Tea in Brass: ఇత్తడి పాత్రలో టీ పెట్టి తాగితే.. ఇన్ని ప్రయోజనాలా..

ఈ మధ్య కాలంలో స్టీలు, అల్యూమినియం పాత్రలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కానీ పూర్వం మాత్రం రాగి, ఇత్తడి, మట్టి పాత్రలనే యూజ్ చేసేవారు. అప్పుడే మనుషులు ఎంతో బలంగా, దృఢంగా ఉండేవారు. పెద్దగా అనారోగ్య సమస్యలు కూడా వచ్చేవి కాదు. మనం ఆరోగ్యకరమైన ఆహారం తింటున్నాం అనుకుంటే సరిపోదు. అందుకు ఎలాంటి పాత్రలు ఉపయోగిస్తున్నాం అనేది కూడా చాలా ముఖ్యం. చాలా మంది ప్రతి రోజూ టీ తాగే అలవాటు ఉంటుంది. ఇప్పటివరకూ ఎలాంటి పాత్ర వాడారో..

Tea in Brass: ఇత్తడి పాత్రలో టీ పెట్టి తాగితే.. ఇన్ని ప్రయోజనాలా..
Tea In Brass
Follow us

|

Updated on: Jul 16, 2024 | 2:46 PM

ఈ మధ్య కాలంలో స్టీలు, అల్యూమినియం పాత్రలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కానీ పూర్వం మాత్రం రాగి, ఇత్తడి, మట్టి పాత్రలనే యూజ్ చేసేవారు. అప్పుడే మనుషులు ఎంతో బలంగా, దృఢంగా ఉండేవారు. పెద్దగా అనారోగ్య సమస్యలు కూడా వచ్చేవి కాదు. మనం ఆరోగ్యకరమైన ఆహారం తింటున్నాం అనుకుంటే సరిపోదు. అందుకు ఎలాంటి పాత్రలు ఉపయోగిస్తున్నాం అనేది కూడా చాలా ముఖ్యం. చాలా మంది ప్రతి రోజూ టీ తాగే అలవాటు ఉంటుంది. ఇప్పటివరకూ ఎలాంటి పాత్ర వాడారో పక్కన పెడితే.. ఇక నుంచి మాత్రం చిన్న ఇత్తడి పాత్రలో అయినా టీ తాగడం అలవాటు చేసుకోండి. రుచి మాత్రమే కాకుండా ఎంతో ఆరోగ్యం కూడా. ఇత్తడి పాత్రలో టీ తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది:

ఇత్తడి పాత్రలో టీ తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. దీంతో వ్యాధులతో పోరాడే శక్తి మీకు లభిస్తుంది. ఇత్తడిలో కూడా అనేక పోషకాలు ఉంటాయి. వీటి వలన వ్యాధులు రాకుండా ఉంటాయి. కేవలం రాగి పాత్రలో నీటినే కాదు.. ఇత్తడి పాత్రలో రాత్రంతా ఉంచిన నీటిని తాగినా చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

చర్మం ఆరోగ్యంగా ఉంటుంది:

ఇత్తడి పాత్రలో టీ లేదా పాలు తాగడం వల్ల చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇత్తడి పాత్రలు.. మెలనిన్‌‌ను ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి ఇవి ఆహారంతో కలిసి.. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ప్రయత్నిస్తాయి. హానికరమైన యూవీ కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. ముఖంపై ఉండే మొటిమలు, ముడతలు పోయి చర్మం అందంగా మారుతుంది.

ఇవి కూడా చదవండి

రక్తాన్ని శుద్ధి చేస్తుంది:

ఇత్తడి పాత్రల్లో వండిన ఆహారం తినడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. ఇందులో ఉండే జింక్ రక్తాన్ని పెంచడానికి కూడా సహాయ పడుతుంది.

శ్వాసకోశ ఇబ్బందులు నయం:

ఇత్తడి పాత్రల్లో ఆహారాన్ని వండటం వల్ల శ్వాసకోశ ఇబ్బందులు కూడా తగ్గుతాయి. కఫ, పిత్త, వాత దోషాలను సమతుల్యం చేయడానికి సహాయ పడుతుంది.

ఆహారం రుచి పెరుగుతుంది:

ఇత్తడి పాత్రల్లో వండటం వల్ల ఆహారం రుచి కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఇత్తడిలో ఉండే పోషకాలు.. ఆహారంలో చేరి రుచిని పెంచడమే కాకుండా.. ఆరోగ్యాన్ని కూడా పెంచుతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..