AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garlic Chicken Roast: నీళ్లు కలపకుండా చేసే వెల్లుల్లి చికెన్ రోస్ట్.. ఇదుంటే గిన్నెడు అన్నం లాగించేస్తారు..

చికెన్ వంటకాల్లో ఫ్రై ముక్కలకు ఉండే క్రేజే వేరు. అందులోనూ నెయ్యి మరియు వెల్లుల్లి కాంబినేషన్‌లో వచ్చే సువాసన చెప్తుంటేనే ఆకలిని పెంచేస్తుంది. నీళ్లు అస్సలు పోయకుండా, చికెన్ ముక్కల నుండి వచ్చే సహజ సిద్ధమైన నీటితోనే మంటను అదుపు చేస్తూ చేసే ఈ 'వెల్లుల్లి చికెన్ రోస్ట్' బ్యాచిలర్స్ కూడా కేవలం కొన్ని నిమిషాల్లోనే వండేయవచ్చు. ముక్క ముక్కకూ వెల్లుల్లి ఘాటు, నెయ్యి కమ్మదనం తగిలే ఈ స్పెషల్ రెసిపీ తయారీ విధానం ఈ కథనంలో మీకోసం..

Garlic Chicken Roast: నీళ్లు కలపకుండా చేసే వెల్లుల్లి చికెన్ రోస్ట్.. ఇదుంటే గిన్నెడు అన్నం లాగించేస్తారు..
Garlic Chicken Roast Recipe
Bhavani
|

Updated on: May 16, 2026 | 5:29 PM

Share

హోటల్ స్టైల్‌లో స్టార్టర్స్ తినడానికి ఇష్టపడే వారికి ఈ గార్లిక్ చికెన్ రోస్ట్ బెస్ట్ ఆప్షన్. వెల్లుల్లిలోని ఔషధ గుణాలు జీర్ణక్రియకు మేలు చేయడమే కాకుండా నాన్‌వెజ్ వంటకాలకు అదనపు రుచిని ఇస్తాయి. తక్కువ పదార్థాలతో, తక్కువ సమయంలోనే నోరూరించేలా ఈ చికెన్ ఫ్రై ఎలా చేయాలో, ఆ మసాలాల సీక్రెట్ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు:

చికెన్: 200 గ్రాములు (చిన్న ముక్కలుగా కట్ చేసినవి)

వెల్లుల్లి రెబ్బలు: 15 నుండి 20 (సన్నగా తరిగినవి లేదా దంచినవి)

ఎండు మిరపకాయలు: 4 లేదా 5 (మీ కారానికి తగినట్లుగా)

అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టీస్పూన్

పసుపు పొడి: అర టీస్పూన్

కరివేపాకు & కొత్తిమీర: గుప్పెడు

నెయ్యి: అవసరమైనంత (ఫ్రై కోసం)

ఉప్పు: రుచికి సరిపడా

తయారీ విధానం: 1. సీక్రెట్ వెల్లుల్లి మసాలా తయారీ: ముందుగా ఒక బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి. అందులో దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిరపకాయలు వేసి అవి గోల్డెన్ బ్రౌన్ (బంగారు గోధుమ) రంగు వచ్చే వరకు బాగా వేయించాలి. చివరగా కరివేపాకు కూడా వేసి వేగాక, వాటన్నింటినీ తీసి మిక్సీలో బరకగా (లేదా పొడిగా) రుబ్బి పక్కన పెట్టుకోవాలి.

2. చికెన్ ఉడికించడం (నీళ్లు లేకుండా): ఇప్పుడు అదే బాణలిలో మరికొద్దిగా నెయ్యి వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు చికెన్ ముక్కలను వేయాలి. అందులోనే పసుపు, రుచికి సరిపడా ఉప్పు, మరికొన్ని దంచిన వెల్లుల్లి, రెండు ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఇక్కడ అస్సలు నీళ్లు పోయకూడదు. చికెన్ ముక్కల నుండి వచ్చే నీరే దాన్ని ఉడికించడానికి సరిపోతుంది. మూత పెట్టి మధ్యస్థ మంటపై 10-12 నిమిషాలు ఉడికించాలి.

3. మసాలా మిక్సింగ్ & రోస్ట్: చికెన్ ముక్కలు ముప్పావు వంతు (75%) ఉడికిన తర్వాత.. మనం ముందుగా సిద్ధం చేసుకున్న వెల్లుల్లి-ఎండుమిర్చి మసాలా పొడిని అందులో చల్లాలి. మసాలా అంతా చికెన్ ముక్కలకు బాగా పట్టి, డ్రైగా (రోస్ట్‌లా) అయ్యే వరకు లో-ఫ్లేమ్‌లో కలుపుతూ వేయించాలి.

4. సర్వింగ్: ముక్కలు బాగా వేగి నెయ్యి పైకి తేలుతున్నప్పుడు, పైనుంచి సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుంటే చాలు.. ఘుమఘుమలాడే వెల్లుల్లి చికెన్ రోస్ట్ సిద్ధం!

Follow Us