Watch: పోలీస్‌ల నిర్వాకం ఇదేనా ? గుట్టుగా పేకాడుతూ పట్టుబడ్డ ఖాకీలు..వీడియో వైరల్
ఇందుకు సంబంధించిన వీడియో ఆదివారం సాయంత్రం నుంచి ఇంటర్‌నెట్‌లో కలకలం రేపింది. వీడియో బయటకు రావడంతో వివిధ పోలీస్ స్టేషన్లలో పోస్టింగ్‌లో ఉన్న ఆరుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసినట్లు పోలీస్ సూపరింటెండెంట్ తెలిపారు.
సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. ఇందులో పలువురు పోలీసులు జూదం ఆడుతూ కనిపించారు. ఈ వీడియో బయటకు రావడంతో పోలీసు శాఖలో కలకలం రేగింది. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే ఆ చట్టాలను ఉల్లంఘిస్తున్నారు. ప్రజల్ని అదుపు చేయాల్సిన పోలీసులు పక్కదారి పట్టారు. ఏకంగా పోలీసులే జూదం ఆడుతూ పట్టుబడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని తికమ్‌గఢ్‌లో చోటుచేసుకుంది. వీడియో ఆధారంగా పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నట్టుగా తెలిసింది. పేకాట ఆడుతూ పట్టుబడిన ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేశారు.
మధ్యప్రదేశ్‌లోని తికమ్‌గఢ్‌లో పోలీసులు చేసిన నిర్వాకం బట్టబయలైంది. పోలీసు అధికారులు జూదం ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ఆధారంగా పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నట్టుగా తెలిసింది. పేకాట ఆడుతూ పట్టుబడిన ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. ఆరుగురిలో ఒకరు హెడ్ కానిస్టేబుల్ కాగా మరో ఐదుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు.
ఈ వీడియోపై క్లిక్ చేయండి..
ఇందుకు సంబంధించిన వీడియో ఆదివారం సాయంత్రం నుంచి ఇంటర్‌నెట్‌లో కలకలం రేపింది. వీడియో బయటకు రావడంతో వివిధ పోలీస్ స్టేషన్లలో పోస్టింగ్‌లో ఉన్న ఆరుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసినట్లు పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) రోహిత్ కష్వానీ తెలిపారు.
కొత్వాలి పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుళ్లు మనోజ్ అహిర్వార్, రితేష్ మిశ్రా, సూరజ్ రాజ్‌పుత్, దేహత్ పోలీస్ స్టేషన్‌కు చెందిన భువనేశ్వర్ అగ్నిహోత్రి, అనిల్ పచౌరీ, జిల్లాలోని డిగోరా పోలీస్ స్టేషన్‌లో సల్మాన్ ఖాన్‌లపై చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. వీడియో ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించారో తెలియలేదు. ఇతర పోలీసు సిబ్బంది సంఘటనా స్థలంలో ఉన్నారా అని తెలుసుకోవడానికి అదనపు పోలీసు సూపరింటెండెంట్ సీతారాం సత్య విచారణ జరుపుతున్నట్లు కష్వానీ చెప్పారు. ఈ తరహా ప్రవర్తన పోలీసు శాఖ ప్రతిష్టను పాడుచేస్తుందని, దర్యాప్తులో తేలిన ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..