Aloe Vera Side Effects: ఆరోగ్యానికి మంచిదని కలబంద జ్యూస్ తాగుతున్నారా ? ఎక్కువైతే ఈ సమస్యలు తప్పవు..

కలబందతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. శరీరంలోని ఉష్ణోగ్రతను తగ్గించడమే కాకుండా.. చర్మానికి, జుట్టుకు అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది.

Aloe Vera Side Effects: ఆరోగ్యానికి మంచిదని కలబంద జ్యూస్ తాగుతున్నారా ? ఎక్కువైతే ఈ సమస్యలు తప్పవు..
Aloe Vera
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 27, 2021 | 7:17 PM

కలబందతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. శరీరంలోని ఉష్ణోగ్రతను తగ్గించడమే కాకుండా.. చర్మానికి, జుట్టుకు అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. చాలామంది ఉదయం లేవగానే పరగడుపున కలబందను తినేస్తుంటారు. మరికొందరు ఆరోగ్యానికి మంచిందని కలబంద జ్యూస్ తాగుతుంటారు. అలాగే కలబందకు ఆయుర్వేదంలో ప్రత్యేకమైన స్థానం ఉంది. వేలాది సంవత్సరాలుగా కలబందను ఆయుర్వేదంలో ఉపయోగిస్తుంటారు. అయితే ఆరోగ్యానికి మేలు చేస్తుంది కదా అని.. ఎక్కువ మోతాదులో ఆ ఆలోవేర జ్యూస్ తాగుతుంటారు. ఇలా చేయడం కూడా రిస్కే అంటున్నారు నిపుణులు. శరీరానికి మేలు మాత్రమే కాకుండా.. శ్రుతి మించితే కీడు కూడా చేస్తుంది. కలబంద జ్యూస్ ఎక్కువగా మోతాదులో తీసుకోవడం వలన కలిగే దుష్ప్రభావాల గురించి తెలుసుకుందామా.

1. ఉదయాన్నే ఖాలీ కడుపుతో కలబంద జ్యూస్ లేదా జెల్ తీసుకోవడం వలన బరువు తగ్గుతారని అంటుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. 2. కలబంద జ్యూస్ రోజూ తాగడం వలన శరీరంలో పొటాషియం పరిమాణం పెరుగుతుంది. అలాగే గెండె ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా గుండె సమస్యలు ఉన్నవారు కలబంద జెల్, జ్యూస్ తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది. 3. కలబంద జెల్ చర్మానికి మేలు చేస్తుంది. అలాగే జుట్టుకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. అయితే కొందరికి కలబంద వలన అలెర్జీలు, చర్మంపై మంట, దురద వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఆలోవేరాను ఉపయోగించే ముందు చెక్ చేయాలి. 4. సాధారణంగా మలబద్దకం ఉన్నప్పుడు కలబంద రసం తాగమని సలహా ఇస్తారు, కానీ జీర్ణక్రియకు సంబంధించి సమస్య ఉన్నవారు కలబంద రసం తీసుకోవద్దు. ఎందుకంటే ఈ రసంలో హైపర్‌మాగ్నేసిమియా ఉంటాయి, ఇవి ప్రకోప ప్రేగు సిండ్రోమ్ సమస్యను పెంచుతాయి. దీనివల్ల కడుపు నొప్పి, విరేచనాలు సమస్యలు తలెత్తవచ్చు. 5. కలబందను చాలా రోజుల నుంచి నిరంతరం తీసుకోవడం వలన రక్తపోటుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అలాగే బీపీని తగ్గిస్తుంది. 6. గర్బిణీలు కలబందను తినకూడదు. ఇది తల్లులకు హానికరం. గర్బస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

Also Read: Seerath Kapoor: ట్రెండ్ సెట్ చేసిన హీరోయిన్.. అలనాటి ఫ్యాషన్ దుస్తులతో మెరిసిన ముద్దుగుమ్మ..

Pawan – Rana: సంక్రాంతికి ఛార్జ్‌ తీసుకోనున్న బిమ్లా నాయక్‌.. పవన్‌ – రానాల సినిమా మేకింగ్ వీడియో చూశారా.?