Arjuna Bark Benefits: అర్జున బెరడు.. ఆరోగ్యానికి అమృతం..! ప్రాణాంతక వ్యాధులకు రామబాణం..!

ఈ కషాయాన్ని రోజూ తీసుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అర్జున బెరడు గొంతు ఇన్‌ఫెక్షన్‌ను పోగొట్టడంలోనూ ప్రభావవంతంగా పనిచేస్తుంది. దగ్గు, ఇన్‌ఫెక్షన్, గొంతు నొప్పి, జలుబు వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అర్జున ట్యాబ్లెట్లు, పౌడర్ కూడా మార్కెట్‌లో దొరుకుతున్నాయి.

Arjuna Bark Benefits: అర్జున బెరడు.. ఆరోగ్యానికి అమృతం..! ప్రాణాంతక వ్యాధులకు రామబాణం..!
Benefits Of Arjun Bark
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 06, 2024 | 2:21 PM

ఆయుర్వేదంలో అనేక చెట్లు, మొక్కలు వాటి ప్రయోజనాల గురించి వివరించారు. ఈ చెట్లలో ఎక్కువ భాగం అడవుల్లోనే కనిపిస్తాయి. వాటి బెరడు నుంచి ఆకుల వరకు ఎన్నో వ్యాధులకు ఉపయోగపడతాయి. అలాంటిదే అర్జున బెరడు కూడా. అర్జున వృక్షాన్ని మీరు తప్పక చూసే ఉంటారు. కానీ, ఈ చెట్టులోని ఔషధ గుణాల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అర్జున బెరడు ఆయుర్వేద ఔషధంగా పరిగణించబడుతుంది. ఇది అనేక రకాల వ్యాధులను నయం చేస్తుంది. ఇది గుండె బ్లాక్ లను తొలగించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు షుగర్ వ్యాధిగ్రస్తులకు కూడా అద్భుతమైన మూలికగా చెప్పవచ్చు. అర్జున బెరడు ప్రయోజనాలను ఆయుర్వేదంలో గొప్ప ఔషధంగా వర్ణించారు.

అర్జున మొక్క ఎన్నో ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. అందుకే దీనిని ఋగ్వేదంలో కూడా ప్రస్తావించారు. అర్జున బెరడు శరీరాన్ని అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది. అర్జున బెరడు వాడకం గుండె సంబంధిత వ్యాధులకు దివ్యౌషధం వంటిది. హార్ట్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్, హార్ట్ ఫెయిల్యూర్ వంటి అనేక గుండె సంబంధిత వ్యాధులలో అర్జున బెరడు ఉపయోగం, దాని ప్రయోజనాలపై ఇప్పటివరకు చాలా అధ్యయనాలు జరిగాయి. ఆయుర్వేదంలో కషాయాల రూపంలో వాడే ప్రస్తావన ఉంది. అర్జున బెరడులో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం లభిస్తాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. శరీరంలోని అనేక రకాల సమస్యలను దూరం చేస్తుందని తెలిపారు. ఇది కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంతోపాటు SDL స్థాయిని పెంచుతుంది.

హార్ట్ బ్లాక్ బాధితుల్లో సమస్యను తొలగించడంలో ఈ బెరడు కషాయం దోహదపడుతుంది. అంతేకాదు, ఇది శరీరంలో ఇన్సులిన్ స్థాయిని పెంచుతుంది. ఇది చక్కెరను నియంత్రణలో ఉంచుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంతో వ్యాధుల నుండి రక్షిస్తుంది. అర్జున బెరడు చిన్న ముక్కను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం దానిని మరిగించి, వడపోసి త్రాగాలి. ఈ కషాయాన్ని రోజూ తీసుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అర్జున బెరడు గొంతు ఇన్‌ఫెక్షన్‌ను పోగొట్టడంలోనూ ప్రభావవంతంగా పనిచేస్తుంది. దగ్గు, ఇన్‌ఫెక్షన్, గొంతు నొప్పి, జలుబు వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అర్జున ట్యాబ్లెట్లు, పౌడర్ కూడా మార్కెట్‌లో దొరుకుతున్నాయి.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే