AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్టైల్ మార్చండి బాస్.. చికెన్ కర్రీ ఇలా వండారంటే తెపాళ్ల లేపుతారు.. కమ్మగా, క్రీమీగా..

ఆదివారం స్పెషల్‌గా చికెన్‌ను కాస్త కొత్తగా, కమ్మగా వండాలనుకుంటున్నారా? కొబ్బరి, గసగసాలు, జీడిపప్పుతో తయారు చేసే ఈ క్రీమీ చికెన్ కర్రీ ఎంతో రుచిగా ఉంటుంది. అన్నం, చపాతీ, పుల్కా, పూరీల్లోకి అదిరిపోయే ఈ చికెన్ కర్రీని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి.

స్టైల్ మార్చండి బాస్.. చికెన్ కర్రీ ఇలా వండారంటే తెపాళ్ల లేపుతారు.. కమ్మగా, క్రీమీగా..
Chicken
Shaik Madar Saheb
|

Updated on: Aug 23, 2026 | 3:21 PM

Share

ఆదివారం వచ్చిందంటే చాలు.. నాన్ వెజ్ ప్రియులు చికెన్‌ను ఇష్టంగా కొనితెచ్చుకుంటారు. అంతేకాకుండా.. కర్రీ, ఫ్రైతో పాటు.. పలు రకాలుగా మంచిగా వండుకుని ఆస్వాదిస్తూ తింటారు. అయితే.. చికెన్ ను ఎప్పుడూ ఒకే స్టైల్‌లో వండటం కంటే.. కొంచెం వైరైటీగా, కమ్మగా క్రీమీ స్టైల్‌లో వండుకుంటే ఆ రుచే వేరు.. దీని కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు.. కొబ్బరి, గసగసాలు, జీడిపప్పుతో అద్భుతమైన చికెన్ కర్రీని నిమిషాల్లోనే వండుకోవచ్చు..

రుచికరమైన, కమ్మని క్రీమీ చికెన్ కర్రీని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే విధానాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం.. ఈ వంటకం కొత్తగా వంట నేర్చుకునే వారికి కూడా ఎంతో సౌలభ్యాన్ని అందిస్తుంది. నెమ్మదిగా వండటం వల్ల చికెన్ చాలా మృదువుగా, క్రీమీగా తయారవుతుంది.

కావాల్సిన పదార్థాలు:

చికెన్: (శుభ్రం చేసింది)

నూనె, ఉల్లిపాయలు (సన్నగా తరిగినవి), పచ్చిమిర్చి, టొమాటో (సన్నగా తరిగినది), అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం (మీ రుచికి తగ్గట్టు), ఉప్పు, ధనియాల పౌడర్, గరం మసాలా, కొత్తిమీర

పేస్ట్ కోసం:

  • ఎండు కొబ్బరి: 3-4 టేబుల్ స్పూన్లు (తురిమినది)
  • గసగసాలు: 1 టీ స్పూన్
  • జీడిపప్పు: 10-15 పలుకులు
  • కొద్దిగా నీళ్లు

తయారీ విధానం:

పేస్ట్ సిద్ధం చేయడం: ముందుగా ఎండు కొబ్బరి తురుము, గసగసాలు, జీడిపప్పు పలుకులను ఒక మిక్సీలో వేసి, కొద్దిగా నీళ్లు చేర్చి మెత్తటి పేస్ట్‌లా రుబ్బుకోవాలి. దీనిని పక్కన పెట్టుకోవాలి.

పోపు సిద్ధం చేయడం: స్టవ్ మీద కడాయి పెట్టి, 5 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కాక, దాల్చిన చెక్క ముక్క, రెండు యాలక్కాయలు, రెండు లవంగాలు, ఒక బిర్యానీ ఆకు వేసి కొన్ని సెకన్ల పాటు వేయించాలి.

ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేయించడం: సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి, మీడియం ఫ్లేమ్‌లో ఉల్లిపాయలు పచ్చివాసన పోయి, బంగారు రంగు వచ్చేవరకు సుమారు మూడు నిమిషాలు వేయించాలి.

మసాలాలు చేర్చడం: ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు లో నుండి మీడియం ఫ్లేమ్‌లో రెండు నిమిషాలు వేయించాలి. తరువాత 1 టేబుల్ స్పూన్ కారం (లేదా రుచికి తగ్గట్టు) వేసి మరో నిమిషం పాటు వేయించాలి.

చికెన్ ఉడికించడం: శుభ్రం చేసి పెట్టుకున్న 300 గ్రాముల చికెన్‌ను కడాయిలో వేసి, మసాలా మొత్తం చికెన్‌కు బాగా పట్టేలా కలపాలి. వాటర్ ఏమీ కలపకుండా మూత పెట్టి, లో ఫ్లేమ్‌లో నాలుగు నిమిషాలు ఉడికించాలి. అడుగంటకుండా మధ్యమధ్యలో కలుపుకోవచ్చు. ఈ దశలో చికెన్ నుండి సహజంగా నీళ్లు ఊరుతాయి.

