Washing Machine Clean: వాషింగ్ మెషిన్ క్లీన్ చేయాలా.. ఇలా ఈజీగా చేసేయండి..
ప్రస్తుత కాలంలో చాలా మంది ఎక్కువగా ఉపయోగిస్తున్న ఎలక్ట్రిక్ పరికరాల్లో వాషింగ్ మిషిన్ కూడా ఒకటి. ప్రతీ ఒక్కరి ఇంట్లో వాషింగ్ మిషన్ సాధారణ పరికరంగా మారింది. ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో బట్టలు ఉతికేందుకు కూడా ఎవరికీ సమయం ఉండటం లేదు. క్రమంలోనే వేలకు వేలు ఖర్చు పెట్టి మరీ వాషింగ్ మిషన్ తీసుకుంటున్నారు. వాషింగ్ మిషన్ వల్ల సమయం చాలా సేవ్ అవుతుంది. ఇందులో బట్టలు వేసి ఇతర పనులు చేసుకోవచ్చు. అయితే వాషింగ్ మెషిన్ క్లీనింగ్ కూడా చాలా..
ప్రస్తుత కాలంలో చాలా మంది ఎక్కువగా ఉపయోగిస్తున్న ఎలక్ట్రిక్ పరికరాల్లో వాషింగ్ మిషిన్ కూడా ఒకటి. ప్రతీ ఒక్కరి ఇంట్లో వాషింగ్ మిషన్ సాధారణ పరికరంగా మారింది. ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో బట్టలు ఉతికేందుకు కూడా ఎవరికీ సమయం ఉండటం లేదు. క్రమంలోనే వేలకు వేలు ఖర్చు పెట్టి మరీ వాషింగ్ మిషన్ తీసుకుంటున్నారు. వాషింగ్ మిషన్ వల్ల సమయం చాలా సేవ్ అవుతుంది. ఇందులో బట్టలు వేసి ఇతర పనులు చేసుకోవచ్చు. అయితే వాషింగ్ మెషిన్ క్లీనింగ్ కూడా చాలా ముఖ్యం. చాలా మంది వాషింగ్ మిషన్ బట్టలు ఉతికేందుకు మిషన్ ఉపయోగిస్తారు. కానీ దీన్ని క్లీనింగ్ చేయడం మాత్రం మర్చిపోతారు. వాషింగ్ మిషిన్ క్లీనింగ్ అనేది చాలా ముఖ్యం. వాషింగ్ మిషన్ క్లీన్ చేయడం ఎలాగో కొన్ని ఈజీ టిప్స్‌తో తెలుసుకుందాం.
వైట్ వెనిగర్:
వాషింగ్ మిషన్ క్లీన్ చేయడంలో వైట్ వెనిగర్ ఎంతో చక్కగా పని చేస్తుంది. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషిన్‌లో.. డిటర్జెంట్ డిస్పెన్సర్‌లో వైట్ వెనిగర్ వేయాలి. ఆ తర్వాత మిషన్ ఆన్ చేసి.. కాసేపు రన్ చేయాలి. ఇలా చేయడం వల్ల వాషింగ్ మిషన్ లోపల ఉండే మురికి మొత్తం బయటకు వచ్చేస్తుంది.
బేకింగ్ సోడా:
బేకింగ్ సోడాతో కూడా మనం వాషింగ్ మిషన్‌ని శుభ్రం చేసుకోవచ్చు. బేకింగ్ సోడా ఉపయోగించడం వల్ల లోపల ఉండే మురికి మొత్తం బయటకు వచ్చేస్తుంది. కొద్దిగా డిటర్జెంట్, బేకింగ్ సోడాను డిటర్జెంట్ డిస్పెన్సర్‌లో వేసి టబ్ క్లీన్ ఆప్షన్ క్లీన్ చేయాలి. బేకింగ్ సోడా ఉపయోగించడం వల్ల మొత్తం లోపల ఉండే మురికి మొత్తం బయటకు వెళ్లిపోతుంది. ఇలా వాష్ చేయడం వల్ల బట్టలు కూడా దుర్వాసన రాకుండా ఉంటాయి.
ఫిల్టర్ క్లీనింగ్:
వాషింగ్ మిషిన్‌లో లోపల, బయటనే కాకుండా.. ఫిల్టర్ క్లీనింగ్ కూడా చాలా ముఖ్యం. దీన్ని చాలా మంది మర్చిపోతూ ఉంటారు. కంపెనీ, మోడల్ ఆధారంగా ఫిల్టర్ స్థానం మారుతుంది. ఆల్రెడీ ఈ విషయాన్ని మీకు చెప్పే ఉంటారు. దాని బట్టి మీరు ఫిల్టర్ కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. వేడి నీళ్లలో వేసి ఫిల్టర్ క్లీనింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత బ్రష్‌తో రుద్దితే మురికి అంతా బయటకు పోతుంది. ఇలా చేయడం వల్ల మిషన్ పాడవకుండా ఎక్కువ రోజులు మన్నుతుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..