AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Causes of Liver Damage: ఆల్కహాల్ అలవాటు లేకున్నా లివర్ ఎందుకు చెడిపోతుందంటే..

మారుతున్న జీవన శైలి కారణంగా ఆరోగ్య సమస్యలు నానాటికీ పెరిగిపోతున్నాయి. శరీరానికి తగిన వ్యాయామం లేకపోవడం, అధిక క్యాలరీలుండే ఆహారం తీసుకోవడం వంటి అలవాట్లతో లైఫ్ స్టైల్ డిసీజెస్‌ చుట్టుముడుతున్నాయి..

Causes of Liver Damage: ఆల్కహాల్ అలవాటు లేకున్నా లివర్ ఎందుకు చెడిపోతుందంటే..
Causes Of Liver Damage
Srilakshmi C
|

Updated on: Mar 05, 2023 | 10:50 AM

Share

మారుతున్న జీవన శైలి కారణంగా ఆరోగ్య సమస్యలు నానాటికీ పెరిగిపోతున్నాయి. శరీరానికి తగిన వ్యాయామం లేకపోవడం, అధిక క్యాలరీలుండే ఆహారం తీసుకోవడం వంటి అలవాట్లతో లైఫ్ స్టైల్ డిసీజెస్‌ చుట్టుముడుతున్నాయి. జీవన శైలికి సంబంధించిన వ్యాధుల్లో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (ఎన్ఏఎఫ్ఎల్‌డీ) కూడా ఒకటి. దీనినే ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. కాలేయంలో కొన్ని రకాల మార్పుల వల్ల ఈ వ్యాధి వస్తుంది. అతిబరువు ఉండేవారు, ఊబకాయుల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. దీని బారీన పడినవారికి కాలేయంలో కొవ్వు అధికంగా పేరుకుపోతుంది. తొలి దశల్లో దీని వల్ల పెద్దగా సమస్య ఉండకపోయినా.. వ్యాధి ముదిరేకొద్దీ పరిస్థితులు తీవ్రం అవుతాయి. ఒక్కోసారి కాలేయం పూర్తిగా దెబ్బతినడం లేదా లివర్ సిర్రోసిస్ లాంటి స్థితికి కూడా వెళ్లే ముప్పు ఉంటుంది.

ఈ సమస్యకు ఆల్కహాల్ కారణం కానప్పటికీ, ఇది వచ్చాక ఆల్కహాల్ తీసుకుంటే మాత్రం వ్యాధి మరింత ముదురుతుంది. అందుకే ఫ్యాటీ లివర్ రుగ్మత ఉండేవారు మద్యపానం, పొగ తాగడం అలవాట్లకు దూరంగా ఉండాలి. లివర్‌లో కొవ్వు శాతం 5 కంటే ఎక్కువ ఉంటే కాలేయ సంబంధిత రుగ్మతలు వస్తుంటాయి. తొలినాళ్లలో గుర్తించి అదుపు చేయకపోతే, ఫ్యాటీ లివర్‌గా మారిపోతుంది. బ్రిటన్‌లో ప్రతి ముగ్గురిలో ఒకరు నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాటీ లివర్‌తో బాధపడే వారి సంఖ్య 65 కోట్లకుపైనే ఉంది. లివర్‌లో విపరీతంగా పెరిగే కొవ్వుతో మధుమేహం, రక్తపోటు, కిడ్నీ సంబంధిత వ్యాధులు సైతం తలెత్తుతాయి. మధుమేహంతో బాధపడేవారికి ఫ్యాటీ లివర్ వస్తే, గుండె పోటు వచ్చే ముప్పు కూడా పెరుగుతుంది.

ఒక్కోసారి తీవ్రంగా అలసిపోయినట్లు అనిపించడం, బరువు తగ్గిపోవడం లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. చర్మంతోపాటు కళ్లు కూడా ఒక్కోసారి పసుపు రంగులోకి మారుతుంటాయి. తరచూ లివర్‌ టెస్టులు చేయించుకుంటూ ఉంటే దీనిని తొలినాళ్లలో గుర్తించవచ్చు. ఒకవేళ దీని బారీన పడితే సకాలంలో చికిత్స తీసుకుంటే ఔషధాలతోపాటు కొన్ని జీవన శైలి మార్పులూ చేసుకోవడం వల్ల ప్రమాదం నుంచి బయటపడవచ్చు. పళ్లు, కూరగాయలు, పాలు, పెరుగు, డ్రైఫ్రూట్స్ వంటివి తీసుకోవడం, చిన్నపాటి వ్యాయామాలు చేయడం, సరిపడా నిద్ర పోవడం.. వంటి అలవాట్ల వల్ల ఇది రాకుండా ముందునుంచే జాగ్రత్త పడవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సమాచారం కోసం క్లిక్‌ చేయండి.