AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weekly Horoscope: ఈ వారం వారికి ధనయోగం.. ఎవరికి అదృష్టం కలిసొస్తుందంటే..?

వార ఫలాలు (మే 17-23, 2026): మేష రాశి వారికి ఈ వారం ఆశించిన స్థాయిలో సంపాదన పెరుగుతుంది. విలాసాల మీద బాగా ఖర్చు చేస్తారు. వృషభ రాశి వారికి అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందడంతో పాటు ఆర్థిక సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. మిథున రాశి వారికి ఉద్యోగం సజావుగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 16, 2026 | 4:00 PM

Share
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): వారమంతా చాలావరకు ప్రోత్సాహకరంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. రాశ్యధిపతి కుజుడు ఈ రాశిలోనే బాగా అనుకూలంగా ఉన్నందువల్ల సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. గురు, రాహువుల బలం కూడా అధికంగా ఉన్నందువల్ల  ముఖ్యమైన ప్రయత్నాలు, ఆలోచనలు కలిసివస్తాయి. ఆశించిన స్థాయిలో సంపాదన పెరుగుతుంది. విలాసాల మీద బాగా ఖర్చు చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు తిరుగుండదు. వ్యాపారాలు బాగా లాభసాటిగా పురోగమిస్తాయి. ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. జీవిత భాగస్వామితో సానుకూలత ఏర్పడుతుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం, ఎవరికీ హామీలు ఉండకపోవడం, వాగ్దానాలు చేయకపోవడం ఉత్తమం.

1 / 12
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): రాశ్యధిపతి శుక్రుడు ధన స్థానాధిపతి బుదుడితో పరివర్తన చెందడం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందడంతో పాటు ఆర్థిక సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా, ఎటువంటి పని ప్రారంభించినా తప్పకుండా విజయవంతమవుతుంది. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయం బాగానే ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు, షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిసాయి. శత్రు, రోగ, రుణ బాధలు అదుపులో ఉంటాయి. సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడికి లోటుండదు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు అనుకూల ఫలితాలనిస్తాయి. ఆశించిన శుభవార్తలు అందుతాయి.

2 / 12
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఉద్యోగం సజావుగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. వారమంతా సానుకూలంగా, సామరస్యంగా పురోగమిస్తుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. శని, గురు గ్రహాల సంచారంతో పాటు, శుక్ర, రవి, కుజుల సంచారం కూడా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయం బాగా పెరగడం, ఆర్థిక ప్రయత్నాలు కలిసి రావడం వంటివి జరుగుతాయి. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. తోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా, సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. మిత్రుల వివాదాల్లో మధ్యవర్తిగా వ్యవహరించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కలిసి భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

3 / 12
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): బుధ, కుజ, రవి గ్రహాల బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వారమంతా సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో సానుకూల పరిస్థితులు నెలకొంటాయి. క్షణం కూడా తీరిక లేకుండా గడిచిపోతుంది. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలను, కొన్ని అవసర పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. అనుకోకుండా ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో సహచరుల నుంచి సహకారం ఉంటుంది. ఆహార, విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి. ఇష్టమైన మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. జీవిత భాగస్వామి నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.

4 / 12
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): లాభ స్థానంలో గురు, శుక్రులు, దశమంలో రవి, బుధులు సంచరిస్తున్న కారణంగా ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరిగే సూచనలున్నాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఏ రంగానికి చెందినవారైనప్పటికీ ఎక్కువగా సానుకూల ఫలితాలు అనుభవానికి వస్తాయి. కుటుంబానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేయడం జరుగుతుంది. అష్టమ శని కారణంగా ఇంటా బయటా పని ఒత్తిడి తప్పకపోవచ్చు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో కొద్దిగా ఆశాభంగం చెందే సూచనలున్నాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.

5 / 12
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): భాగ్య, దశమ స్థానాలో రవి, శుక్ర, బుధులు, దశమ స్థానంలో గురువు సంచారం అనుకూలంగా ఉన్నందు వల్ల ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది. ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు అప్రయత్నంగా పరి ష్కారం అవుతాయి. అతి తక్కువ ప్రయత్నంతో అతి ఎక్కువ ఫలితం పొందుతారు. అత్యవసర పనులు తేలికగా పూర్తవుతాయి. ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించడంలో సహోద్యోగుల సహకారం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. పిల్లల చదువుల విషయంలో ఆశించిన సమాచారం అందుతుంది. దూరపు బంధువుల్లో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.

