Skipping Uses: రోజూ స్కిప్పింగ్ చేస్తే.. మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే!

ప్రతి రోజూ వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం చాలా మందికి తెలుసు. వ్యాయామం చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు. వర్క్ అవుట్స్ చేస్తే.. చాలా ఫిట్‌గా ఉంటారు. రోజూ వ్యాయామం చేయడం వల్ల ఒక్కటేంటి.. చాలా లాభాలు ఉన్నాయి. కానీ సమయం లేని కారణంగా వ్యాయామం చేయడానికి కుదరదు. ఇలాంటి వారు ప్రతి రోజూ ఓ పావు గంట సేపు..

Skipping Uses: రోజూ స్కిప్పింగ్ చేస్తే.. మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే!
Skipping Uses
Follow us

|

Updated on: May 22, 2024 | 5:17 PM

ప్రతి రోజూ వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం చాలా మందికి తెలుసు. వ్యాయామం చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు. వర్క్ అవుట్స్ చేస్తే.. చాలా ఫిట్‌గా ఉంటారు. రోజూ వ్యాయామం చేయడం వల్ల ఒక్కటేంటి.. చాలా లాభాలు ఉన్నాయి. కానీ సమయం లేని కారణంగా వ్యాయామం చేయడానికి కుదరదు. ఇలాంటి వారు ప్రతి రోజూ ఓ పావు గంట సేపు స్కిప్పింగ్ చేస్తే సరిపోతుంది. రోజూ స్కిప్పింగ్ చేయడం వల్ల.. కేవలం ఫిట్ నెస్సే కాదు.. ఆరోగ్య పరంగా కూడా చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరి ప్రతి రోజూ స్కిప్పింగ్ చేస్తే ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో చూద్దాం.

వెయిట్ లాస్ అవుతారు:

ప్రతి రోజూ ఓ పావు గంట సేపు అయినా స్కిప్పింగ్ చేయడం వల్ల ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. స్కిప్పింగ్ చేయడం వల్ల శరీరంలో పేరుకుపోయిన బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం కరిగిపోతుంది. ఓ అరగంట పాటు ఆడితే… 750 క్యాలరీలు వరకూ ఖర్చు అవుతాయి. కాబట్టి వెయిల్ లాస్ అవ్వాలి అనుకునేరు.. బయటకు వెళ్లేందుకు సమయం లేని వారు ఈజీగా స్కిప్పింగ్ చేసి బరువు తగ్గొచ్చు. దీంతో మంచి రిజల్ట్స్ ఉంటుంది.

బ్రెయిన్ యాక్టీవ్:

స్కిప్పంగ్ ఆడటం వల్ల మీకు తెలియకుండా సంతోషంగా ఫీల్ అవుతారు. దీంతో బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. మెదడు ఆరోగ్యంగా పని చేస్తుంది. బ్రెయిన్ పని తీరు కూడా మెరుగు పడుతుంది. కాబట్టి ప్రతి రోజూ స్కిప్పింగ్ చేయడం వల్ల బ్రెయిన్‌కి కూడా చాలా మంచిది.

ఇవి కూడా చదవండి

గుండె ఆరోగ్యం:

ప్రతిరోజూ స్కిప్పింగ్ ఆడటం వల్ల గుండె పని తీరు కూడా మెరుగు పడుతుంది. దీని వల్ల గుండె హార్ట్ బీట్ పెరుగుతుంది. రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది. అంతే కాకుండా బరువు తగ్గి, బీపీ, కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతాయి. దీంతో గుండె పని తీరు చక్కగా ఉంటుంది.

ఊపిరితిత్తులకు మంచిది:

ప్రతి రోజూ స్కిప్పింగ్ ఆడటం వల్ల ఊపిరి తిత్తులకు కూడా చాలా మంచిది. స్కిప్పింగ్ చేసిన తర్వాత శ్వాస తీసుకోవడం ఈజీ అవుతుంది. దీని వల్ల ఊపిరి తిత్తులు ఆరోగ్యంగా పని చేస్తాయి.

ఒత్తిడి మాయం:

రోజూ కాస్త సమయం స్కిప్పింగ్ ఆడటం వల్ల ఒత్తిడి, ఆందోళన అనేవి దూరం అవుతాయి. స్కిప్పింగ్ చేయడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్ల హార్మోన్లు రిలీజ్ అవుతాయి. దీంతో ఒత్తిడి అనేది దూరం అవుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..