భారత దేశంలోని అందాలను వర్ణించ తగదు. ఇక్కడ ఎన్నో రకాల రంగు రంగుల పూలు ప్రకృతి ఒడిలో పురుడుపోసుకున్నాయి.
భారత్
అందమైన పూలు, చెట్లు, జలపాతాలతో అందంగా ఉంటుంది. కాగా, మనం ఇండియాలో కనిపించే అరుదైన నీలి రంగు పూల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అదమైన పూలు, జలపాతాలు
కొండ నీలి పువ్వులు. ఇవి ఎక్కువగా పశ్చిమ కనుమలు, తూర్పు హిమాలయాలలో కనిపిస్తాయి. ఇవి చాలా అరుదుగా పూసే పూలు.
కొండ నీలి పూలు
హిమాలయన్ బ్లూ పాపీ, చల్లని ఎడారులలో 3000 మీటర్ల కంటే చాలా ఎత్తులో ఈ పూలు పూస్తాయి. వీటి సాగు చాలా కష్టతరం.
హిమాలయన్ బ్లూ పాపీ
నీలకురింజి, ఇది ఒక మాయా పుష్పం అని చెప్పాలి. ఈ రకం పూలు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వికసిస్తుంది. పశ్చిమ కనుమలు, మున్నార్‌లో కనిపిస్తాయి.
నీలకురింజి
బ్లూ వాండా, ప్రపంచంలో సహజంగా నీలి రంగులో ఉండే కొన్ని ఆర్కిడ్‌లలో ఇదిద ఒకటి. అరుణాచల్ ప్రదేశ్‌లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. కానీ అంతరించిపోయే పూలలో ఇదొక్కటి
బ్లూ వాండా ఫ్లవర్స్
కర్వి పువ్వు, ఇది ప్రతి 8 సంవత్సరాలకు ఒకసారి ఎక్కువ సంఖ్యలో పూస్తాయి. ఉదా రంగులో ఉండే ఈ పూలు అడవికే అందాన్ని తీసుకొస్తాయి.
కర్విపువ్వు
చెరువుల్లో, సరస్సుల్లో నీలి కలువలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి భారత దేశంలోని ఉష్ణమండల ప్రాంతంలో ఎక్కువ కనిపిస్తాయి.