AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Housefly: రూపాయి ఖర్చు లేకుండా.. ఈగల మోతకు ఇలా చెక్‌ పెట్టండి..

ఇంట్లో ఈగలు తిరుగుతూంటూ చిరాకుగా ఉంటుంది. అవి చేసే శబ్ధంతో ఇరిటేషన్‌ తెప్పిస్తే, బయట ఎక్కడ పడితే అక్కడ వాలి తిరిగి ఆహార పదార్థాలపై వాలడం వల్ల అనారోగ్యం బారిన పడుతుంటాం. దీంతో ఈగలను తరిమికొట్టడానికి నానా తంటాలు పడాల్సి వస్తుంది...

Housefly: రూపాయి ఖర్చు లేకుండా.. ఈగల మోతకు ఇలా చెక్‌ పెట్టండి..
Housefly
Narender Vaitla
|

Updated on: Nov 25, 2022 | 7:49 PM

Share

ఇంట్లో ఈగలు తిరుగుతూంటూ చిరాకుగా ఉంటుంది. అవి చేసే శబ్ధంతో ఇరిటేషన్‌ తెప్పిస్తే, బయట ఎక్కడ పడితే అక్కడ వాలి తిరిగి ఆహార పదార్థాలపై వాలడం వల్ల అనారోగ్యం బారిన పడుతుంటాం. దీంతో ఈగలను తరిమికొట్టడానికి నానా తంటాలు పడాల్సి వస్తుంది. మార్కెట్లో దొరికే రకరకాల స్ప్రేలను ఉపయోగిస్తుంటారు. అంతేనా ఈగలకు అడ్డుకట్ట వేయడానికి ప్రత్యేకంగా కొన్ని వస్తువులు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇవన్నీ ఖర్చుతో కూడుకున్న విషయాలు. అలాకాకుండా రూపాయి ఖర్చు లేకుండా మన వంటింట్లో ఉండే వస్తువులతో ఈగలను తరిమి కొట్టే అవకాశం ఉందని మీకు తెలుసా.? ఇంతకీ ఆ చిట్కాలు ఏంటంటే..

* ఒక గ్లాసులో నీటిని తీసుకుని, అందులో 2 స్పూన్ల ఉప్పు వేసి, తర్వాత నీటితో బాగా కలపాలి. ఈ ఉప్పు నీటిని ఏదైనా స్ప్రే బాటిల్‌లో పోసి, ఆపై ఈగలున్న చోట జల్లాలి. ఇలా చేయడం వల్ల ఈగలు పరార్‌ అవుతాయి.

* ఈగలను తరిమికొట్టడంలో పుదీనా, తులసి ఆకులు కూడా ఉపయోగపడతాయి. ఇందుకోసం ముందుగా పుదీనా, తులసి ఆకులతో పొడిని తయారు చేసుకోవాలి. అనంతరం ఈ పొడికి నీటిని జోడించి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. దీనిని ఈగలపై పిచికారీ చేస్తే ఈగలు పారిపోతాయి.

ఇవి కూడా చదవండి

* ఒక గ్లాసు పాలలో ఒక చెంచా నల్ల మిరియాల పొడిని, 3 చెంచాల చక్కెర కలపండి. ఈగలు ఎక్కువగా ఉన్న చోట పాలను ఉంచితే చాలు ఇది ఈగలను వాటి దగ్గరకు అట్రాక్ట్‌ చేస్తుంది. దీంతో ఈగలన్నీ గ్లాసులో పడిపోతాయి.

* దాల్చిన చెక్క వాసన అంటే ఈగలకు నచ్చదు. కాబట్టి ఈగలు ఎక్కువగా ఉండే చోట దాల్చిన చెక్కను లేదా పొడిని ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఈగలు ఆ ప్రాంతంలో ఉండవు.

* ఈగలను వదిలించుకోవడంలో కర్పూరం కూడా ఉపయోగపడుతుంది. ఈగలు ఎక్కువగా ఉన్న చోట ఒక కర్పూరాన్ని వెలిగిస్తే చాలు దాని పొగకు ఈగలు పారిపోతాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..