6 / 12
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): రాశ్యధిపతి శుక్రుడు, గురువు భాగ్య స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఈ వారమంతా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగిపోతాయి. గురు, శనుల బలంతో పాటు రవి, కుజులు కూడా అనుకూలంగా మారినందు వల్ల కొన్ని వ్యక్తిగత పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా సాగుతాయి. సర్వత్రా మీ మాట చెల్లుబాటు అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారాలు చాలావరకు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతాయి. కొన్ని అత్యవసర వ్యవహారాలను మిత్రుల సహాయంతో పూర్తి చేస్తారు. పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

7 / 12
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): రాశ్యధిపతి కుజుడు షష్ట స్థానంలో సంచారం వల్ల ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా సమసిపోయే అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. బంధుమిత్రులు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. శుభ వార్తలు వినడం, అనుకోకుండా ఒక శుభ పరిణామం కూడా చోటు చేసుకోవడం జరుగుతుంది. ఆశించిన స్థాయిలో ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. వృత్తి జీవితం ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. వ్యాపారాలకు ఇబ్బందేమీ ఉండదు. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. వారం ద్వితీయార్థంలో కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది.

8 / 12
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): రాశ్యధిపతి గురువు సప్తమ స్థానంలో శుక్రుడితో కలిసి ఉండడం వల్ల తృతీయ స్థానంలో రాహు గ్రహ సంచారం వల్ల రాజపూజ్యాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో విలువ పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు కనిపిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు లభిస్తాయి. బాగా పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం అవుతారు. పిల్లల నుంచి ఆశించిన సానుకూల సమాచారం అందుతుంది. ఎటువంటి సమస్యనైనా పరిష్కరించుకోగలుగుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. నిరుద్యోగులకు ఒక మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. ఒకరిద్దరు సన్నిహితులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది.

9 / 12
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఈ వారమంతా మిశ్రమంగా గడిచిపోతుంది. పంచమ స్థానంలో రవి, బుధులు, తృతీయ స్థానంలో రాశ్యధిపతి శనీశ్వరుడి సంచారం కారణంగా ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. అయితే, ఆదాయానికి మించి ఖర్చు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల నుంచి ఆదరణ ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి కొద్దిగా మాత్రమే పెరిగే అవకాశం ఉంది. తలపెట్టిన పనులు, వ్యవహారాలు వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలకు, పెళ్లి ప్రయత్నాలకు ఆటంకాలు తొలగుతాయి. కుటుంబ జీవితంలో అనుకోకుండా చికాకులు తలెత్తే సూచనలున్నాయి. ఒక శుభ కార్యంలో ఇష్ట మైన బంధువుల్ని కలుసుకునే అవకాశం ఉంది. పిల్లల నుంచి ఆశించిన శుభ వార్తలు వింటారు.

10 / 12
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): చతుర్థ, పంచమాధిపతులైన బుధ, శుక్రుల మధ్య పరివర్తన జరగడం వల్ల వృత్తి, వ్యాపారాల్లో అనుకున్నవి అనుకున్నట్టు సాగిపోతాయి. ఆదాయానికి లోటుండదు. షేర్లు, స్పెక్యులేషన్లు కూడా బాగా లాభిస్తాయి. ఉద్యోగంలో సానుకూల పరిస్థితులుంటాయి. అధికారులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. సోదరులతో స్థిరాస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఏలిన్నాటి శని దోషం కారణంగా అప్పుడప్పుడూ కుటుంబంలో టెన్షన్లు తలెత్తే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాల మీద ఎక్కువగా దృష్టి పెట్టాల్సి వస్తుంది. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన సమాచారం అందుతుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది.

11 / 12
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): రాశ్యధిపతి గురువు చతుర్థ స్థానంలో శుక్రుడితో కలవడం వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన రాబడి చేతికి వచ్చే అవకాశం ఉంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు కానీ, ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. కొద్దిపాటి ప్రయత్నంతో ఉద్యోగంలో అధికారులతో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంటా బయటా గౌరవమర్యాదలు బాగా పెరుగుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలను తేలికగా పూర్తి చేస్తారు. నష్టదాయక వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. మంచి ఆఫర్లు అందుతాయి.

12 / 12
Follow Us