బాబోయ్‌.. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన సాలీడు.. కుడితే అరగంటలోనే చావు ఖాయం..!

ఈ సాలెపురుగు కుట్టినప్పుడు దీని విషం శరీరంలోకి చేరి నిమిషాల్లోనే నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. తక్షణ చికిత్స అందించకుంటే, అరగంటలోనే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఈ సాలెపురుగు కాటు వల్ల మనుషులకు ప్రాణాపాయం ఉంటుంది. కానీ,

బాబోయ్‌.. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన సాలీడు.. కుడితే అరగంటలోనే చావు ఖాయం..!
World's Most Deadly Spiders
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 17, 2024 | 7:32 PM

సాలె పురుగు విషపూరితమైనది అంటే నమ్మగలరా..? కానీ, ఇది నిజమేనండోయ్.. అలాంటిది అత్యంత విషపూరితమైన సాలెపురుగును గుర్తించారు పరిశోధకులు. ఈ విషపూరిత సాలీడు కుడితే..అరగంటలోనే చావు ఖాయం అంటున్నారు శాస్త్రవేత్తలు. ‘సిడ్నీ ఫన్నెల్‌ వెబ్‌ స్పైడర్‌’ ప్రపంచంలోని సాలెపురుగుల్లోకెల్లా ఇది అత్యంత ప్రమాదకరమైనదిగా వెల్లడించారు.. ఇది కుట్టినప్పుడు శరీరంలోకి చేరే విషపదార్థాలు నిమిషాల్లోనే నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయని చెప్పారు. తక్షణ చికిత్స అందించకుంటే, అరగంటలోనే ప్రాణాలు పోయే పరిస్థితి తలెత్తుతుంది.

ప్రపంచంలోనే సాలెపురుగుల్లోకెల్లా అత్యంత ప్రమాదకరమైనది ‘సిడ్నీ ఫన్నెల్‌ వెబ్‌ స్పైడర్‌’. ఈ సాలెపురుగు ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరానికి 100 కి.మీ వ్యాసార్ధం పరిధిలోని అడవుల్లో ఎక్కువగా కనిపిస్తుందని చెప్పారు. ఈ సాలెపురుగు కుట్టినప్పుడు దీని విషం శరీరంలోకి చేరి నిమిషాల్లోనే నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. తక్షణ చికిత్స అందించకుంటే, అరగంటలోనే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఈ సాలెపురుగు కాటు వల్ల మనుషులకు ప్రాణాపాయం ఉంటుంది. కానీ, కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులకు ఎలాంటి ప్రమాదం ఉండదు.

ఇటీవలే, బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తికి సాలీడు కుట్టడంతో అతని ఆరోగ్య పరిస్థితి విషమించింది. కొద్ది రోజుల్లోనే సాలీడు కుట్టిన చోట పొట్టపై పుండులా ఏర్పడింది. ఆ ప్రాంతంలో పెద్ద రంధ్రం ఏర్పడి కుళ్లిపోయిన కండ ముక్కలు ముక్కలుగా జారి కిందపడిపోయింది. రాను రాను రంధ్ర పెద్దది కాసాగింది. దీంతో అతడు రోజుల తరబడి ఆస్పత్రిలోనే ఉండిపోవాల్సి వచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..