కాఫీపొడి గడ్డ కడుతోందా.. పొడిగా ఉంచే సింపుల్ చిట్కాలివే!

Samatha

23 August 2026

కాఫీ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా ప్రతి రోజూ కాఫీ తాగుతూ ఉంటారు.

అయితే కాఫీ తాగడం  ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరి ఇంటిలో ఈ పొడి ఉంటుంది.

కానీ చాలా మంది కాఫీ పొడి కొనుగోలు చేసిన తర్వాత అది గడ్డ కట్టి పోతుందని చాలా బాధపడి పోతుంటారు. ఎక్కువ మొత్తంలో కొనడానికి భయపడుతుంటారు.

కాగా, ఇప్పుడు మనం కాఫీ పొడి గడ్డ కట్టకుండా ఉండాలి అంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో వివరంగా చూసేద్దాం పదండి.

ఎప్పుడూ కూడా కాఫీ పొడిని గాలి చొరబడని బాక్స్‌లో స్టోర్ చేయాలి. ముఖ్యంగా గాజు పాత్రలో కాఫీ పొడి స్టోర్ చేసుకోవడ వలన ఇది త్వరగా పాడవదు.

అలాగే, వెలుతురు లేని చోట, చల్లని ప్రదేశం, చీకటిగా ఉండే ప్రదేశంలో కాఫీ పొడిని స్టోర్ చేయడం వలన అది గడ్డ కట్టకుండా ఫ్రెష్‌గా ఉంటుంది.

కాఫీ పొడి ఎక్కువ కాలం మన్నికగా ఉండటమే కాకుండా, గడ్డ కట్టకుండా ఉండాలి అంటే తప్పకుండా వాక్యూమ్ సీల్డ్ బ్యాగ్ ఉపయోగించండి.

 దీని లో కాపీ పొడిని స్టోర్ చేయడం వలన అది త్వరగా గడ్డకట్టి పోకుండా చాలా ఫ్రెష్‌గా ఇప్పుడే కొనుగోలు చేసిన దానిలో ఉంటుంది.