Kombucha Tea: కొంబుచా టీ తాగితే శరీరంలో జరిగేది ఇదే!
ఉదయం లేవగానే టీ కానీ కాఫీ కానీ ఏదో ఒకటి పడాల్సిందే. లేదంటే ఇంకా నిద్రలోనే ఉన్నట్టు ఉంటుంది. ఇంకెంత మందికి అయితే బెడ్ మీదే టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఏదో రోజుకు రెండు సార్లు తాగితే పర్వాలేదు కానీ.. అంతకు మించి తాగితే మాత్రం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.ఈ టీలు తాగడం వల్ల షుగర్, బీపీ, క్యాన్సర్ వంటివి రావచ్చు. కాబట్టి వీటిని మితంగా తీసుకుంటేనే బెనిఫిట్స్ ఉంటాయి. ఇక టీలో ఎన్నో రకాల రకాలు వచ్చాయి. ఒక్కటేంటి..

ఉదయం లేవగానే టీ కానీ కాఫీ కానీ ఏదో ఒకటి పడాల్సిందే. లేదంటే ఇంకా నిద్రలోనే ఉన్నట్టు ఉంటుంది. ఇంకెంత మందికి అయితే బెడ్ మీదే టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఏదో రోజుకు రెండు సార్లు తాగితే పర్వాలేదు కానీ.. అంతకు మించి తాగితే మాత్రం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.ఈ టీలు తాగడం వల్ల షుగర్, బీపీ, క్యాన్సర్ వంటివి రావచ్చు. కాబట్టి వీటిని మితంగా తీసుకుంటేనే బెనిఫిట్స్ ఉంటాయి. ఇక టీలో ఎన్నో రకాల రకాలు వచ్చాయి. ఒక్కటేంటి.. ఓ పెద్ద లిస్టే ఉంటుంది. వీటిల్లో చాలా టీలు ఎంతో ఆరోగ్యకరమైనవి కూడా ఉన్నాయి. వీటిల్లో కొంబుచా టీ కూడా ఒకటి. ఈ టీ అనేది పులియబెట్టి తయారు చేసే పానీయం. దీనికి పెద్ద చరిత్రే ఉంది. ఈ టీని మొట్టమొదట చైనాలో కనిపెట్టారని చెబుతున్నారు. మరి ఈ టీని ఎలా తయారు చేస్తారు? ఈ టీ తాగడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో.. ఇప్పుడు చూద్దాం.
జీర్ణ క్రియ మెరుగు పడుతుంది:
కొంబుచా టీ తాగడం వల్ల ముందుగా జీర్ణ క్రియ అనేది మెరుగు పడుతుంది. ఎందుకంటే ఈ టీలో ప్రోబయోటిక్స్ అనేవి మెండుగా ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థలోని మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు హెల్ప్ చేస్తాయి.
రోగ నిరోధక శక్తి పెరుగుతుంది:
ఈ టీ తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తిని పెరుగుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. అంతే కాకుండా వివిధ అనారోగ్య సమస్యలు దరి చేరకుండా చేస్తాయి.
క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది:
కొంబుచా టీ తాగితే క్యాన్సర్ కణాల పెరుగుదలను నియంత్రిస్తాయని.. పలు అధ్యయనాల్లో తేలింది. కాబట్టి ఈ టీ తాగడం వల్ల క్యాన్సర్ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.
గుండె ఆరోగ్యం పదిలం:
ఈ టీ తాగడం వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. ఇందులో ఉండేవి ఆరోగ్యకరమైన పదార్థాలు. కాబట్టి ఇవి రక్త పోటును తగ్గించి, శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. దీంతో గుండె సమస్యలు రాకుండా ఉంటాయి.
చర్మానికి మంచిది:
ఈ టీ తాగడం వల్ల చర్మానికి కూడా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షించి.. ముడతలు, వృద్ధాప్య ఛాయలు, డల్ నెస్‌ను తగ్గించి.. యంగ్‌గా ఉండేలా చేస్తుంది.
కొంబుచా టీని ఎలా తయారు చేస్తారు?
ఈ టీని.. బ్లాక్ టీలో చక్కెర, ఈస్ట్ కలిపి కొన్ని రోజులు పులియబెడతారు. దీంతో ఈ టీ ఆరోగ్యంగా తయారవుతుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)








