AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fasting Benefits: త్వరలోనే పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం.. రోజా ఉపవాసం ఉంటే శరీరానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

ఈ ఏడాది మార్చి 22 నుంచి పవిత్ర రంజాన్ ప్రారంభం కానుంది. ఏప్రిల్ 21 వరకు కొనసాగుతుంది. ఈ మాసం అంతా ముస్లీంలు ఉపవాసం ఉంటారు.

Fasting Benefits: త్వరలోనే పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం.. రోజా ఉపవాసం ఉంటే శరీరానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?
Iftar
Madhavi
| Edited By: Janardhan Veluru|

Updated on: Mar 16, 2023 | 12:48 PM

Share

ఈ ఏడాది మార్చి 22 నుంచి పవిత్ర రంజాన్ ప్రారంభం కానుంది. ఏప్రిల్ 21 వరకు కొనసాగుతుంది. ఈ మాసం అంతా ముస్లీం సోదరులు ఉపవాసం ఉంటారు. ఈ సమయంలో ముస్లింలు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉంటారు. సాయంత్రం ఆహారం తిని(ఇఫ్తార్) ఉపవాసాన్ని విరమిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఈ మాసాన్ని పవిత్రంగా పాటిస్తారు. మన దేశంతోపాటు ఇతర దేశాల్లోని ముస్లింలు కూడా ఈ మాసాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తుంటారు. అన్ని మతపరమైన నిబంధనలను అనుసరించి జరుపుకుంటారు. మత సామరస్యానికి జరపుకునే పండుగగా రంజాన్ ను అభివర్ణిస్తారు.

ఇంతకు ముందు చెప్పినట్లు ఈ మాసం అంతా ఉపవాసం ఉంటారు. ఉదయం నుండి సాయంత్రం వరకు అది ఖాళీ కడుపుతో కఠిన ఉపవాసాన్ని అనుసరిస్తారు. మతం ప్రకారం, ఈ మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అంతేకాకుండా, ఉపవాసం గురించి సైన్స్ కూడా సానుకూలంగా చెబుతుంది. కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఉపవాసం కొన్ని భౌతిక ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఉపవాసం ద్వారా శరీరం, మనస్సు ఆరోగ్యంగా ఉంటుంది. రంజాన్ ఉపవాసం యొక్క విశేషాలను తెలుసుకుందాం.

1. బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది:

ఇవి కూడా చదవండి

మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఉపవాసం రక్తంలో చక్కెరను నియంత్రించగలదని ఇప్పటికే అనేక అధ్యయనాలు వెల్లడించాయి. ఉపవాసం ఇన్సులిన్ ప్రభావాన్ని పెంచుతుంది. ఫలితంగా, ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. కాబట్టి మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నవారు ఉపవాసం చేయవచ్చు. అయితే ఇప్పటికే మధుమేహం ఉన్నవారు, షుగర్ మందులు వాడేవారు, తప్పనిసరిగా వైద్యులను సంప్రదించిన తర్వాతే రంజాన్‌ను పాటించాలి.

2. వాపుతో పోరాడుతుంది:

శరీరం ఇన్ఫెక్షన్‌తో పోరాడినప్పుడు వాపు వస్తుంది. అయినప్పటికీ, చాలా మందికి వారి శరీరంలో అనవసరమైన మంట ఉంటుంది. మీకు గుండె జబ్బులు, క్యాన్సర్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటే, మంట వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సాధారణ ఉపవాసం నిజానికి వాపు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మీరు మంటను తగ్గించుకోవాలనుకుంటే, రంజాన్ మాసం మీకు సాధనంగా మారుతుంది.

3. ఒత్తిడి, కొలెస్ట్రాల్ అదుపులో ఉంటాయి:

మనం మొత్తం ప్రపంచ మరణాల గణాంకాలను పరిశీలిస్తే, గుండె జబ్బులు లేదా హృదయ సంబంధ వ్యాధుల మరణానికి అత్యంత సాధారణ కారణం అని ఒక విషయం స్పష్టమవుతుంది. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ సమస్య ప్రధాన కారణాలు. రెగ్యులర్ ఉపవాసం కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, అధిక రక్తపోటును తగ్గిస్తుంది.

4. మెదడు శక్తిని పెంచుతుంది:

మీరు మీ మెదడు శక్తిని పెంచుకోగలిగితే, ప్రపంచం మీ చేతుల్లో ఉంటుంది. ఉపవాసం మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుది. మెదడు కూడా తన పనిని సరిగ్గా చేయగలదు. అలాగే, ఉపవాస సమయంలో మెదడులో నిర్మాణాత్మక మార్పులు సంభవిస్తాయి. కాబట్టి మీరు మెదడు శక్తిని పెంచుకోవడానికి ఈ సమయాన్ని ఉపయోగించుకోవచ్చు.

5. బరువు అదుపులో ఉంటుంది:

రంజాన్ లో రోజూ ఉపవాసం ఉండడం వల్ల శరీరంలో క్యాలరీల కొరత ఏర్పడుతుంది. ఫలితంగా, కొవ్వు వేగంగా కరుగుతుంది.దీంతో క్రమంగా బరువును  కోల్పోతారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం చూడండి..