ఓరీ దేవుడో.. ఇలాంటి వెల్లుల్లిని తింటే కోమాలోకి వెళ్లటం ఖాయం…! నిపుణుల హెచ్చరిక

వాస్తవానికి వెల్లుల్లి అనేది ఆయుర్వేదంలో దివ్యౌషధంగా చెబుతారు. జలుబు నుంచి రక్తపోటు వరకు అన్నింటికీ అద్భుతంగా పనిచేస్తుంది. వెల్లుల్లిలో విటమిన్ సి, విటమిన్ బి6, మాంగనీస్, సెలేనియం ఉంటాయి. అయితే ఇప్పుడు మార్కెట్‌లోకి అక్రమంగా ప్రవేశించిన వెల్లుల్లిలో విషపూరితమైన కెమికల్స్ ఉన్నాయనే నిపుణుల హెచ్చరికతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

ఓరీ దేవుడో.. ఇలాంటి వెల్లుల్లిని తింటే కోమాలోకి వెళ్లటం ఖాయం...! నిపుణుల హెచ్చరిక
Chinese Garlica
Follow us

|

Updated on: Sep 18, 2024 | 4:24 PM

గత కొంతకాలంగా భారత మార్కెట్‌లో కల్తీ ఆహారం ఎక్కువైంది. పప్పులు, ఉప్పు, పాలు, నూనె, స్వీట్లు సహా వంటింట్లో ఉపయోగించే వెల్లుల్లికి సైతం నకిలీ మకిలీ అంటుకుంది. ప్రస్తుతం మార్కెట్లో విషపూరిత వెల్లుల్లి విక్రయాలు యద్ధేచ్ఛగా జరుగుతున్నాయనే వార్తలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. నివేదికల ప్రకారం 2014లో నిషేధించిన చైనా వెల్లుల్లి ఇప్పుడు మన దేశంలో అక్రమంగా అమ్ముతున్నారనే వార్తలు వస్తున్నాయి. నిషేధించిన వెల్లుల్లిలో పెద్దమొత్తంలో క్రిమి సంహారక పదార్ధాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వాస్తవానికి వెల్లుల్లి అనేది ఆయుర్వేదంలో దివ్యౌషధంగా చెబుతారు. జలుబు నుంచి రక్తపోటు వరకు అన్నింటికీ అద్భుతంగా పనిచేస్తుంది. వెల్లుల్లిలో విటమిన్ సి, విటమిన్ బి6, మాంగనీస్, సెలేనియం ఉంటాయి. అయితే ఇప్పుడు మార్కెట్‌లోకి అక్రమంగా ప్రవేశించిన చైనీస్‌ వెల్లుల్లిలో విషపూరితమైన కెమికల్స్ ఉన్నాయనే నిపుణుల హెచ్చరికతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ వెల్లుల్లికి ఫంగస్ పట్టకుండా ఉండేందుకు చైనా మిథైల్ బ్రోమైడ్ మిక్స్ అయిన ఒక ఫంగీసైడ్‌ను వినియోగించిందని జాదవ్ పూర్ యూనివర్శిటీ ప్రొఫెసర్ ఒకరు తెలిపారు. అంతేకాకుండా క్లోరిన్ కూడా వినియోగించారని తేలింది. దీనివల్ల వెల్లుల్లిలో ఉండే క్రిములు నాశనమవుతాయి. వెల్లుల్లి కూడా తెల్లగా తాజాగా కన్పిస్తుందని చెబుతున్నారు.

