AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu Foods: చంద్రబాబు నాయుడు ఏం తింటారో తెలుసా.. ఇలా తింటే ఆరోగ్యం మీ సొంతం!

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన హోరా హోరీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. త్వరలోనే చంద్రబాబు.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వయసు 74. ఈ వయసులో కూడా ఆయన ఇంత చురుగ్గా.. ఓ పార్టీని నడిపిస్తున్నారంటే.. మామూలు విషయం కాదు. మరి చంద్రబాబు నాయుడు ఇంత ఆరోగ్యంగా ఉండటానికి ఆయన ఏం తింటారు? ఎలాంటి డైట్ ఫాలో అవుతారు? ఎక్కువగా ఏం తింటారో..

Chandrababu Foods: చంద్రబాబు నాయుడు ఏం తింటారో తెలుసా.. ఇలా తింటే ఆరోగ్యం మీ సొంతం!
Chandrababu
Chinni Enni
|

Updated on: Jun 06, 2024 | 3:38 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన హోరా హోరీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. త్వరలోనే చంద్రబాబు.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వయసు 74. ఈ వయసులో కూడా ఆయన ఇంత చురుగ్గా.. ఓ పార్టీని నడిపిస్తున్నారంటే.. మామూలు విషయం కాదు. మరి చంద్రబాబు నాయుడు ఇంత ఆరోగ్యంగా ఉండటానికి ఆయన ఏం తింటారు? ఎలాంటి డైట్ ఫాలో అవుతారు? ఎక్కువగా ఏం తింటారో.. ఇప్పుడు తెలుసుకుందాం.

చంద్రబాబు నాయుడు తినే ఆహారం గురించి ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తను బతకడం కోసం తింటాను తప్ప.. తినడం కోసం బతకను అని చెప్పారు. ఆయన తీసుకునే ఆహారం చాలా సింపుల్‌గా ఉంటుందని వెల్లడించారు. ఎలాంటి ఆహారం పడితే అది తీసుకోనని.. కేవలం ఆరోగ్యంగా ఉండేవి మాత్రమే తింటానని తెలిపారు. ఎంత తింటున్నాం.. ఎన్ని క్యాలరీలు ఖర్చు అవుతున్నాయని లెక్కలు వేసుకుంటానని వెల్లడించారు.

చంద్రబాబు తినే డైట్ చాట్ ఇదే:

ఉదయం: ఇడ్లీ, జొన్న ఇడ్లీ, రాగి ఇడ్లీ, ఓట్స్ ఉప్మా, రెండు దోశలు, కొద్దిగా చట్నీ, రెండు ఉడకబెట్టిన గుడ్లు. వీటిల్లో ఏదో ఒక బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటారు. అలాగే బ్రేక్ ఫాస్ట్‌కి లంచ్‌కి మధ్యలో ఓ పండు.

ఇవి కూడా చదవండి

మధ్యాహ్నం: రాగి, జొన్న, సజ్జలతో చేసిన రొట్టెలు లేదా అన్నం, రెండు, మూడు కూరలు. నూనె ఎక్కువగా లేనివి, కొద్దిగా పెరుగు. లంచ్‌కు ఈవెనింగ్ స్నాక్స్‌కు మధ్యలో కొన్ని నట్స్ లేదంటే జ్యూస్.

సాయంత్రం: ఏదైనా ఒక సూప్, కొద్దిగా స్నాక్స్, ఎగ్ వైట్.

రాత్రి: రాత్రి పడుకునే ముందు కేవలం ఒక గ్లాస్ పాలు మాత్రమే. మరీ ఎక్కువగా ఆకలి వేస్తే ఒక చిన్న పండు.

అదే విధంగా నేను ఆరు నుంచి ఏడు గంటల నిద్ర పోతానని వెల్లడించారు. ఈ డైట్ ఫాలో అవుతూ.. వాకింగ్ లేదా చిన్న చిన్న వ్యాయామాలు చేస్తానని చంద్రబాబు వెల్లడించారు. తిన్న ఫుడ్స్ బట్టి ఒక్కోసారి వ్యాయామాలు కూడా మారతాయట. ఇలా చంద్రబాబు డైట్ ఉంటుంది. బాబు ఎక్కడ ఉన్నా.. ఈ డైట్ అనేది ఫాలో అవుతానని ఓసారి చెప్పారు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
చాణక్యుని 4 సూత్రాలతో మీ రోజును మొదలుపెడితే జీవితంలో విజయం ఖాయం
చాణక్యుని 4 సూత్రాలతో మీ రోజును మొదలుపెడితే జీవితంలో విజయం ఖాయం
మండే ఎండల్లో మిమ్మల్ని చలచల్లగా ఉంచే సూపర్ డ్రింక్స్.. తాగేద్దామా
మండే ఎండల్లో మిమ్మల్ని చలచల్లగా ఉంచే సూపర్ డ్రింక్స్.. తాగేద్దామా
వాస్తు టిప్స్: తడి బట్టలు ఇంట్లో ఆరేస్తున్నారా..అదృష్టం పోయినట్లే
వాస్తు టిప్స్: తడి బట్టలు ఇంట్లో ఆరేస్తున్నారా..అదృష్టం పోయినట్లే