Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Blood Cancer: ఈ లక్షణాలు కనిపించాయంటే బ్లడ్ క్యాన్సరే..

ప్రస్తుత కాలంలో ఎక్కువ వినిపిస్తున్న అనారోగ్య సమస్యల్లో క్యాన్సర్ కూడా ఒకటి. ఈ మధ్య కాలంలో క్యాన్సర్ భూతం దారుణంగా వ్యాపిస్తుంది. పది మందిలో ఒకరు ఖచ్చితంగా క్యాన్సర్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు క్యాన్సర్‌ వ్యాధికి గురవుతున్నారు. ఈ క్యాన్సర్‌లో చాలా రకాలు ఉన్నాయి. జనాల్లో ఎంతలా అవగాహన కనిపిస్తున్నా రోజు రోజుకీ ఈ సమస్య పెరిగి పోతూనే ఉంది. క్యాన్సర్లలో బ్లడ్ క్యాన్సర్ కూడా ఒకటి. ఇది అత్యంత సాధారణ రకం. బ్లడ్ క్యాన్సర్ అనేది రక్త..

Blood Cancer: ఈ లక్షణాలు కనిపించాయంటే బ్లడ్ క్యాన్సరే..
Blood Cancer
Chinni Enni
|

Updated on: Sep 18, 2024 | 5:11 PM

Share

ప్రస్తుత కాలంలో ఎక్కువ వినిపిస్తున్న అనారోగ్య సమస్యల్లో క్యాన్సర్ కూడా ఒకటి. ఈ మధ్య కాలంలో క్యాన్సర్ భూతం దారుణంగా వ్యాపిస్తుంది. పది మందిలో ఒకరు ఖచ్చితంగా క్యాన్సర్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు క్యాన్సర్‌ వ్యాధికి గురవుతున్నారు. ఈ క్యాన్సర్‌లో చాలా రకాలు ఉన్నాయి. జనాల్లో ఎంతలా అవగాహన కనిపిస్తున్నా రోజు రోజుకీ ఈ సమస్య పెరిగి పోతూనే ఉంది. క్యాన్సర్లలో బ్లడ్ క్యాన్సర్ కూడా ఒకటి. ఇది అత్యంత సాధారణ రకం. బ్లడ్ క్యాన్సర్ అనేది రక్త కణాలు, ఎముక మజ్జలని ప్రభావితం చేసే ఒక క్యాన్సర్. ఇది తెల్ల రక్త కణాల అసాధారణ ఉత్పత్తి వల్ల వస్తుంది. బ్లడ్ క్యాన్సర్‌ను మొదటి నుంచి కూడా గుర్తించవచ్చు. మరి ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

తరచూ ఇన్ ఫెక్షన్ల బారిన పడతారు:

బ్లడ్ క్యాన్సర్‌ బారిన పడే వ్యక్తులు తరచుగా ఇన్ ఫెక్షన్ల బారిన పడుతూ ఉంటారు. రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా జ్వరం, కీళ్ల నొప్పులు ఉంటాయి. చాలా అసలటగా నిరసంగా ఉంటారు.

రక్త స్రావం ఎక్కువగా:

చిన్న చిన్న గాయాలు అయినా ఎక్కువగా రక్త స్రావం అవుతూ ఉంటుంది. ఏం చేసినా త్వరగా కట్టడి కాదు. ఇలా జరుగుతున్నప్పుడు ఎక్కువగా నిర్లక్ష్యం చేయకూడదు.

ఇవి కూడా చదవండి

అసాధారణ రక్త స్రావం:

బ్లడ్ క్యాన్సర్ బారిన పడ్డవారికి దెబ్బలు, గాయాలు కాకపోయినా అసాధారణంగా రక్త స్రావం అవుతూ ఉంటుంది. ముక్కు, నోరు, మలం, మూత్ర మార్గాల నుండి రక్త స్రావం అనేది అసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇలా మీలో కనిపించినప్పుడు వెంటనే వైద్యుల్ని సంప్రదించడం మేలు.

కీళ్ల నొప్పులు అధికం:

ఎముకలు లేదా కీళ్లలో నిరంతరంగా నొప్పులు వస్తూనే ఉంటాయి. ఎలాంటి ట్యాబ్లెట్స్ వేసుకున్నా ఈ నొప్పలు అనేవి అస్సలు కంట్రోల్ అవవు. ఎలాంటి పనులు చేయకపోయినా.. కీళ్ల నొప్పులు, ఎముకలు ఎక్కువగా నొప్పులు వస్తాయి. ఇలా ఉంటే నిర్లక్ష్యం చేయకూడదు.

బరువు తగ్గిపోతారు:

బ్లడ్ క్యాన్సర్‌తో బాధ పడేవారు అకారణంగా బరువు తగ్గిపోతారు. ఉన్నట్టుండి మీరు బరువు తగ్గినట్టు అనిపిస్తే.. చాలా కారణాలు ఉంటాయి. వాటిల్లో బ్లడ్ క్యాన్సర్ కూడా ఒకటి. కాబట్టి జాగ్రత్తలు అవసరం.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..