ఒత్తిడిని తగ్గించే మొక్కలు.. మీ ఇంట్లో ఉంటే మనశ్శాంతి మీ వెంటే.. అవెంటో తెలుసా..

ఒక వైపు కరోనా  మరోవైపు ఉద్యోగంలో పని ఒత్తిడి.. కుటుంబ సమస్యలతో నిరంతరం పోరాడుతునే ఉన్నారు. దీంతో మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంటుంది.

ఒత్తిడిని తగ్గించే మొక్కలు.. మీ ఇంట్లో ఉంటే మనశ్శాంతి మీ వెంటే.. అవెంటో తెలుసా..
Plants

ఒక వైపు కరోనా  మరోవైపు ఉద్యోగంలో పని ఒత్తిడి.. కుటుంబ సమస్యలతో నిరంతరం పోరాడుతునే ఉన్నారు. దీంతో మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంటుంది. ఇటీవల చాలా మంది డిప్రెషన్ తో బాధపడుతున్నారు. ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఆహారం పై దృష్టి పెట్టడం, పనిలో నిమ్మగ్నమవ్వడం చేస్తుంటారు. అయినా కానీ ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. అయితే ఒత్తిడిని తగ్గించుకునేందుకు మీ చుట్టూ ఉండే వాతావరణం కూడా ముఖ్యమే. నియంత్రణ లేని ఆలోచనలను అధిగమించేందుకు ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. డిప్రెషన్‏ను అధిగమించేందుకు ఉరుకుల పరుగుల ప్రయాణాలకు దూరంగా చుట్టు పచ్చని చెట్లు.. పక్షుల శబ్ధాలు వినబడే ప్రదేశాలకు వెళ్లిపోవాలనుకుంటారు. అయితే అలా వెళ్లడం చాలా మందికి కుదరకపోవచ్చు. మీ ఇంటినే పచ్చని చెట్లతో అందంగా ప్రశాంతమైన వాతావరణాన్ని సెట్ చేసుకోవచ్చు. అలాగే కొన్ని రకాల మొక్కలు మీ ఇంట్లో ఉండడం వలన ఒత్తిడిని తగ్గిస్తాయి. అవెంటో తెలుసుకుందామా.

* తులసి..
తులసి చెట్టుకు మన భారతీయ సంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉంది. తులసి దేవతగా భావించి పూజిస్తుంటారు. అలాగే తులసి వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. తులసి చెట్టును ఇంట్లో పెట్టడం వలన అనారోగ్య సమస్యలను తగ్గించడమే కాకుండా.. ఒత్తిడిని తగ్గిస్తుంది.

గులాబీలు..
ఇంట్లో గులాబీ మొక్కను నాటడం వలన ఎన్నో ప్రయోజనాలున్నాయి. గులాబీలు శాంతి, ప్రేమ, సానుకూల వాతావరణానికి ప్రతికూలంగా నిలుస్తాయి. ఈ మొక్క ఒత్తిడిని తగ్గించడంలోనూ ప్రధాన పాత్ర పోషిస్తుంది.

మనీ ప్లాంట్
ఎక్కడైనా సులభంగా పెరిగే మొక్క. బెడ్ రూమ్, బాల్కనీ, బాత్రూమ్, డ్రాయింగ్ రూమ్ లేదా గార్డెన్‌లో కూడా ఈ మొక్కను సులువుగా పెంచవచ్చు. కొంతమంది ఈ మొక్కలను వంటగదిలో పెంచుతుంటారు. దీని ద్వారా వంట గది ఎంతో అందంగా ఉంటుంది. ఈ మొక్కలు ఇంట్లో సానుకూల శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఈ మొక్కలకు ఎక్కువ జాగ్రత్త అవసరం.

జాస్మిన్

మల్లె పూల సువాసన చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. మల్లె మొక్కలను పవిత్రంగా భావిస్తారు. ప్రపంచంలోని అనేక దేశాలలో పూజిస్తారు. జాస్మిన్ పువ్వు విశ్వాసం, ప్రేమ, సంబంధాన్ని బలోపేతం చేసే చిహ్నంగా భావిస్తారు. ధూపం, మల్లె పువ్వులు కొవ్వొత్తులకు సువాసనను జోడించడానికి ఉపయోగిస్తారు. ఈ మొక్కలను నాటడం వల్ల రాత్రికి మంచి కలలు వస్తాయని అంటారు.

Also Read: Thimmarusu Pre Release Event: ‘తిమ్మరుసు’ కోసం రంగంలోకి మరో హీరో.. ప్రీరిలీజ్ ఈవెంట్‏కు ముఖ్య అతిథిగా న్యాచురల్ స్టార్

Seerath Kapoor: ట్రెండ్ సెట్ చేసిన హీరోయిన్.. అలనాటి ఫ్యాషన్ దుస్తులతో మెరిసిన ముద్దుగుమ్మ..

Click on your DTH Provider to Add TV9 Telugu