Peanut Benefits: పొట్టుతోనా.. పొట్టు లేకుండానా? పల్లీలు ఎలా తినడం ఎక్కవ ప్రయోజనకరం!
పల్లీలు మన ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు చేస్తాయి. ఇందులో మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే వీటిని ఒక్కొక్కరు ఒక్కోలా ఆహారంలో చేర్చుకుంటారు. కొందు పొట్టు తీసి తింటే.. మరికొందరు పొట్టుతో పాటు ఆహారంలోకి తీసుకుంటారు. మరి ఈ రెండి విధానాల్లో ఆరోగ్యానికి ఏది మంచిది పొట్టు తీసి తినడమా లేదా తీయకుండ తినడమా?.. ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం.

పల్లీలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి లేకుండా మన రోజువారి ఆహారం అసంపూర్తిగానే ఉంటుంది. అవును భారతీయ వంటకాల్లో పల్లీలకు ఎంతో ప్రాదాన్యత ఉంది. మనం చేసే చాలా వంటల్లో పల్లీలను వాడుతాం.ఇవి కూరలకు టేస్ట్‌తో పాటు మన ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే కొందరు పల్లీలను పొట్టు తీసి తింటారు. కానీ వాటి పూర్తి ప్రయోజనం పొందాలి అంటే మనం కచ్చితంగా పొట్టుతో పాటు తినాలి. ఎందుకంటే పొట్టులోనూ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దాన్ని తీసేసి తినడం వల్ల మనం వాటిని కోల్పోతాం.
పల్లీలు ఎందుకు ఆరోగ్యకరమైనవి
పల్లీలను సాధారణంగా పేదవాడి బాదం అంటారు. ఇందుకో 25 శాతం ప్రొటీన్, 50 శాతం ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్‌తో పాటు విటమిన్ E, ఫోలేట్, నియాసిన్, మెగ్నీషియం, పొటాషియం, జింక్ వంటి మన శరీరానికి కావాల్సిన ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన బాడీకి శక్తిని ఇవ్వడంతో పాటు కండరాలను రిపేర్ చేస్తాయి. ఆకలిని తగ్గించి బరువును నియంత్రించడంలోనూ సహాయపడుతాయి.
పొట్టుతో తినడం వల్ల కలిగే లాభాలు
పల్లీల పొట్టులో పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్, రెస్వెరాట్రాల్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గిస్తాయి. అంతేకాదు పొట్టులో ఉండే ఫైబర్ పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను పెంచి, మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. పొట్టుతో కూడిన పల్లీలు రక్తంలో షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేస్తాయి.
పల్లీలు తినడానికి సరైన పద్ధతి
మీకు పల్లీలు తిన్నప్పుడు జీర్ణక్రియకు ఎలాంటి ఇబ్బంది లేకపోతే పొట్టుతో సహా తినడం వల్లనే అనేక లాభాలు ఉన్నాయి.. మీరు పొట్టుతో తినాలి అనుకుంటే వాటిని ఉప్పు లేకుండా వేయించుకొని లేదా నానబెట్టి తీసుకోవడం మంచిది. ఒకవేళ పొట్టు జీర్ణం కాకపోయినా లేదా రుచి నచ్చకపోయినా, పొట్టు తీసి తిన్నా కూడా పల్లీల నుండి మంచి పోషకాలే అందుతాయి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




