Lifestyle: ఉదయం నిమ్మరసం తాగితే.. నిజంగానే ఆరోగ్యానికి మేలు చేస్తుందా.?
ఇది ఆరోగ్యానికి అన్ని విధాలుగా మేలు చేస్తుంది. బరువు తగ్గడం మొదలు రోగనిరోధక శక్తి పెంపు వరకు ఎన్నో సమస్యలకు ఇది ఉపయోగపడుతంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం తాగితే బరువు తగ్గుతారు. అయితే నిమ్మరసం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెప్పడంలో ఎంత నిజం ఉందో. కొందరిలో ఇది అనారోగ్య సమస్యలకు...
ఈ మధ్య కాలంలో ప్రతీ ఒక్కరికీ ఆరోగ్యంపై ఆసక్తి పెరుగుతోంది. మరీ ముఖ్చంగా సహజ పద్ధతులు పాటిస్తూ ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఉదయం నిమ్మరసం తీసుకుంటున్నారు. తేనెలో నిమ్మరసం కలుపుకొని తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నిమ్మకాయలోని విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.
ఇది ఆరోగ్యానికి అన్ని విధాలుగా మేలు చేస్తుంది. బరువు తగ్గడం మొదలు రోగనిరోధక శక్తి పెంపు వరకు ఎన్నో సమస్యలకు ఇది ఉపయోగపడుతంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం తాగితే బరువు తగ్గుతారు. అయితే నిమ్మరసం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెప్పడంలో ఎంత నిజం ఉందో. కొందరిలో ఇది అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగడం వల్ల కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* అసిడిటీ సమస్యతో బాధపడుతున్న నిమ్మకాయ రసాన్ని తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఖాళీ కడుపుతో నిమ్మరసం తీసుకోవడం వల్ల అసిడిటీ సమస్య వేధిస్తుందని అంటున్నారు.
* దంతాల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఉదయం నిమ్మరసాన్ని తీసుకోకూడదు. దంతాల సున్నితత్వం ఉన్న వ్యక్తులు, నిమ్మరసాన్ని తీసుకోకూడదు. పళ్లపై ఉండే ఎనామిల్ దెబ్బ తింటుంది. దీనివల్ల దంతాలు బలహీనంగా మారే అవకాశం ఉంటుంది.
* ప్రతీరోజూ నిమ్మరసం తాగడం వల్ల ఎముకల ఆరోగ్యం దెబ్బ తింటుందని నిపుణులు చెబుతున్నారు. నిమ్మకాయల్లో యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎములక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు.
* కిడ్నీ సమస్యలున్న వారు కూడా ఖాళీ కడుపుతో నిమ్మరసం తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఇది కిడ్నీలపై ఒత్తిడి పెంచుతుంది. దీర్ఘకాలికంగా మూత్ర పిండాల సమస్యలతో బాధఫడేవారికి నిమ్మరసంతో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.
* నోటి అల్సర్లతో బాధపడేవారికి కూడా నిమ్మరసం ప్రతికూల ప్రభావం పడుతుంది. మౌత్ అల్సర్‌తో బాధపడేరు వారు నిమ్మరసం తీసుకోకూడదు. అలాగే డ్రై స్కిన్ ఉన్నవారు నిమ్మకాయలను ఎక్కువగా తినడం వల్ల డ్రై స్కిన్ పొందవచ్చు. జిడ్డు చర్మానికి నిమ్మరసం మేలు చేస్తుంది.
* జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్న వారు నిమ్మరసంకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. నిమ్మరసంలోని యాసిడ్ కంటెంట్ కారణంగా కడుపులో మంటగా ఉంటుంది.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..