AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEET లీక్ కేసులో విస్తుపోయే వాస్తవాలు.. ఆ ఇద్దరి వెనుక ఒకే మహిళ! ధనవంతుల పిల్లలే టార్గెట్‌

NEET-UG పేపర్ లీక్ కేసులో ఇద్దరు నిందితులను రౌజ్ అవెన్యూ కోర్టులో CBI అధికారులు హాజరుపరిచారు. నిన్న అరెస్టయిన మాస్టర్‌మైండ్ పీవీ కులకర్ణి, అతని సహాయకురాలు మనీషా వాఘ్మారేను హాజరుపరిచి CBI కస్టడీ కోరింది. మరోవైపు నీట్ పేపర్ లీక్ కేసులో దర్యాప్తు చేసే కొద్దీ విస్తుపోయే నిజాలు వెలుగులోకి..

NEET లీక్ కేసులో విస్తుపోయే వాస్తవాలు.. ఆ ఇద్దరి వెనుక ఒకే మహిళ! ధనవంతుల పిల్లలే టార్గెట్‌
NEET paper leak case
Srilakshmi C
|

Updated on: May 16, 2026 | 4:39 PM

Share

న్యూఢిల్లీ, మే 16: నీట్ పేపర్ లీక్ కేసులో మరో సంచలన విషయం బట్టబయలైంది. బయాలజీ పేపర్ లీక్ చేసిన మాస్టర్‌మైండ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పుణెకు చెందిన సీనియర్ బయాలజీ టీచర్ మనీషా గురునాథ్ మాంధరేను సీబీఐ అరెస్టు చేసింది. ఎన్టీఏ (NTA) నిపుణురాలిగా ఉంటూనే ప్రశ్నపత్రాలను కొల్లగొట్టిన మనీష. తన ఇంట్లోనే విద్యార్థులకు స్పెషల్ క్లాసులు పెట్టి బయాలజీ ప్రశ్నలు లీక్ చేసింది. మనీషా నోట్ చేయించిన ప్రశ్నలే నీట్ అసలు పేపర్‌లో రావడంతో నివ్వెరపోయిన అధికారులు. దీంతో దేశవ్యాప్తంగా 9 మందికి అరెస్టుల సంఖ్య చేరింది. నిందితులు విద్యార్ధుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు సీబీఐ గుర్తించింది. 6 ప్రాంతాల్లో సీబీఐ మెరుపు దాడులు చేసి కీలక ల్యాప్‌టాప్‌లు, బ్యాంక్ స్టేట్‌మెంట్లను స్వాధీనం చేసుకుంది.

NEET-UG పేపర్ లీక్ కేసులో ఇద్దరు నిందితులను రౌజ్ అవెన్యూ కోర్టులో CBI అధికారులు హాజరుపరిచారు. నిన్న అరెస్టయిన మాస్టర్‌మైండ్ పీవీ కులకర్ణి, అతని సహాయకురాలు మనీషా వాఘ్మారేను హాజరుపరిచి CBI కస్టడీ కోరింది. మరోవైపు నీట్ పేపర్ లీక్ కేసులో దర్యాప్తు చేసే కొద్దీ విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. నిన్న అరెస్ట్‌ అయిన కెమిస్ట్రీ ప్రొఫెసర్‌ కులకర్ణి, ఈ రోజు అరెస్ట్‌ అయిన బయాలజీ టీచర్‌ మనీషా ఇద్దరు మాస్టర్‌మైండ్ల వెనుక ఒకే మహిళ ఉండటం గమనార్హం. కెమిస్ట్రీ లెక్చరర్ కులకర్ణి, బయాలజీ టీచర్ మనీషా గురునాథ్‌తో కలిసి మనీషా వాఘ్మరే సిండికేట్‌గా వ్యవహరించింది.

ఎన్టీఏ (NTA) నిపుణులుగా ఉంటూనే పేపర్ లీక్ చేసిన కులకర్ణి, మనీషా గురునాథ్.. డబ్బున్న విద్యార్థులను వేటాడి స్పెషల్ క్లాసులకు రప్పించారు. ఇందుకు మధ్యవర్తిగా వ్వహరించింది మనీషా వాఘ్మరే. పేపర్ లీక్ కేసులో కీలకమైన మనీషా వాఘ్మరే బ్యాంక్ ఖాతాలు సీబీఐ సీజ్ చేసింది. సిండికేట్ గుట్టు విప్పే పనిలో ఉన్న అధికారులు.. త్వరలోనే మరిన్ని అరెస్టులకు తెర దించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.

Follow Us
NEET లీక్ కేసులో ఆ ఇద్దరివెనుక ఒకే మహిళ! ధనవంతుల పిల్లలే టార్గెట్
NEET లీక్ కేసులో ఆ ఇద్దరివెనుక ఒకే మహిళ! ధనవంతుల పిల్లలే టార్గెట్
ఫ్లైఓవర్ పై నుంచి దూకి యువతి సూసైడ్.. ప్రేమ వైఫల్యమే కారణమా!
ఫ్లైఓవర్ పై నుంచి దూకి యువతి సూసైడ్.. ప్రేమ వైఫల్యమే కారణమా!
పులి ఎదురైతే ఏం చేయాలి? నిజంగా మనుషులను తింటాయా? షాకింగ్‌ నిజాలు
పులి ఎదురైతే ఏం చేయాలి? నిజంగా మనుషులను తింటాయా? షాకింగ్‌ నిజాలు
ఊటీ పుష్పోత్సవంలో అద్భుత దృశ్యాలు, ప్రారంభ తేదీ వివరాలు..
ఊటీ పుష్పోత్సవంలో అద్భుత దృశ్యాలు, ప్రారంభ తేదీ వివరాలు..
ఆ హీరోలు రాత్రిళ్లు ఇంటికొచ్చి తలుపు కొట్టేవారు..
ఆ హీరోలు రాత్రిళ్లు ఇంటికొచ్చి తలుపు కొట్టేవారు..
ఫిల్మ్ ఇండస్ట్రీలో బాలయ్య బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా?
ఫిల్మ్ ఇండస్ట్రీలో బాలయ్య బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా?
శని బలంతో.. ఇక ఆ రాశుల వారి ఆదాయానికి లోటుండదు..!
శని బలంతో.. ఇక ఆ రాశుల వారి ఆదాయానికి లోటుండదు..!
జొన్న పిండి పకోడి.. ఫ్యామిలీ అందరూ హాయిగా తినొచ్చు
జొన్న పిండి పకోడి.. ఫ్యామిలీ అందరూ హాయిగా తినొచ్చు
భారత్, ఆఫ్ఘాన్ టెస్ట్ సిరీస్.. కోహ్లీ ప్లేస్ రీప్లేస్ చేసేది ఇతడే
భారత్, ఆఫ్ఘాన్ టెస్ట్ సిరీస్.. కోహ్లీ ప్లేస్ రీప్లేస్ చేసేది ఇతడే
NEET పేపర్‌ లీక్‌లో మరో అరెస్ట్.. బయాలజీ టీచరమ్మ గుట్టురట్టు!
NEET పేపర్‌ లీక్‌లో మరో అరెస్ట్.. బయాలజీ టీచరమ్మ గుట్టురట్టు!