Annatto Seeds: నవయవ్వనంగా కనిపించేందుకు ఈ గింజలను తింటే చాలు.. ఇంకా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కూడా..!

నవయవ్వనంగా కనిపించాలని వయసుతో పనిలేకుండా అందరూ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలలో భాగంగానే మార్కెట్‌లో కనిపించిన ప్రతీ కాస్మటిక్ అంటే..

Annatto Seeds: నవయవ్వనంగా కనిపించేందుకు ఈ గింజలను తింటే చాలు.. ఇంకా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కూడా..!
Annatto Seeds
Follow us

|

Updated on: Mar 15, 2023 | 7:33 PM

ఇటీవలి కాలంలో నవయవ్వనంగా కనిపించాలని వయసుతో పనిలేకుండా అందరూ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలలో భాగంగానే మార్కెట్‌లో కనిపించిన ప్రతీ కాస్మటిక్ అంటే.. సబ్బు, క్రీమ్, ఆయింట్‌మెంట్ అని తేడా లేకుండా అన్నీ వాడేస్తున్నారు. అయితే వాటితో ప్రయోజనాలు లేకపోగ చర్మ సంరక్షణ మరింత సవాలుగా మారే ప్రమాదం ఉందని చర్మ సంబంధిత శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఇవి ముఖంపై మచ్చలు, మొటిమలకు కూడా దారి తీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో యవ్వనంగా కనిపించేందుకు సహజ పద్ధతులనే ఆశ్రయించడం మేలని సూచిస్తున్నారు. ఇక సహాజ పద్ధతులలో భాగంగా అన్నాట్టో గింజలను తీసుకోవచ్చని వివరిస్తున్నారు. వీటితో చర్మ, కంటి, ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టేయొచ్చని అంటున్నారు. మరి ఆ సీడ్స్‌తో ఇంకా ఎలాంటి ప్రయోజనాలున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

అన్నాట్టో సీడ్స్ ప్రయోజనాలు:

  • అన్నాట్లో గింజల్లో అమైనో ఆమ్లాలు, కాల్షియం, ఇనుము, భాస్వరం, విటమిన్ బీ-2,3 అధికంగా ఉన్న కారణంగా మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
  • అంతేకాకుండా అన్నాట్లో గింజల్లో కెరోటిన్, విటమిన్ సి వంటి యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి కణాలు, డీఎన్ఏకు ఫ్రీ రాడికల్ కారణంగా కలిగే నష్టాలను నివారిస్తాయి.
  • అన్నాట్టో సీడ్స్‌లో ఉండే ఫైటోకెమికల్స్ సైనిడిన్, ఎలాజిక్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్, సపోనిన్లు, టానిన్లు, విటమిన్ సి వంటి లక్షణాలు వ్యాధి నిరోధక శక్తిగా పనిచేస్తాయి.
  • ఈ గింజల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు మనల్ని చర్మ సమస్యలను నుంచి కాపాడతాయి. అంతే కాకుండా పొడి చర్మం, ముడతలను తగ్గించడమే కాకుండా వృద్ధాప్యాన్ని తగ్గించి నిత్య యవ్వనంగా ఉండేలా చేస్తాయి.
  • అన్నాట్టో సీడ్స్ ఇన్ని గుణాలు ఉన్న కారణంగా వీటిని చాలా కాస్మోటిక్ ఉత్పత్తుల తయారీలో కూడా ఉపయోగిస్తారు.
  • అన్నాట్టో గింజలలో కెరోటినాయిడ్స్ ఉండడం వల్ల కంటిశుక్లం పెరగకుండా చేస్తుంది.
  • అలాగే అన్నాట్టో గింజల పొడిలో ఉండే ఫైబర్ జీర్ణ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. జీర్ణ క్రియను వేగవంతం చేసి మలబద్దకం, గ్యాస్ సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది.
  • అంతేకాక కొలెస్ట్రాల్‌ను తగ్గించి మధుమేహాన్ని అదుపుచేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్స్ గాయాలను నయం చేస్తాయి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..