వార్నీ ఇదేం అలవాటు..! భర్త రోజూ స్నానం చేయట్లేదని పెళ్లైన 40 రోజులకే విడాకులు కోరిన భార్య

పోలీసులతో చర్చించిన తర్వాత ఆమె భర్త తన అలవాటును మార్చుకుంటానని ప్రతి రోజూ స్నానం చేయడానికి అంగీకరించినట్లుగా తెలిసింది. కానీ, అతని భార్య అతనితో కలిసి ఉండటానికి ఇష్టపడటం లేదని తెలిసింది. తదుపరి పరిష్కారం కోసం సెప్టెంబరు 22న కౌన్సెలింగ్ కేంద్రానికి తిరిగి రావాలని దంపతులకు సూచించినట్టుగా సమాచారం.

వార్నీ ఇదేం అలవాటు..! భర్త రోజూ స్నానం చేయట్లేదని పెళ్లైన 40 రోజులకే విడాకులు కోరిన భార్య
Up Woman Files For Divorce
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 17, 2024 | 8:26 PM

జీవితంలో పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇళ్లు, పరిసరాల పరిశుభ్రతతో పాటు ఒంటి పరిశుభ్రత కూడా అంతే ముఖ్యం. పరిశుభ్రతతో వ్యాధులను దూరం చేసుకోవచ్చు. అయితే, ఓ వ్యక్తి మాత్రం రోజుల తరబడి స్నానం చేయకుండా ఉంటున్నాడు. సదరు వ్యక్తి ప్రవర్తనతో విసిగిపోయిన అతని భార్య అతని నుంచి విడాకులు కోరుతూ కోర్టుకెక్కింది. ఇలాంటి షాకింగ్‌ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో చోటు చేసుకుంది. రాజేష్ అనే వ్యక్తి నెలకు ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే స్నానం చేసేవాడు. దీంతో అతని భార్య విసుగెత్తిపోయింది. చివరకు ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన ఓ వ్యక్తికి స్నానం చేయడం అంటే ఎక్కడాలేని బద్ధకం ఉంటుందట. దీంతో అతని భార్య పెళ్లైన 40 రోజులకే విడాకులు కోరింది. భర్త నెలకు 1 లేదా 2 రోజులు మాత్రమే స్నానం చేస్తున్నాడని, శరీరం నుంచి వచ్చే దుర్వాసనను భరించలేకపోతున్నానని, పెళ్లైనప్పటి నుంచి 6 సార్లు మాత్రమే స్నానం చేశాడని, వారానికోసారి గంగాజలం చల్లుకుంటాడని ఆగ్రాలోని ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించింది. దీంతో ఈ నెల 22న కౌన్సెలింగ్ సెంటర్ కు రావాలని భార్యాభర్తలిద్దరికీ అధికారులు సూచించారు.

ఆ తరువాత మహిళ కుటుంబం స్థానిక పోలీస్ స్టేషన్‌లో వరకట్న వేధింపుల ఫిర్యాదును దాఖలు చేసి విడాకులు కోరింది. పోలీసులతో చర్చించిన తర్వాత ఆమె భర్త తన అలవాటును మార్చుకుంటానని ప్రతి రోజూ స్నానం చేయడానికి అంగీకరించినట్లుగా తెలిసింది. కానీ, అతని భార్య అతనితో కలిసి ఉండటానికి ఇష్టపడటం లేదని తెలిసింది. తదుపరి పరిష్కారం కోసం సెప్టెంబరు 22న కౌన్సెలింగ్ కేంద్రానికి తిరిగి రావాలని దంపతులకు సూచించినట్టుగా సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..