Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nonstick Ware: నాన్ స్టిక్ పాత్రల్లో వండుతున్నారా?.. మీ బాడీలోకి స్లో పాయిజన్ ఎక్కించినట్టే

నూనె వాడకం తగ్గుతుందనో.. వంట సులువవుతుందనో చాలా మంది నాన్ స్టిక్ పాత్రలు వాడుతుంటారు. వీటి వాడకం వల్ల కలిగే ప్రమాదాల గురించి మీకు ఇప్పటికే ఒక అవగాహన వచ్చే ఉంటుంది. కానీ, తాజాగా వీటి వాడకంపై నిపుణులు చెప్తున్న విషయాలు వింటే ఇప్పుడే వాటిని పక్కన పెట్టేస్తారు.

Nonstick Ware: నాన్ స్టిక్ పాత్రల్లో వండుతున్నారా?.. మీ బాడీలోకి స్లో పాయిజన్ ఎక్కించినట్టే
Nonstick Ware
Follow us
Bhavani

|

Updated on: Feb 14, 2025 | 9:31 PM

ఇప్పటికే ఐసీఎంఆర్ వంటి సంస్థలు వీటి వాడకంపై హెచ్చరికలు జారీ చేశారు. నాన్ స్టిక్ పాత్రల్లో వాడే పదార్థాన్ని టెఫ్లాన్ అంటారు. ఇది కార్బన్, ఫ్లోరిన్ పరమాణువులతో చేస్తారు. ఇందులో సింథటిక్ రసాయనాలు వాడుతారు. అందుకే నాన్ స్టిక్ పాన్ ల మీద ఏ చిన్న గీత పడినా అది టెఫ్లాన్ ను కరిగించి అందులోనుంచి విషవాయువులను విడుదల చేస్తుంది. ఈ హానికర కెమికల్స్ మనం తినే ఆహారంలో కలుస్తాయి. కనీసం ఒక్క గీత నుంచి 9 వేల మైక్రో ప్లాస్టిక్ రేణువులు విడుదల చేస్తుందట. ఈ లెక్కన మనం వాడే పాత్రల్లో వందల గీతలు ఉంటాయి. వీటి నుంచి లక్షల స్థాయిలో మైక్రో ప్లాస్టిక్స్ విడుదలై మన శరీరంలో కలిసిపోయుంటాయి. ఇది మన ఆరోగ్యాన్ని తీవ్ర స్థాయిలో దెబ్బతీస్తుందని నిపుణులు చెప్తున్నారు.

ఇన్ని వ్యాధులా..

170 సెల్సియస్ డిగ్రీల కన్నా ఈ పాత్రలను వేడి చేసినప్పుడు వాటి నుంచి విడుదలయ్యే అణువులు శ్వాసకోశ వ్యాధులను కలిగిస్తాయని ఐసీఎంఆర్ తెలిపింది. అంతేకాదు ఇవి థైరాయిడ్, క్యాన్సర్ వంటి వ్యాధులను కూడా కలుగజేస్తుందట. గీతలు పడకపోయినా వీటిని వాడకపోవడమే మంచిదట. ఈ పాత్రల ఆకారంలో ఏమాత్రం తేడా గమనించినా వాటిని పక్కన పెట్టేయాలని సూచిస్తున్నారు. వీటి కారణంగా వివిధ రకాల క్యాన్సర్లతో పాటు కిడ్నీ వ్యాధులు, అధిక రక్తపోటును కూడా కలిగిస్తుందట. నాన్​స్టిక్ పాత్రలను ఉపయోగించడం వల్ల క్యాన్సర్, సంతానోత్పత్తి, శరీర నొప్పులు, హార్మోన్లలో అసమతుల్యత, తలనొప్పి వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆప్‌ మెడికల్‌ రీసెర్చ్‌ వెల్లడించింది.

నాన్ స్టిక్ పాత్రలకు బదులుగా..

నాన్ స్టిక్ పాత్రలకు బదులుగా పాత పద్దతిలో వాడే పాత్రలను ఉపయోగించ్చుకోవచ్చు. పూర్వం మట్టిపాత్రల్లో వండేవారు. అది ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. అయితే వీటిని మెయింటైన్ చేయడం అన్ని వేళలా సాధ్యం కాదు కాబట్టి అడుగు మందంగా ఉండే స్టెయిన్ లెస్ స్టీలును వాడుకోవచ్చు. మంటను సిమ్ లో పెట్టి వంట చేయడం వల్ల అడుగు మాడే సమస్య దాదాపు తగ్గుతుంది. రసాయనిక పూతలు లేని పాత్రలను కూడా వంట కోసం ఉపయోగించవచ్చు.