Heart Attack: గుండె ఆరోగ్యంగా ఉండాలా.? ఈ 5 ఆహారాలు రోజూ తీసుకోండి

అయితే గుండె ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక వ్యాయామం, జీవిన విధానంలో మార్పులు చేసుకోవడం ఎంత ముఖ్యమో తీసుకునే ఆహారం విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తీసుకునే ఆహారంలో కచ్చితంగా కొన్ని రకాల ఆహార పదార్థాలు ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. గుండె సంబంధిత సమస్యల...

Heart Attack: గుండె ఆరోగ్యంగా ఉండాలా.? ఈ 5 ఆహారాలు రోజూ తీసుకోండి
Heart Attack
Follow us

|

Updated on: May 14, 2024 | 1:30 PM

మారుతోన్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా హృద్రోగాల బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన వారిలోనే గుండె సంబంధిత సమస్యలు కనిపించేవి. అయితే ప్రస్తుతం పట్టుమని పాతికేళ్లు కూడా నిండని వారు కూడా గుండె జబ్బుల బారిన పడుతున్నారు.

అయితే గుండె ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక వ్యాయామం, జీవిన విధానంలో మార్పులు చేసుకోవడం ఎంత ముఖ్యమో తీసుకునే ఆహారం విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తీసుకునే ఆహారంలో కచ్చితంగా కొన్ని రకాల ఆహార పదార్థాలు ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. గుండె సంబంధిత సమస్యల బారినపడకుండా ఉండకూడదంటే ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

* గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతీరోజూ డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వాల్‌నట్స్‌ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులోని ఫైబర్‌ కంటెంట్‌ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అలాగే రక్తపోటును అదుపులో ఉంచడంలో ఉపయోగపడతాయి.

* టమాటోల్లో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది గుండెకు చాలా మేలు చేస్తుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తొలగిస్తుంది. అలాగే అధిక బీసీ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

* గుండె ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీరు తాజా పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇందులో ఉండే మినరల్స్, విటమిన్స్ వంటి పోషకాలు కొలెస్ట్రాల్, రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి.

* ఇక ప్రతీ రోజూ టిఫిన్‌గా ఓట్స్‌ తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. అలాగే ఇందులోని బీటా గ్లూకాన్ అని పిలిచే ఫైబర్ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. తీసుకునే ఆహారంతో ఆల్కహాల్‌, స్మోకింగ్ వంటి అలవాట్లకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..