- Telugu News Photo Gallery Can sugar patients eat jaggery? What happens if you eat it? Check Here is Details
Jaggery for Diabetes: ఎంతో మందిలో ఉండే డౌట్.. షుగర్ పేషెంట్స్ బెల్లం తినొచ్చా..
పంచదార కంటే బెల్లం తినడం మేలు. బెల్లంలో అనేక రకాల పోషకాలు లభిస్తాయి. కానీ షుగర్ పేషెంట్స్ మాత్రం బెల్లం తినొచ్చా? ఈ డౌట్ చాలా మందిలో ఉంటుంది. ఏదైనా తీపి పదార్థమే.. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించాలి. వైద్యుల సలహా మేరకు తీసుకోవాలి..
Updated on: Dec 30, 2024 | 2:46 PM

షుగర్ వ్యాధి ఎంతలా పాకుతుందంటే.. డయాబెటీస్‌కి ఇండియా రాజధానిలా మారింది. భారత దేశంలో ఎక్కువగా మధుమేహం కేసులు పెరిగిపోతున్నాయి. ఆహారపు అలవాట్లలో తీవ్రంగా మార్పులు రావడం వలన ఈ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.

డయాబెటీస్ వచ్చిన వారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఆరోగ్యానికే ముప్పుగా మారుతుంది. కొన్ని రకాల ఆహారాలు అస్సలు తీసుకోకపోవడమే మంచిది. ఈ వ్యాధిని పూర్తిగా నయం చేసే మెడిసిన్ ఇంకా రాలేదు.

షుగర్ వ్యాధి వచ్చిన వారు పంచదార తినకూడదని కానీ బెల్లం తినొచ్చని చాలా మంది చెబుతూ ఉంటారు. కానీ డయాబెటీస్ పేషెంట్స్ బెల్లం తింటే.. షుగర్ లెవల్స్ పెరగవా అనే డౌట్ చాలా మందిలో ఉండే ఉంటుంది. పంచదార కంటే బెల్లం తినడం మంచిది.

బెల్లం సల్ఫర్ సమ్మేళనంతో కల్తీ చేస్తే దానిని సులభంగా పరీక్షించవచ్చు. కాబట్టి బెల్లం ముక్కపై కొన్ని చుక్కల హైడ్రోక్లోరిక్ యాసిడ్ కలపాలి. దీనిపై బుడగలు కనిపిస్తే, అందులో సల్ఫర్ ఉందని అర్ధం చేసుకోవాలి.

స్వచ్ఛమైన బెల్లం రంగు గోధుమ, పసుపు రంగులో ఉంటుంది. బెల్లం రంగు చాలా ప్రకాశవంతంగా, ