AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్నానం చేసేటప్పుడు ఇలా చేస్తే చెమట దుర్వాసనకు చెక్.. సింపుల్ హోమ్ టిప్స్

వర్షాకాలంలో సాధారణంగా గాలి తేమగా ఉంటుంది. కాబట్టి, బట్టలు కూడా తడితడిగా ఉంటుంటాయి. ఇక పనిమీద బయటకు వెళ్తున్నప్పుడు విపరీతంగా చెమటలు కూడా పడుతుంటాయి. ఆ చెమట వాసన చాలా చెడ్డది. అందరూ కాదు, చెమటతో బాధపడేవారు కొందరున్నారు. ఇది శరీరంలోని కొన్ని బ్యాక్టీరియా లేదా హార్మోన్ల అసమతుల్యత ప్రభావం వల్ల కూడా జరుగుతుంది. చెమట కంపు కొడితే అది అవమానంగా ఉంటుంది. కానీ, చెమట కంపును నివారించేందుకు ఒక మార్గం ఉంది. ఇది స్నాన సమయంలో మాత్రమే చేయాలి. అప్పుడే అనుకున్న ఫలితాన్ని చూస్తారు.

Jyothi Gadda
|

Updated on: Sep 17, 2024 | 3:40 PM

Share
అయితే, చెమట దుర్వాసనను తొలగించడంలో కొబ్బరి నూనె చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. స్నానం చేసేటప్పుడు ఒక బకెట్ నీటిలో 5-6 చుక్కల కొబ్బరి నూనె కలపండి. ఆ నీటితో స్నానం చేయండి. చెమట దుర్వాసన రాదు.

1 / 5
బేకింగ్‌ సోడా కూడా ఒంట్లో వచ్చే చెమట కంపును తరిమికొడుతుంది. ఒక బకెట్ నీటిలో ఒక చెంచా బేకింగ్ సోడా వేసుకుని స్నానం చేయటం వల్ల చెమట వాసనను దూరంగా ఉంచుతుంది.

2 / 5
వేప ఆకుల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చెమట దుర్వాసన నుండి బయటపడటానికి కొన్ని వేప ఆకులను నీటిలో మరిగించి స్నానం చేసే నీటిలో కలపండి. తర్వాత కొద్దిగా వేపనూనెను చర్మానికి అప్లై చేసుకోవాలి.

3 / 5
రెండు చెంచాల పసుపు పొడిని ఒక బకెట్ నీటిలో కలపండి. ఆ నీటితో స్నానం చేయండి. పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ చాలా ఉపయోగపడుతుంది. ఇది మిమ్మల్నీ రోజంతా చెమట వాసనకు దూరంగా ఉంచుతుంది. అయితే ఇవన్నీ హోమ్ ట్రిక్స్ అని గుర్తుంచుకోండి. కాబట్టి, చెమట వాసన పోకపోతే, వైద్యుడిని సంప్రదించండి.

4 / 5
మనం రోజూ తినే ఆహారం వల్ల కూడా శరీరం దుర్వాసన వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి తీసుకునే ఆహారంలో కెఫైన్‌, మసాలా, ఆల్కహాల్‌, వంటివి లేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. టీ, కాఫీ లాంటివి తగ్గించాలి. వీటితో పాటు పైన చెప్పిన విధంగా చిన్నచిన్న ఇంటి చిట్కాలు పాటిస్తే, చెమట వాసన సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.

5 / 5