AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది ఆరంభం మాత్రమే.. బాదుడు ముందుంది.. త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్!

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడ్ ఆయిల్) ధరలు బ్యారెల్‌కు 106-110 డాలర్లకు చేరడం, రూపాయి విలువ క్షీణించడం దేశంలో ఇంధన సంక్షోభానికి దారితీస్తోంది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం ఈ పరిస్థితిని మరింత తీవ్రం చేసింది. శుక్రవారం (మే 15) దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.3 చొప్పున పెరిగినప్పటికీ, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, రానున్న రోజుల్లో ధరలు మరింత పెరగడం ఖాయమని తెలుస్తోంది.

ఇది ఆరంభం మాత్రమే.. బాదుడు ముందుంది.. త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్!
Petrol And Diesel Prices
Balaraju Goud
|

Updated on: May 16, 2026 | 5:03 PM

Share

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడ్ ఆయిల్) ధరలు బ్యారెల్‌కు 106-110 డాలర్లకు చేరడం, రూపాయి విలువ క్షీణించడం దేశంలో ఇంధన సంక్షోభానికి దారితీస్తోంది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం ఈ పరిస్థితిని మరింత తీవ్రం చేసింది. శుక్రవారం (మే 15) దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.3 చొప్పున పెరిగినప్పటికీ, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, రానున్న రోజుల్లో ధరలు మరింత పెరగడం ఖాయమని తెలుస్తోంది.

ప్రస్తుత రూ.3 పెంపుతో ప్రభుత్వ రంగ చమురు కంపెనీల నష్టాల్లో కేవలం 10 శాతం మాత్రమే రికవరీ అయింది. ప్రస్తుతం కంపెనీలు పెట్రోల్‌పై లీటరుకు రూ.11-20, డీజిల్‌పై రూ.30-39 వరకు నష్టాన్ని భరిస్తున్నాయి. దీనివల్ల వీటికి రోజుకు రూ.500 నుండి రూ.1,000 కోట్ల మేర నష్టం వాటిల్లుతోంది. ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి ఈ మొత్తం నష్టాలు రూ.1 లక్ష కోట్లు దాటే ప్రమాదం ఉంది. ఇది గత ఏడాది లాభాలను సైతం తుడిచిపెట్టేలా ఉంది.

చమురు సంస్థలు ఈ భారీ నష్టాల నుంచి బయటపడాలంటే ఇంధన ధరలను మరో 20-30% (అంటే లీటరుకు రూ.20-30) పెంచడం అనివార్యంగా కనిపిస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో భారాన్ని ఒకేసారి ప్రజలపై మోపకుండా, క్రమంగా ధరలు పెంచుతామని కేంద్ర పెట్రోలియం మంత్రి హరదీప్ సింగ్ సంకేతాలిచ్చారు. ఏదేమైనా, ఈ ఇంధన ధరల పెరుగుదల వల్ల రవాణా ఖర్చులు పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతాయి. తద్వారా ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యుడి బడ్జెట్ తలకిందులు కానుంది. ఈ నేపథ్యంలో ఇంధన ఆదా, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాడకం వైపు ప్రజలు మళ్లాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us