Heart Diseases Tests: మీ గుండె ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవాలంటే.. ఈ టెస్టులు బెస్ట్!

శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగాల్లో గుండె కూడా ఒకటి. గుండె ఆరోగ్యంగా పని చేస్తే.. మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. ప్రస్తుత కాలంలో గుండె సంబంధిత వ్యాధులు బాగా ఎక్కువ అవుతున్నాయి. వయసు పైబడిన వారిలోనే కాకుండా.. యంగ్ ఏజ్‌లో ఉన్నవారు కూడా హఠాత్తుగా గుండె పోటుతో అక్కడికక్కడే మరణిస్తున్న విషయం మనం వార్తల్లో చూస్తూనే ఉంటున్నాం. కాబట్టి ఈ కాలంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే గుండె వ్యాధుల్ని సకాలంలో..

Heart Diseases Tests: మీ గుండె ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవాలంటే.. ఈ టెస్టులు బెస్ట్!
Heart Health
Follow us
Chinni Enni

|

Updated on: Oct 01, 2024 | 2:41 PM

శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగాల్లో గుండె కూడా ఒకటి. గుండె ఆరోగ్యంగా పని చేస్తే.. మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. ప్రస్తుత కాలంలో గుండె సంబంధిత వ్యాధులు బాగా ఎక్కువ అవుతున్నాయి. వయసు పైబడిన వారిలోనే కాకుండా.. యంగ్ ఏజ్‌లో ఉన్నవారు కూడా హఠాత్తుగా గుండె పోటుతో అక్కడికక్కడే మరణిస్తున్న విషయం మనం వార్తల్లో చూస్తూనే ఉంటున్నాం. కాబట్టి ఈ కాలంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే గుండె వ్యాధుల్ని సకాలంలో గుర్తించగలగాలి. గుండె వ్యాధుల్ని గుర్తించేలా చాలా రకాల పరీక్షలు ఉన్నాయి. వీటి ద్వారా మనం ఎప్పటికప్పుడు గుండె ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవచ్చు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం,

ఎమైనో టర్మినల్ ప్రో బ్రెన్ నాట్రిప్యూరిటిక్ పెప్టైడ్ టెస్ట్:

గుండె ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకునేందుకు.. ఎమైనో టర్మినల్ ప్రో బ్రెన్ నాట్రిప్యూరిటిక్ పెప్టైడ్ ఈ టెస్ట్ చేసుకోవచ్చు. ఈ టెస్ట్‌లో ముప్పు ఎక్కువగా ఉందని తేలితే ఇంకొన్ని ఇమేజింగ్ పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఈసీజీ, ఈకో కార్డియోగ్రఫీ, స్ట్రెస్ టెస్ట్, కరోనరీ యాంజియోగ్రఫీ వంటి టెస్టులు చేయాలి.

సీఆర్పీ టెస్ట్:

ఈ టెస్ట్ చేయడం వల్ల కూడా గుండె పని తీరును కనిపెట్టవచ్చు. ఈ టెస్ట్ ద్వారా రక్తంలో స్వెల్లింగ్ ఎలా ఉందో తెలుస్తుంది. స్వెల్లింగ్ ఉంటే గుండె వ్యాధికి సంకేతం కావచ్చు.

ఇవి కూడా చదవండి

లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్:

లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్‌నే కొలెస్ట్రాల్ పరీక్ష అని కూడా చెబుతారు. ఈ పరీక్ష చాలా మందికి తెలుసు. ఇది శరీరంలో, గుండెపై కొవ్వు ఎలా ఉందో చెబుతుంది. ఇందులో ట్రై గ్లిజరాయిడ్స్, హెచ్‌డీఎల్, ఎల్‌డీఎల్ లెవల్స్ తెలుస్తాయి. వీటిల్లో హెచ్‌డీఎల్, ట్రై గ్లిజరాయిడ్స్ ఎక్కువగా ఉంటే గుండెకు ముప్పు ఉందని అంచనా వేసుకోవచ్చు.

సీరమ్ క్రియాటిన్:

ఈ టెస్ట్ మూత్ర పిండాలకు సంబంధించిన పరీక్షే అయినా.. గుండెకు కూడా లిక్ అయి ఉంటుంది. కిడ్నీలు సరిగా పని చేయకపోతే.. అది గుండెపై కూడా ఒత్తిడిని తీసుకొస్తుంది. కాబట్టి ఈ టెస్ట్ ద్వారా కిడ్నీలు, గుండె ఆరోగ్యం కూడా తెలుసుకోవచ్చు.

హిమోగ్లోబిన్ ఏ1 సి:

ఈ టెస్ట్ డయాబెటీస్‌కి సంబంధించింది. కానీ దీని ద్వారా గుండె ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడిందో కూడా తెలుసుకోవచ్చు. డయాబెటీస్, అధిక బరువు సమస్యలు ఉన్నా కూడా గుండెపై ఎఫెక్ట్ పడుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!