AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటర్ అర్హతతో ఆర్మీలో జాబ్ + ఫ్రీ ఇంజినీరింగ్! గోల్డెన్ ఛాన్స్ మిస్ అవ్వద్దు

Indian Army TES 56 Recruitment 2026: ఇంటర్మీడియట్ పూర్తయ్యాక బీఈ/బీటెక్ చేయాలనుకునే వారికి ఇండియన్ ఆర్మీ మంచి అవకాశం ఇస్తోంది. 2027 జనవరిలో ప్రారంభమయ్యే TES-56 కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఉచిత ఇంజినీరింగ్ విద్య + మిలటరీ ట్రైనింగ్ అందుతుంది. కోర్సు పూర్తయ్యాక నేరుగా లెఫ్టినెంట్ ఆఫీసర్‌గా ఇండియన్ ఆర్మీలో చేరే అవకాశం ఉంటుంది.

ఇంటర్ అర్హతతో ఆర్మీలో జాబ్ + ఫ్రీ ఇంజినీరింగ్! గోల్డెన్ ఛాన్స్ మిస్ అవ్వద్దు
Army Jobs
Rajashekher G
|

Updated on: May 16, 2026 | 5:39 PM

Share

Indian Army Recruitment 2026: ఇంటర్మీడియట్ పూర్తయ్యాక బీఈ/బీటెక్ చేయాలని చూస్తున్న యువతకు ఇండియన్ ఆర్మీ మంచి అవకాశాన్ని అందిస్తోంది. 2027 జనవరిలో ప్రారంభమయ్యే 56వ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ (TES-56) కోసం భారత సైన్యం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎంపికైన అభ్యర్థులకు ఇంజినీరింగ్ విద్యతో పాటు మిలటరీ ట్రైనింగ్ కూడా పూర్తిగా ఉచితంగా అందుతుంది. తర్వాత నేరుగా లెఫ్టినెంట్ స్థాయి ఆఫీసర్‌గా సైన్యంలో చేరే అవకాశం ఉంటుంది.

అర్హతలు

ఈ స్కీమ్‌కు 10+2 (ఇంటర్మీడియట్) పూర్తి చేసిన అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే JEE (Main) 2026 పరీక్షకు హాజరైనవారు మాత్రమే అప్లై చేయగలరు.

వయో పరిమితి

2027 జనవరి 1 నాటికి అభ్యర్థుల వయస్సు 16.5 నుంచి 19.5 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం

ఎంపిక ప్రక్రియలో ప్రధానంగా ఈ దశలు ఉంటాయి:

  1. JEE Main స్కోర్ ఆధారంగా షార్ట్‌లిస్టింగ్
  2. SSB ఇంటర్వ్యూ (స్టేజ్ 1 & స్టేజ్ 2)
  3. మెడికల్ పరీక్షలు
  4. ఈ అన్ని దశల్లో ఉత్తీర్ణత సాధించిన వారిని తుది ఎంపిక చేస్తారు.

శిక్షణ & కోర్సు వివరాలు

  • TES ద్వారా ఎంపికైన అభ్యర్థులకు మొత్తం నాలుగు సంవత్సరాల శిక్షణ ఉంటుంది.
  • మొదటి 3 సంవత్సరాలు పుణే, సికింద్రాబాద్, మౌ వంటి ఆర్మీ కేంద్రాల్లో బేసిక్ మిలిటరీ ట్రైనింగ్‌తో పాటు బీటెక్ విద్య చివరి సంవత్సరం డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ (IMA)లో ఫైనల్ ట్రైనింగ్
  • కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత అభ్యర్థులకు ఇంజినీరింగ్ డిగ్రీతో పాటు ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ హోదాలో ఉద్యోగం లభిస్తుంది.

స్టైపెండ్ & జీతం

ట్రైనింగ్ సమయంలో నెలకు సుమారు రూ.15,500 స్టైపెండ్ అందుతుంది. శిక్షణ పూర్తయ్యాక లెఫ్టినెంట్ స్థాయిలో రూ.56,100 నుంచి రూ.1,77,500 వరకు బేసిక్ పేతో పాటు డీఏ, హెచ్‌ఆర్‌ఎ వంటి అలవెన్సులు కూడా ఉంటాయి.

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తుల ప్రారంభం: మే 13, 2026
  • చివరి తేదీ: జూన్ 12, 2026

దరఖాస్తు విధానం:

ఇక్కడ అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్ పూర్తిచేసిన యువతకు ఇది సైన్యంలో కెరీర్ ప్రారంభించడానికి ఒక మంచి అవకాశం. అర్హతలు ఉన్నవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్