AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: శునక వైభోగం చూడతరమా..! మోడల్‌ని మించి మేక్‌ఓవర్‌.. అంబానీ, అదాని వారింటి కుక్క కాబోలు..

నెయిల్ కట్టర్ తో నెయిల్స్ కట్ చేశారు. పంజాలను మృదువుగా చేయడానికి మసాజ్ స్పెషల్‌ క్రీమ్‌ ఒకటి అప్లై చేశారు. తరువాత, ముక్కుపై కూడా మరో క్రీమ్ అప్లై చేశారు. ఆఖరుగా దానికి ఓ కాస్ట్లీపెర్ఫ్యూమ్ కూడా కొట్టారు. ఇప్పటికీ ఈ డాగ్‌ మేకోవర్‌ పూర్తైంది. ఇప్పుడు ఈ కుక్క జాలీ రైడ్‌కు రెడీ అయ్యింది.

Watch: శునక వైభోగం చూడతరమా..! మోడల్‌ని మించి మేక్‌ఓవర్‌.. అంబానీ, అదాని వారింటి కుక్క కాబోలు..
Dog Royal Bath
Jyothi Gadda
|

Updated on: Sep 17, 2024 | 4:56 PM

Share

సాధారణంగా కుక్క, పిల్లి వంటి పెంపుడు జంతువులకు యజమానులు వాటిని షాంపూతో స్నానం చేయించడం, హెయిర్‌ కోంబ్‌ చేయటం చేస్తుంటారు. వాటి ఆహారం విషయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ, పెంపుడు జంతువులను మనుషుల కంటే మెరుగ్గా జాగ్రత్తలు తీసుకోవడం, నవ వధువు కంటే ఎక్కువ మేక్ఓవర్‌ చేయటం ఎక్కడా చూశారా..? అయితే మీ కోసం ఈ వీడియో.. వీడియో చూస్తే అంబానీ-అదానీ వంటి ధనవంతుల ఇళ్లలో పెరిగే కుక్కలకు ఎంత రాచరికం దొరుకుతుందో మీకే అర్థమవుతుంది.

సోషల్ వీడియోలో కుక్క మేక్ఓవర్ వీడియో వైరల్‌గా మారింది. మేకప్‌ను ఇష్టపడే ఈ కుక్క కూడా ఎంతో ఉత్సాహంతో సపర్యాలు చేయించుకుంటోంది. హ్యాపీగా స్నానం చేస్తుంది. శుభ్రతను ఇష్టపడే వ్యక్తులు చేసే ప్రతి పనిని చేస్తుంది. మనుషులు కూడా అప్పుడప్పుడు మిస్‌ చేసే కొన్ని పనులు కూడా ఈ కుక్కకు ఎంతో శ్రద్ధగా చేస్తున్నారు ఇక్కడ నిర్వాహకులు. కుక్క చెవులు శుభ్రం చేస్తున్నారు. తర్వాత బ్రాండెడ్ షాంపూతో స్నానం చేయించారు. దాని పళ్లను నీట్‌గా మృదువైన బ్రష్‌ను ఉపయోగించి స్క్రబ్ చేశారు. ఇందుకోసం బ్రాండెడ్ టూత్‌పేస్ట్, టూత్ బ్రష్‌తో రుద్దుతున్నారు. ఇప్పుడు స్నానం చేయించారు. దీని తర్వాత ఆయిల్ మసాజ్ చేశారు.. దీని తర్వాత కుక్కకు మరోసారి షవర్ చేశారు. చివరకు మరో ఖరీదైన టవల్‌తో శుభ్రంగా తుడిచారు.. ఆ త రువాత తనకు నచ్చిన మృదువైన దుస్తులను ఎంచుకునే అవకాశం కూడా ఆ కుక్కకే ఇస్తున్నారు. ఇప్పుడు ఆ పెంపుడు కుక్క జుట్టును ఆరబెడుతున్నారు. కుక్క చెవుల్లో తడిగా ఉంటే కూడా తుడిచేశారు. చంకల్లో జెల్ అప్లై చేశారు. నెయిల్ కట్టర్ తో నెయిల్స్ కట్ చేశారు. పంజాలను మృదువుగా చేయడానికి మసాజ్ స్పెషల్‌ క్రీమ్‌ ఒకటి అప్లై చేశారు. తరువాత, ముక్కుపై కూడా మరో క్రీమ్ అప్లై చేశారు. ఆఖరుగా దానికి ఓ కాస్ట్లీపెర్ఫ్యూమ్ కూడా కొట్టారు. ఇప్పటికీ ఈ డాగ్‌ మేకోవర్‌ పూర్తైంది. ఇప్పుడు ఈ కుక్క జాలీ రైడ్‌కు రెడీ అయ్యింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూడండి..

సోషల్‌ మీడియాలో వేగంగా వైరల్‌ అవుతున్న ఈ వీడియో చూసిన నెటిజన్లు పెద్ద సంఖ్యలో తమ అభిప్రాయాలను తెలియజేస్తు్న్నారు. జాతకంలో రాజయోగం ఉంటే ఇలాగే కలిసి వస్తుందంటూ ప్రతి ఒక్కరూ కామెంట్‌ చేశారు. @HasnaZaruriHai Instagramలో షేర్ చేసిన ఈ వీడియో 24 గంటల్లోనే 14 వేలకు పైగా వ్యూస్‌ రాబట్టింది. అదే సమయంలో, వినియోగదారులు కూడా దీనిపై వేగంగా స్పందించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..