టొమాటో, ఉప్పు కలపడం: నాలుగు నుండి ఐదు నిమిషాల తరువాత, సన్నగా తరిగిన మీడియం సైజ్ టొమాటో ముక్కలు వేసి, మరొక్క నిమిషం పాటు లో ఫ్లేమ్‌లో ఉడికించాలి. టొమాటో మెత్తబడిన తర్వాత, 3/4 టేబుల్ స్పూన్ ఉప్పు (రుచికి సరిపడా) వేసి, చికెన్‌కు బాగా పట్టేలా కలపాలి.

కొబ్బరి-గసగసాల పేస్ట్ చేర్చడం: ముందుగా తయారు చేసుకున్న కొబ్బరి, గసగసాలు, జీడిపప్పు పేస్ట్‌ను చేర్చాలి. మిక్సీ జార్‌లో కొద్దిగా నీళ్లు (సుమారు ఒక గ్లాసు లేదా 250-300 మి.లీ) వేసి, ఆ పేస్ట్‌ను కడాయిలోకి చేర్చాలి. మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే మరికొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు.

కడాయికి మూత పెట్టి, మంటను తగ్గించి, ఎనిమిది నుండి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో నెమ్మదిగా ఉడికించాలి. ఈ సమయంలో మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి.

ఎనిమిది నుండి పది నిమిషాల తర్వాత, నూనె పైకి తేలి, చికెన్ దాదాపు ఉడికినట్లు గమనించవచ్చు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి, గ్రేవీకి బాగా పట్టేలా కలపాలి. మరొక్కసారి మూత పెట్టి రెండు నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఉడికించాలి.

అనంతరం స్టవ్ ఆఫ్ చేసి, సన్నగా తరిగిన 1.5 నుండి 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. మూత పెట్టి ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆ తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. ఈ క్రీమీ చికెన్ కర్రీ అన్నం, చపాతీ, పుల్కా, పూరీ వంటి వాటిలోకి అద్భుతంగా ఉంటుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కొబ్బరి గసగసాలతో కోడి కూర.. ఇలా వండారంటే 2 ప్లేట్లు తింటారు
కొబ్బరి గసగసాలతో కోడి కూర.. ఇలా వండారంటే 2 ప్లేట్లు తింటారు
గిల్ అరుదైన రికార్డ్.. ఈ దశాబ్దంలోనే ఎవరికీ సాధ్యం కాలేగా..!
గిల్ అరుదైన రికార్డ్.. ఈ దశాబ్దంలోనే ఎవరికీ సాధ్యం కాలేగా..!
చూసేకి పెద్దమనిషే.. సార్ ట్యాలెంట్‌ తెలిస్తే మతిపోద్ది!
చూసేకి పెద్దమనిషే.. సార్ ట్యాలెంట్‌ తెలిస్తే మతిపోద్ది!
ఉద్యోగం మానేయాలనుకుంటున్నారా? HR మేనేజర్ షాకింగ్ వార్నింగ్!
ఉద్యోగం మానేయాలనుకుంటున్నారా? HR మేనేజర్ షాకింగ్ వార్నింగ్!
వార్నీ ఫోన్‌ ఛార్జింగ్ స్పీడ్‌ పెంచడం ఇంత ఈజీనా! ఇన్నాళ్లు తెలీదే
వార్నీ ఫోన్‌ ఛార్జింగ్ స్పీడ్‌ పెంచడం ఇంత ఈజీనా! ఇన్నాళ్లు తెలీదే
ఈ తేదీల్లో పుట్టిన వారు ఓటమిని అస్సలు అంగీకరించరట.. విజయం సాధించే
ఈ తేదీల్లో పుట్టిన వారు ఓటమిని అస్సలు అంగీకరించరట.. విజయం సాధించే
EPFOలో కొలువులకు యూపీఎస్సీ నోటిఫికేషన్‌.. డిగ్రీ పాసైతే చాలు
EPFOలో కొలువులకు యూపీఎస్సీ నోటిఫికేషన్‌.. డిగ్రీ పాసైతే చాలు
చెన్నైలో రూ.500 కోట్ల ఆస్తులు.. కమెడియన్ సుధాకర్ రియాక్షన్ ఇదే..
చెన్నైలో రూ.500 కోట్ల ఆస్తులు.. కమెడియన్ సుధాకర్ రియాక్షన్ ఇదే..
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
మహిళల బొట్టు, గాజులపై అనసూయ వీడియో.. నెటిజన్లు ఏమంటున్నారంటే?
మహిళల బొట్టు, గాజులపై అనసూయ వీడియో.. నెటిజన్లు ఏమంటున్నారంటే?