చైనీస్ వెల్లుల్లిలో కలిపే మిథైల్ బ్రోమైడ్ చాలా హానికారకం అంటున్నారు నిపుణులు. ఇదొక విషపూరితమైన రంగులేని గ్యాస్. దీన్ని క్రిమి సంహారక పనులకు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇది ఎక్కువ మోతాదులో వాడితే ఆరోగ్యానికి హానికరం అంటున్నారు నిపుణులు. మిథైల్ బ్రోమైడ్ కారణంగా ఊపిరితిత్తులు, కళ్లు, చర్మానికి హాని కలుగుతుంది. ఒక్కోసారి మనిషి కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు. అందుకే మార్కెట్‌లో లభించే వెల్లుల్లితో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. చైనా వెల్లుల్లి రెమ్మలు పరిమాణంలో పెద్దవిగా ఉంటాయి.. తొక్కలపై బ్లూ, పర్పుల్ కలర్ గీతలు కన్పిస్తాయని చెబుతున్నారు. ఇలాంటి వెల్లుల్లి కన్పిస్తే పొరపాటున కూడా తీసుకోవద్దని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

వెల్లుల్లి మార్కెట్లోనే అతిపెద్ద ఉత్పత్తిదారుగా చైనా ఉంది. చైనాలో పండించే వెల్లుల్లిని ఆధునిక వ్యవసాయ పద్ధతులను ఉపయోగించి పండిస్తారు. ఇందులో రసాయనాలు, పురుగుమందులు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ వ్యవసాయ పద్ధతులు చైనీస్ వెల్లుల్లి పట్ల ఆందోళనలను లేవనెత్తాయి. ఈ కారణంగానే 2014లో భారతదేశం దాని దిగుమతిపై నిషేధాన్ని విధించింది. అయినప్పటికీ, చైనీస్ వెల్లుల్లి చౌకగా లభిస్తుంది. కాబట్టి, వ్యాపారులకు లాభదాయకంగా ఉన్నందున అక్రమ రవాణా కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కోవిడ్ ఎఫెక్ట్స్ ఇంత దారుణంగా ఉంటాయా.? అందుకే ఇంత త్వరగా మరణాలా.?
కోవిడ్ ఎఫెక్ట్స్ ఇంత దారుణంగా ఉంటాయా.? అందుకే ఇంత త్వరగా మరణాలా.?
మీరు కాఫీ ప్రియులా.. అయితే ఈ న్యూస్‌ మీకోసమే.!
మీరు కాఫీ ప్రియులా.. అయితే ఈ న్యూస్‌ మీకోసమే.!
పొలంలో అదే.. పంప్‌సెట్‌ పక్కన అదే.! కొండచిలువ కలకలం..
పొలంలో అదే.. పంప్‌సెట్‌ పక్కన అదే.! కొండచిలువ కలకలం..
నాకు బోల్డ్‌గా స్టోరీ చెప్పారు.!అందుకే ఉప్పెనను వదులుకున్నా..
నాకు బోల్డ్‌గా స్టోరీ చెప్పారు.!అందుకే ఉప్పెనను వదులుకున్నా..
సిద్ధార్థ్-అదితికి ఎన్ని ఆస్తులు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
సిద్ధార్థ్-అదితికి ఎన్ని ఆస్తులు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్టార్ కమెడియన్ సునీల్ వైఫ్ ఫోటో.!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్టార్ కమెడియన్ సునీల్ వైఫ్ ఫోటో.!
త్రివిక్రమ్‌కే ఓటేసిన బన్నీ.! మరి అట్లీ తో సినిమా పరిస్థితి ఏంటి?
త్రివిక్రమ్‌కే ఓటేసిన బన్నీ.! మరి అట్లీ తో సినిమా పరిస్థితి ఏంటి?
69 సినిమానే ని నమ్ముకున్న దళపతి విజయ్.! ఎందుకు అంత నమ్మకం.
69 సినిమానే ని నమ్ముకున్న దళపతి విజయ్.! ఎందుకు అంత నమ్మకం.
మహిళా వేధింపుల కమిటీపై హీరోయిన్ కామెంట్స్.! ఎలాంటి కమిటీలు వద్దు!
మహిళా వేధింపుల కమిటీపై హీరోయిన్ కామెంట్స్.! ఎలాంటి కమిటీలు వద్దు!
రిలీజ్‌కు ముందే రికార్డ్స్‌ క్రియేట్ చేసిన దేవర|అసలు ఏది నమ్మాలి?
రిలీజ్‌కు ముందే రికార్డ్స్‌ క్రియేట్ చేసిన దేవర|అసలు ఏది నమ్మాలి?