‌లో బాలయ్యకు అత్యంత ఆత్మీయుడైన బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? మెగాస్టార్ చిరంజీవి అనుకుంటే పొరపాటే, అసలు వ్యక్తి ఎవరో ఈ కథనంలో చదివి తెలుసుకోండి.

Phani CH
|

Updated on: May 16, 2026 | 4:26 PM

Share
సినిమా రంగంలో శాశ్వత శత్రుత్వాలు, శాశ్వత మిత్రత్వాలు ఉండవని ఒక టాక్ ఉంది. కానీ, కొందరి విషయంలో మాత్రం ఇది అస్సలు వర్తించదు. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో నందమూరి బాలకృష్ణ స్టైలే వేరు. అరవై ఐదేళ్ల వయసులో కూడా కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ, బ్యాక్ టు బ్యాక్ హిట్‌లతో దూసుకుపోతున్నారు. సాధారణంగా బాలయ్య అంటే ఇండస్ట్రీలో ఒక రకమైన భయం, గౌరవం ఉంటాయి. ఆయనకు కోపం ఎక్కువ అని చాలా మంది అనుకుంటారు కానీ, ఆయన మనసు చిన్నపిల్లడి లాంటిదని సన్నిహితులు చెబుతుంటారు.

1 / 5
సినిమా పరిశ్రమలో అందరితో ఎంతో ఆప్యాయంగా ఉండే బాలకృష్ణకు అసలు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అనే చర్చ అభిమానుల్లో ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. చాలా మంది మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ సమకాలీనులు కావడంతో వీరిద్దరి మధ్యే మంచి బాండింగ్ ఉందని భావిస్తారు. బాక్సాఫీస్ వద్ద వీరి మధ్య ఎంతటి పోటీ ఉన్నా, వ్యక్తిగతంగా ఒకరినొకరు ఎంతో గౌరవించుకుంటారు.

2 / 5
అయితే, వీరిద్దరూ కలిసి బయట పెద్దగా కనిపించకపోవడంతో వీరి మధ్య ఏదో గ్యాప్ ఉందనే ప్రచారం కూడా సాగింది. కానీ నిజానికి బాలయ్య, చిరు మధ్య మంచి అనుబంధమే ఉంది. కాకపోతే, చిరంజీవి కంటే బాలకృష్ణకు ఇండస్ట్రీలో మరొక వ్యక్తితో అత్యంత ప్రాణస్నేహం ఉంది. ఆయనే సీనియర్ దర్శకుడు బి. గోపాల్.

3 / 5
బాలకృష్ణ కెరీర్ ప్రారంభం నుండి బి. గోపాల్‌తో ఆయనకు ప్రత్యేకమైన పరిచయం ఉంది. చాలా ఇంటర్వ్యూలలో బాలయ్య స్వయంగా ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. తన జీవితంలో అత్యంత దగ్గరైన వ్యక్తి బి. గోపాల్ అని ఆయన ఎన్నోసార్లు గర్వంగా చెప్పుకున్నారు. బాలకృష్ణను మాస్ హీరోగా నిలబెట్టడంలో, ఆయన కెరీర్‌ను మలుపు తిప్పడంలో బి. గోపాల్ పాత్ర ఎంతో కీలకం. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'సమరసింహారెడ్డి', 'నరసింహనాయుడు' వంటి చిత్రాలు టాలీవుడ్ చరిత్రలోనే ఇండస్ట్రీ హిట్ లుగా నిలిచాయి.

4 / 5
సరిగ్గా ఈ సినిమాల విజయాల ప్రయాణంలోనే వీరిద్దరి మధ్య కేవలం దర్శకుడు, హీరో సంబంధం మాత్రమే కాకుండా ఒక బలమైన స్నేహ బంధం ఏర్పడింది. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవడం వల్ల ఈ స్నేహం ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. అయితే స్నేహం అంటే కేవలం విజయాల్లోనే కాదు, అపజయాల్లోనూ తోడుండటం అని వీరిద్దరూ నిరూపించారు. బాలకృష్ణకు బి. గోపాల్ ఎంతటి భారీ బ్లాక్‌బస్టర్లు ఇచ్చారో, అంతే స్థాయిలో 'పలనాటి బ్రహ్మనాయుడు' లాంటి డిజాస్టర్ సినిమాను కూడా ఇచ్చారు. అయినా సరే, ఆ ప్లాప్ ప్రభావం వీరి స్నేహంపై ఎప్పుడూ పడలేదు.

5 / 5
Follow Us