AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth: బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చింది.. ఇంటర్వ్యూకు కూడా వెళ్లా.. కానీ.. జబర్దస్త్ నటి కామెంట్స్..

జబర్దస్త్ నటి తన ప్రేమ, బ్రేకప్ కథను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అర్హత లేని వ్యక్తులు జీవితంలోకి వచ్చారని, అందుకే బ్రేకప్ జరిగిందని పేర్కొంది. పరిశ్రమలో ఎదురైన కమిట్‌మెంట్ కాల్స్, డైరెక్టర్‌ను కొట్టిన ఘటన గురించి వివరించింది. సరైన బ్రేక్ రాకపోవడం, బిగ్ బాస్ అవకాశం మిస్ అవడంపై తన అనుభవాలను పంచుకుంది. ప్రస్తుతం సింగిల్‌గా, సంతోషంగా ఉన్నానని తెలిపింది.

Jabardasth: బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చింది.. ఇంటర్వ్యూకు కూడా వెళ్లా.. కానీ.. జబర్దస్త్ నటి కామెంట్స్..
Jabardasth Actress
Rajitha Chanti
|

Updated on: Aug 23, 2026 | 4:21 PM

Share

ప్రముఖ నటి ఐశ్వర్య వుల్లింగాల, జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి టీవీ షోల ద్వారా ప్రేక్షకులకు సుపరిచితురాలు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె తన వ్యక్తిగత జీవితం, సినీ పరిశ్రమలోని అనుభవాలు, భవిష్యత్ ప్రణాళికల గురించి వివరంగా మాట్లాడారు. గతంలో నాతో నేను సినిమా ప్రమోషన్స్ సందర్భంగా తన సహనటుడు సాయితో కలిసి చేసిన ఒక స్కిట్ బాగా వైరల్ అయిందని ఐశ్వర్య తెలిపారు. ఆ స్కిట్‌ను చూసి చాలామంది తాము నిజంగానే ప్రేమలో ఉన్నామని, కొందరైతే తమకు పెళ్లైందని కూడా భావించారని ఆమె చెప్పారు. అయితే, ఆ ప్రచారం నిజం కాదని స్పష్టం చేశారు. తన గత బంధం గురించి మాట్లాడుతూ, ప్రేమ అనేది చాలా విలువైందని, అయితే దానికి అర్హత లేని వ్యక్తులు జీవితంలోకి వస్తే అది నిలబడదని ఆమె తన బ్రేకప్‌కు గల కారణాన్ని వివరించారు. ప్రస్తుతం సింగిల్‌గా, సంతోషంగా ఉన్నానని పేర్కొంటూ, పెళ్లి చేసుకోవడానికి ఇంకా సమయం ఉందని, తొందర లేదని తెలిపారు. తన తల్లి తన పెళ్లి విషయంపై ఆసక్తి చూపిస్తున్నప్పటికీ, ముందుగా ఇంటికి సంబంధించిన బాధ్యతలను పూర్తి చేసుకోవాలని భావిస్తున్నట్లు ఐశ్వర్య వెల్లడించారు.

సినీ పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఎదురైన చేదు అనుభవాలను ఐశ్వర్య ధైర్యంగా పంచుకున్నారు. డైరెక్టర్‌లు, ప్రొడ్యూసర్‌లు కమిట్‌మెంట్ కోరుతూ ఫోన్ కాల్స్ చేశారని, ఒకానొక సందర్భంలో ఒక డైరెక్టర్‌ను కొట్టి బయటకు వచ్చానని ఆమె తెలిపారు. “కమిట్‌మెంట్ అంటే సినిమా కోసం హార్డ్ వర్క్ చేయడం అనుకున్నాను. కానీ తర్వాత అది వేరే అర్థం అని తెలిసినప్పుడు షాకయ్యాను” అని ఆమె ఆ సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. తాను ఎప్పుడూ అవకాశాల కోసం ఎవరినీ అడగలేదని, తన పనితీరును చూసి అవకాశాలు వచ్చాయని ఐశ్వర్య నొక్కి చెప్పారు.

జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఇతర టీవీ షోలు, సీరియల్స్, వెబ్ సిరీస్‌లలో నిరంతరం పనిచేసినప్పటికీ, తాను ఆశించిన బ్రేక్ రాలేదని ఐశ్వర్య ఆవేదన వ్యక్తం చేశారు. “స్టోరీ బాగా చెప్తారు, కానీ తెరపైకి వచ్చాక డీఓపీ సరిగా లేకపోవడం, డైరెక్టర్ సరిగ్గా కన్వే చేయకపోవడం వల్ల అవుట్‌పుట్ మారవచ్చు” అని ఆమె అభిప్రాయపడ్డారు. KBKG (కిరాక్ బాయ్స్ కిల్లర్ గర్ల్స్) షో నుంచి తన ఎలిమినేషన్ గురించి మాట్లాడుతూ, అగ్రిమెంట్‌లో ఎలిమినేషన్స్ గురించి ప్రస్తావించలేదని, ఇది తనకు చాలా బాధ కలిగించిందని చెప్పారు. షోలలో జరిగే రాజకీయాలపై తాను స్పందించలేనని, తనకు తెలియదని అన్నారు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలకు తాను ఎంతో ప్రాధాన్యత ఇచ్చానని, సినిమా షూటింగ్‌లు ఉన్నప్పటికీ వారికి సమయం కేటాయించానని గుర్తుచేసుకున్నారు.

బిగ్ బాస్ లోకి వెళ్లే ఆసక్తి గురించి అడగ్గా, గత సీజన్‌లో ఇంటర్వ్యూలు అయ్యాయని, కానీ ఇంట్లోకి పిలవలేదని తెలిపారు. తన తల్లిదండ్రులు, ముఖ్యంగా తన తల్లి బిగ్ బాస్ కు పెద్ద అభిమానులని, తనను ఆ స్టేజ్‌పై చూడాలని వారి కల అని ఐశ్వర్య అన్నారు. వారి కలను నెరవేర్చడానికి తాను బిగ్ బాస్ లోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని ఐశ్వర్య స్పష్టం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: రహస్య బావిలో మహిళ అరుపులు.. భయంతో వణికిపోవాల్సిందే.. ఓటీటీని ఊపేస్తున్న హారర్ థ్రిల్లర్..

ఐశ్వర్య పోస్ట్..

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ హీరో మాములోడు కాదు.. నెంబర్ వన్ ఫ్రాడ్.. సీనియర్ నటుడు సురేష్..

Follow Us