Tips for Back Pain: ఫాస్ట్‌గా వెన్ను నొప్పిని దూరం చేసే సింపుల్ వ్యాయామాలు ఇవే!
ఈ రోజుల్లో వెన్ను నొప్పి అనేది సర్వ సాధారణమైనది. వెన్ను నొప్పి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా డెస్క్ జాబ్ చేసేవారికి ఈ వెన్ను నొప్పి అనేది మరింత ఎక్కువగా వస్తుంది. గంటలు గంటలు ఆఫీస్‌లో కూర్చోవడం వల్ల వెన్ను నొప్పి ఎక్కువగా వస్తుంది. ఈ సమస్య ఉంటే కూర్చోవడం, పడుకోవడం, నడవడం, వంగడం వంటి రోజు వారీ పనులు చేయడం కూడా కష్టంగా మారుతుంది. ముందుగానే ఈ వెన్ను నొప్పిని గుర్తించి.. చికిత్స తీసుకుంటే సమస్యను త్వరగా..
ఈ రోజుల్లో వెన్ను నొప్పి అనేది సర్వ సాధారణమైనది. వెన్ను నొప్పి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా డెస్క్ జాబ్ చేసేవారికి ఈ వెన్ను నొప్పి అనేది మరింత ఎక్కువగా వస్తుంది. గంటలు గంటలు ఆఫీస్‌లో కూర్చోవడం వల్ల వెన్ను నొప్పి ఎక్కువగా వస్తుంది. ఈ సమస్య ఉంటే కూర్చోవడం, పడుకోవడం, నడవడం, వంగడం వంటి రోజు వారీ పనులు చేయడం కూడా కష్టంగా మారుతుంది. ముందుగానే ఈ వెన్ను నొప్పిని గుర్తించి.. చికిత్స తీసుకుంటే సమస్యను త్వరగా పరిష్కరించుకోవచ్చు. అయితే ఇలా వెన్ను నొప్పితో బాధ పడేవారు.. చికిత్స చేయించుకోవడానికి ముందు ఇంట్లోనే చిన్న చిన్న ఎక్సర్ సైజులు చేసుకుంటే ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. ఇంతకీ ఆ వ్యాయామాలు ఏంటి? ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
థొరాసిక్ స్ట్రెచ్:
ఈ వ్యాయామాం చేయడానికి ముందు నేలపై కూర్చోవాలి. ఫోమ్ రోలర్‌ను తీసుకుని వెనుక భాగంలో ఉంచి.. దానిపై పడుకోవాలి. ఆ తర్వాత మెల్లగా కాళ్లను చాచి.. మెడ, తల నేలపై ఉండేలా చూసుకోండి. ఫోమ్ రోలర్ కరెక్ట్‌గా ఉందో లేదో చెక్ చేసుకోండి. ఫోమ్ రోలర్‌ను కరెక్ట్ పెట్టుకుంటేనే మీకు నొప్పి తగ్గుతుంది. ఆ తర్వాత డీప్ బ్రీత్ తీసుకోవాలి. నెక్ట్స్ బాడీని ముందుకు, వెనక్కి అటూ ఇటూ స్ట్రెచ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మీ వెనుక కండరాలు సాగదీసి నొప్పిని తగ్గిస్తుంది.
ఓపెనింగ్ చెస్ట్:
ఇది చేయడానికి రెండు కుర్చీలను మీకు రెండు వైపులా.. చేతులు అందుకోగలిగేంత దూరం ఉంచాలి. ఇప్పుడు వీటి మధ్య మోకాళ్లు వేసి కూర్చోవాలి. ఇప్పుడు రెండు చేతులను విస్తరించి.. 90 డిగ్రీల కోణంలో ఉండేలా కుర్చీలపై చేతులు ఉంచండి. ఈ చేతులను కాస్త పైకి లేపి.. ముదుకు కాస్త వంగండి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ మరింత ముందుకు వంగాలి. ఆ తర్వాత నార్మల్ పొజిషన్‌కు వచ్చేయాలి. అంతే ఇలా చేస్తే ఛాతీలో ఉండే నొప్పి అనేది తగ్గుతుంది. అంతే కాదు వెన్ను నొప్పి కూడా అదుపులోకి వస్తుంది.
డయా ఫ్రాగమ్ స్ట్రెచ్:
ఈ స్ట్రెచ్ కూడా వెన్ను నొప్పిని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. ఓ కుర్చీ తీసుకుని దానిపై నిటారుగా నిల్చోండి. డీప్ బ్రీత్ తీసుకుని వదులుతూ ఉండండి. ఈ సమయంలో మీరు ఎగువ శరీరం ముందుకు వంగడాన్ని గమనించవచ్చు. కొద్ది కొద్దిగా గాలిని తీసుకుంటూ.. వీలైనంత గట్టిగా వదిలేంత గట్టిగా వదులుతూ ఉండాలి. ఇప్పుడు మీ శరీరాన్ని మీ కాళ్ల మధ్యకు తీసుకు వెళ్లండి. ఇప్పుడు నీటిని, ముక్కును మూసేయాలి. ఆ తర్వాత మీ శరీరాన్ని వెనక్కి తీసుకురండి. ఇలా ఈ ఆసనాన్ని ఎన్ని సార్లు చేసినా పర్వాలేదు. ఇలా తరచూ చేస్తూ ఉంటే మీ వెన్ను నొప్పి త్వరగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)