వాడేసిన మెడిసిన్‌ కవర్లు పారేయకండి.. ఇలా వాడితే మీ కిచెన్‌ మెరుస్తుంది.. చూస్తే వావ్ అనాల్సిందే..!

మాడిపోయిన వంటపాత్రలను శుభ్రం చేయడానికి ఇబ్బందులు పడాల్సిందే. ఇందుకోసం చాలా మంది సబ్బును వాడుతుంటారు. మరికొందరు దీన్ని శుభ్రం చేసుందుకు బూడిదను కూడా ఉపయోగిస్తారు. అయినప్పటిలా వంటపాత్రలకు మునుపటి మెరుపు తీసుకురాలేకపోతారు. అలాంటప్పుడు ఈ వంటగది చిట్కాలు మీకు సహాయపడతాయి.

వాడేసిన మెడిసిన్‌ కవర్లు పారేయకండి.. ఇలా వాడితే మీ కిచెన్‌ మెరుస్తుంది.. చూస్తే వావ్ అనాల్సిందే..!
Medicineraper
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 06, 2024 | 1:43 PM

వంటగదిలో అనేక రకాల పాత్రలు ఉపయోగిస్తుంటారు. కడాయి, తవా ఇలా అనే ఆయా వంటల కోసం అనేక రకాల పాత్రలను వాడుతుంటాం.. ఇక వంట చేసే క్రమంలో పాత్రలు మాడిపోవడం సహాజంగానే జరుగుతూ ఉంటుంది. పాత్రలు మాడిపోవడం వల్ల నల్లగా మారుతుంటాయి. మాడిపోయిన వంటపాత్రలను శుభ్రం చేయడానికి ఇబ్బందులు పడాల్సిందే. ఇందుకోసం చాలా మంది సబ్బును వాడుతుంటారు. మరికొందరు దీన్ని శుభ్రం చేసుందుకు బూడిదను కూడా ఉపయోగిస్తారు. అయినప్పటిలా వంటపాత్రలకు మునుపటి మెరుపు తీసుకురాలేకపోతారు. అలాంటప్పుడు ఈ వంటగది చిట్కాలు మీకు సహాయపడతాయి.

మీ వంటింట్లో మాడగొట్టిన వంటపాత్రలను తిరిగి కొత్తవిగా చూడాలనుకుంటే ఈ టిప్స్‌ మీకు సహయపడతాయి. ఇందుకోసం మీరు మీ ఇంట్లో ఉన్న ఖాళీ మందు పన్నీలు ఉంటే చాలు. వాడేసిన మందుల పన్నీలను పరేయకుండా నిల్వ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఖాళీ మెడిసిన్ రేపర్లు మీ వంటగది పనిని సులభతరం చేస్తాయి. వంట చేస్తుండగా మాడిపోయిన కడాయి, పాన్‌ మునుపటిలా మెరవాలంటే.. ముందుగా దానిపై ఉప్పు, స్వీట్ సోడా లేదా ఇనో వేయండి.. ఇప్పుడు దానిపై కొద్దిగా వేడినీరు పోయాలి. ఇప్పుడు మెడిసిన్ రేపర్ సహాయంతో 2-4 నిమిషాలు రుద్దండి. ఈ ట్రిక్ వాడకంతో మీ వంటింట్లోని తవా, లేదంటే పాన్ మునుపెన్నడూ లేని విధంగా మెరుస్తుంది.

అలాగే, కత్తెరకు పదును పెట్టండి.. మొండిబారిన కత్తెర అంచులకు పదును పెట్టేందుకు కూడా మెడిసిన్‌ కవర్‌ ఉపయోగపడుతుంది. ఇంట్లో ఉపయోగించే కత్తెర అంచు మెడిసిన్‌ కవర్ సహాయంతో పదును పెట్టవచ్చు. ఇందుకోసం ముందుగా ఒక రేపర్ తీసుకోవాలి. అదే మొండిబారిన కత్తెరతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తూ ఉండాలి. దీన్ని కనీసం రెండు నుండి మూడు నిమిషాల పాటు చేస్తూ ఉంటే..కత్తెర అంచు చాలా పదునుగా మారుతుంది.

ఇవి కూడా చదవండి

అలాగే, మిక్సర్ గ్రైండర్ బ్లేడ్ పదును పెట్టుకోవచ్చు…

మీరు మిక్సర్ గ్రైండర్ బ్లేడ్‌లను మెడిసిన్ రేపర్‌తో పదును పెట్టవచ్చు. దీని కోసం ముందుగా కత్తెరతో మెడిసిన్ రేపర్ చిన్న ముక్కలను కత్తిరించుకోవాలి. ఆ తర్వాత ముక్కలన్నీ ఒక మిక్సీ జార్‌లో వేసి రెండు నిమిషాలపాటు తిప్పాలి. ఈ ట్రిక్ సహాయంతో, మిక్సర్ బ్లేడ్ అంచు పదునుగా మారుతుంది.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే