Actress: త్వరలోనే తల్లి కానున్న క్రేజీ హీరోయిన్.. బేబీ బంప్‌తో దర్శనమిచ్చిన అందాల తార.. వీడియో ఇదిగో
సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ ఈ ముద్దుగుమ్మ కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. కెరీర్ ఆరంభంలోనే క్రేజీ హీరోలతో సినిమాలు చేసింది. కానీ అదృష్టం మాత్రం కలిసి రాలేదు. మూడు సినిమాలు చేసినా విజయం మాత్రం దక్కలేదు. దీంతో సినిమాలకు విరామం ఇచ్చి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది.
బాలీవుడ్ ప్రముఖ నటి అతియా శెట్టి, టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ ఏడాది నవంబర్ నెలలో ఈ శుభవార్తను తన అభిమానులతో షేర్ చేసుకుంది అతియా శెట్టి. ‘2025లో మన జీవితంలోకి కొత్త అతిథి వస్తాడు’ అంటూ ఓ పోస్ట్ పెట్టి మురిసిపోయింది. ఈ పోస్ట్ తర్వాత పెద్దగా బయట కనిపించలేదు అతియా. తాజాగా ఆమెకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో అతియా బేబీ బంప్ తో కనిపించింది. ఈ వీడియోలో ఆమె తో పాటు విరాట్ కోహ్లీ సతీమణి అనుష్కా శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి తండ్రి కూడా కనిపించారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్టు మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఈ మ్యాచ్‌ల సమయంలో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ లకు మద్దతుగా అతియా శెట్టి, అనుష్క ఆస్ట్రేలియాలోనే ఉంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో, అతియా, అనుష్క మెల్బోర్న్ స్టేడియం నుండి బయటకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ క్యాజువల్ డ్రెస్సుల్లో తళుక్కుమన్నారు. మెల్ బోర్న్ మ్యాచ్ సందర్భంగా అనుష్క, అతియా శెట్టి నితీష్ రెడ్డి తండ్రిని కలిశారు.
అతియా శెట్టి, కేఎల్ రాహుల్ 2023లో పెళ్లి చేసుకున్నారు. ఖండాలాలోని సునీల్ శెట్టి బంగ్లాలో అంగరంగ వైభవంగా ఈ వివాహ వేడుక జరిగింది. పెళ్లికి ముందు అతియా రాహుల్ కొన్నేళ్ల పాటు ప్రేమలో మునిగి తేలారు. అతియా, రాహుల్ ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా మొదటిసారి కలుసుకున్నారు. మొదటి పరిచయంలోనే ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఆ సమయంలో, ఫ్యాషన్ డిజైనర్ విక్రమ్ ఫడ్నిస్ కూడా సోషల్ మీడియాలో అతియా డేటింగ్ లైఫ్ గురించి హింట్ ఇచ్చారు. 2021లో అతియా పుట్టినరోజున, కేఎల్ రాహుల్ ఉన్న ఫొటోను పోస్ట్ చేయడం ద్వారా తమ ప్రేమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు.
ఆస్ట్రేలియాలో అతియా శెట్టి, అనుష్కా శర్మ..
Anushka Sharma and Athiya Shetty meet with Nitish Reddy’s father at MCG.#AUSvIND #INDvsAUS #MCG #nitishreddy#anushkasharma#athiyashettypic.twitter.com/M21afMwpIm
— RAJASTHANI MAN (@rajasthaniman1) December 29, 2024
అథియా తన తండ్రి సునీల్ శెట్టి అడుగుజాడల్లో నడుస్తూ నటనలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. 2015లో ‘హీరో’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ‘ముబారకన్’, ‘మోతీచూర్’ అనే రెండు చిత్రాల్లో నటించింది. కానీ అతియాకు ఆశించిన విజయం దక్కలేదు. దీంతో ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటోంది.
భర్త కేఎల్ రాహుల్ తో అతియా శెట్టి..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.