Palm Rubbing Benefits: అరచేతిని రుద్దడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. ఔరా అనాల్సిందే..!
కొంతమందికి ఉదయం నిద్రలేవగానే తమ రెండు చేతులను రుద్దుతుంటారు. అయితే, ఇది వారికి సాధారణ అలవాటు కావొచ్చు..కానీ ఇలా చేయడం వెనుక కారణం ఏమిటి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా.? ఇలా చేయడం వల్ల నిజంగా ఏమైనా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా, దీనిపై నిపుణులు ఏమంటున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
అరచేతులు చేతులు రుద్దడం వల్ల శక్తి బూస్ట్ లభిస్తుంది. కళ్లకు మేలు చేస్తుంది. ఆందోళన సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. మెరుగైన రక్త ప్రసరణ జరిగేలా చేస్తుంది. ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత మీరు చేయవలసిన మొదటి పని మీ రెండు అరచేతులను రుద్దడం..అలా రుద్దేటప్పుడు ఉత్పన్నమయ్యే వేడితో మీ కళ్లను వేడి చేయడం. ఇలా చేయడం వల్ల నిద్ర లేవడానికి సహాయపడుతుంది. ఇలా చేయడం వల్ల శరీరంలో తక్షణ శక్తి పుంజుకుంటుంది. చేతులు రుద్దడం వల్ల కలిగే 5 అద్భుతమైన ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకుందాం..
ఉదయాన్నే రెండు అరచేతులను రుద్దడం వల్ల టెన్షన్, ఒత్తిడి తగ్గుతాయి. అరచేతులను రుద్దడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇది మెదడుకు ప్రశాంతత, విశ్రాంతిని ఇస్తుంది. ఈ చిన్న కార్యాచరణతో మీరు మానసిక ఒత్తిడి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.
ఉదయాన్నే నిద్రలేచి 2-3 నిమిషాల పాటు రెండు అరచేతులను రుద్దితే ఆ సమయంలో కలిగే అనుభూతికి మనస్సు చురుగ్గా మారుతుంది. మెదడు వెంటనే చర్య మోడ్‌లోకి వెళ్లమని సందేశాన్ని అందుకుంటుంది. ఇది మీ దృష్టిని మెరుగుపరుస్తుంది. దీంతో చేస్తున్న పని, చదువులపై దృష్టి పెట్టడం సులభం అవుతుంది.
అరచేతులను రుద్దడం వల్ల ఏకాగ్రతను మెరుగుపరచడంలో, విషయాలను మరింత మెరుగ్గా అర్థం చేసుకునే సామర్థ్యాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది. అరచేతులను రుద్దడం వల్ల మీ మానసిక స్థితి పెరుగుతుంది. మన చేతులను 2 నిమిషాల పాటు గట్టిగా రుద్దడం వల్ల మెదడులో సంతోషకరమైన హార్మోన్లు విడుదలవుతాయి. సంతోషకరమైన హార్మోన్ల ప్రభావం కారణంగా, మానసిక స్థితి బాగుంటుంది. చిరాకు తగ్గుతుంది.
మీరు నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నట్టయితే.. ఈ రోజు నుండే ఈ 2 నిమిషాల వ్యాయామం చేయడం ప్రారంభించండి. మీ చేతులను రుద్దడం వలన మీ మనస్సుకు విశ్రాంతి లభిస్తుంది. రాత్రి పడుకునే ముందు చేతులను రుద్దుకుంటే మంచి నిద్ర వస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరికొద్ది రోజుల్లో చలికాలం ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో చేతులు రుద్దడం వల్ల వెచ్చదనం వస్తుంది. చలికాలంలో చేతులు రుద్దడం వల్ల వేళ్లు దృఢత్వం తగ్గుతుంది. వణుకు కూడా పోతుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..