సిట్రస్ పండ్లు: నారింజ, నిమ్మకాయలు, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్.. ఇది ఇన్ఫెక్షన్‌తో పోరాడటానికి అవసరమైన తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది. మీ ఆహారంలో సిట్రస్ పండ్లను చేర్చడం ద్వారా, మీ శరీరం విటమిన్ సి అవసరమైన మోతాదును పొందవచ్చు.. ఇది అనేక కాలానుగుణ వ్యాధులను నివారించడంలో మీకు సహాయపడుతుంది.