Tips for Piles: ఇదొక్కటి తీసుకుంటే.. పైల్స్ సమస్య మాయం అయిపోతుంది..
ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసినా రోగాలు ఎక్కువై పోతున్నాయి. కొత్త కొత్త రోగాలు పరిచయం అవుతున్నాయి. ఇందుకు ప్రధానమైన కారణం లైఫ్ స్టైల్ విధానం, ఆహారాపు అలవాట్లు మారడం. ఇప్పుడున్న కాలంలో ఎంతో మంది ఇబ్బంది పడే సమస్య పైల్స్. ఈ సమస్య ఉన్నవారు ఎక్కడ కాసేపు కూర్చోలేరు.. నిల్చోలేరు. మల విసర్జన సమయంలో కూడా తీవ్రమైన దురద, నొప్పి, రక్త స్రావం ఉంటుంది. ఈ సమస్యను మొదట్లోనే గుర్తించి..

ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసినా రోగాలు ఎక్కువై పోతున్నాయి. కొత్త కొత్త రోగాలు పరిచయం అవుతున్నాయి. ఇందుకు ప్రధానమైన కారణం లైఫ్ స్టైల్ విధానం, ఆహారాపు అలవాట్లు మారడం. ఇప్పుడున్న కాలంలో ఎంతో మంది ఇబ్బంది పడే సమస్య పైల్స్. ఈ సమస్య ఉన్నవారు ఎక్కడ కాసేపు కూర్చోలేరు.. నిల్చోలేరు. మల విసర్జన సమయంలో కూడా తీవ్రమైన దురద, నొప్పి, రక్త స్రావం ఉంటుంది. ఈ సమస్యను మొదట్లోనే గుర్తించి.. తగిన చికిత్స తీసుకుంటే.. త్వరితగతిన బయట పడొచ్చు. లేదంటే మాత్రం ఈ సమస్య తీవ్రమై చాలా సమస్యలకు దారి తీయవచ్చు. ఇంటి వద్ద తగిన జాగ్రత్తలు తీసుకుంటే.. డాక్టర్ సూచనలను కూడా పాటిస్తూ ఉండాలి. ఇప్పుడు చెప్పే ఈ చిట్కాలను ఫాలో అయితే త్వరగా ఈ సమస్య నుంచి రిలీఫ్ పొందొచ్చు. పైల్స్ సమస్య నుంచి బయట పడటానికి వాము చక్కగా సహాయ పడుతుంది.
పైల్స్ సమస్యకు పరిష్కారం:
కొద్దిగా వాము, నల్ల ఉప్పు ముందు మిక్సీలో వేసి పొడిలా చేయాలి. ఇందులోనే పెరుగు కూడా వేసి ఓ రెండు రౌండ్లు తిప్పండి. దీన్ని ఓ పెద్ద గిన్నెలో వేసుకుని.. పల్చగా అయ్యేంత వరకూ నీటిని కలపాలి. ఈ మజ్జిగను ఉదయం, సాయంత్రం రెండు పూటలా తాగాలి. ఇలా పైల్స్ సమస్య తగ్గేంత వరకూ ఈ టిప్ పాటిస్తూ ఉంటే.. బెస్ట్ రిలీఫ్ దొరుకుతుంది.
వాము మజ్జిగ తాగడం వల్ల ప్రయోజనాలు:
* ఈ మజ్జిగలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా లభ్యమవుతాయి. ఈ మజ్జిగ తాగడం వల్ల ఇన్ ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటారు.
* ఈ మజ్జిగ తాగడం వల్ల శరీరానికి చాలా చలువ చేస్తుంది. మలబద్ధకం సమయంలో వచ్చే నొప్పి, దురద తగ్గుతాయి.
* జీర్ణ సమస్యల నుంచి కూడా ఉపశమనం పొదవచ్చు. కడుపులో నొప్పి, ఉబ్బరం, వాపు, మలబద్ధకం వంటి సమస్యల నుంచి బయట పడతారు.
* ఈ మజ్జిగను తాగడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దీంతో సీజనల్ వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది.
* కేవలం పైల్స్ ఉన్నవారే కాకుండా.. ఈ మజ్జిగను ఎవరైనా తాగవచ్చు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)








