Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Milk Side Effects: పొరబాటున కూడా వీటిని పాలతో కలిపి తీసుకోవద్దు.. తేడా వస్తే మీ ప్రాణాలకే ముప్పు..

ప్రతిరోజూ పాలు తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చన్న సంగతి తెలిసిందే. ఎందుకంటే పాలలో ఉండే పోషకపదార్థాలు ఆరోగ్యానికి ఎంతో మంచివి.

Milk Side Effects: పొరబాటున కూడా వీటిని పాలతో కలిపి తీసుకోవద్దు.. తేడా వస్తే మీ ప్రాణాలకే ముప్పు..
milk
Follow us
Madhavi

| Edited By: Janardhan Veluru

Updated on: Mar 12, 2023 | 10:31 AM

ప్రతిరోజూ పాలు తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చన్న సంగతి తెలిసిందే. ఎందుకంటే పాలలో ఉండే పోషకపదార్థాలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. రోజూ క్రమం తప్పకుండా పాలు తాగినట్లయితే ఎముకలు బలంగా మారుతాయి. ఇందుకు కాల్షియం దోహదం చేస్తుంది. అయితే పాలతో పాటు కొన్ని రకాల పదార్థాలను కలిపి అస్సలు తినకూడదు. తింటే తీవ్ర అనార్థాలకు దారితీస్తుంది. కొన్ని సందర్భాల్లో ప్రాణాలకే ముప్పు.. మరి ఆ ఆహార పదార్థాలేంటో తెలుసుకుందాం.

చేపలు:

చేపలు, పాలు కలిపి తినకూడదు. ఎందుకంటే ఇది జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. చేపలు, పాలు తిన్న తర్వాత అసౌకర్యానికి గురవుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే చేపలు ఎక్కువగా తింటే అజీర్త సమస్యతలెత్తుతుంది. పాలు మన శరీరాలపై శీతలీకరణ ప్రభావాన్నిచూపుతాయి. ఈ ఆహార పదార్థాలు కలిసి శరీరంలో రసాయన అసమతుల్యతను కలిగిస్తాయి, ఇది ఉబ్బరం, కడుపు నొప్పి, చర్మ అలెర్జీలకు కూడా దారితీస్తుంది.

ఇవి కూడా చదవండి

అరటిపండు:

చాలామంది అరటిపండ్లు, పాలు కలిపి తింటే ఆరోగ్యానికి మంచిదని భావిస్తుంటారు. చిన్నపిల్లలకు పాలలో అరటిపండును మిక్స్ చేసి తినిపిస్తుంటారు. అయితే ఈ కాంబినేషన్ అంత ఆరోగ్యకరం కాదని డైటీషియన్లు చెబుతున్నారు. ఎందుకంటే అరటిపండ్లు, పాల కలయిక మన శరీరాన్ని బరువు పెంచేలా చేస్తాయి. అంతేకాదు ఇవి జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. అలసటకు దారితీస్తుంది. ఆయుర్వేద విశ్వాసాల ప్రకారం, అరటిపండుతో పాలు మన శరీరంలో హానికరమైన టాక్సిన్స్‌ను విడుదల చేస్తాయి. జీర్ణ ప్రక్రియను నెమ్మదిస్తాయి. ఈ కలయిక జలుబు, దగ్గు, అలెర్జీలకు కూడా దారితీస్తుంది.

పెరుగు, చీజ్:

పాలను పెరుగు, జున్ను ఇతర పులియబెట్టిన ఉత్పత్తులతో జోడించి తినకూడదు. ఎందుకంటే ఈ ఆహార పదార్థాలు పాల కంటే చాలా భిన్నమైన లక్షణాలను కలిగి ఉంటాయి. అంటువ్యాధులు, ప్రేగు సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది. అటువంటి ఆహారాలను కలిపి తినడం వల్ల అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.

పుచ్చకాయలు:

పండ్లతో పాలను కలపి తినడం మంచిది కాదు. పుచ్చకాయ, పాలు అనారోగ్యకరమైన ఆహార కలయిక. ఇది జీర్ణ సమస్యలు, వాంతులు, విరేచనాలు, విషపూరిత పెరుగుదలకు దారితీస్తుంది. ఎందుకంటే పాలు మన శరీరంలో భేదిమందులా పనిచేస్తాయి.

సిట్రస్ పండ్లు:

తాజా పాలలో ఏదైనా ఆమ్లం కలిపితే పెరుగు అవుతుందని మీకు తెలుసా? సాధారణంగా, ఈ పద్ధతిని జున్ను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. సిట్రస్ పండ్లతో పాలను తీసుకున్నప్పుడు, పాలు ప్రభావంతో గడ్డకట్టడం వల్ల గ్యాస్, గుండెల్లో మంట వచ్చే ప్రమాదం ఉంది.

ముల్లంగి:

చేపల మాదిరిగానే, ముల్లంగి మన శరీరంపై వేడి ప్రభావాన్ని కలిగి ఉంటుంది. పాలతో కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ ఆలస్యం అవుతుంది. ఇది ఇతర కారకాలకు కూడా దారి తీస్తుంది. పాలు తాగిన లేదా ఇతర పాల ఉత్పత్తులను తీసుకున్న తర్వాత కనీసం 2 గంటల తర్వాత ముల్లంగిని తినకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇవి పాలతో దూరంగా ఉండవలసిన కొన్ని ఆహార పదార్థాలు. అయితే, చాలా ప్రయోజనకరమైన కొన్ని ఆహార కలయికలు కూడా ఉన్నాయి. రాత్రిపూట ఒక గ్లాసు పాలతో పాటు రెండు బాదం పప్పులు తింటే మంచి నిద్ర వస్తుంది. అదేవిధంగా, దాల్చినచెక్క, అల్లం, పసుపు వంటి మసాలా దినుసులను రాత్రిపూట పాలలో చేర్చుకుని తాగవచ్చు, ఎందుకంటే అవి శరీరాన్ని శాంతపరిచే, శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో మెరుగ్గా పనిచేస్తాయి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి..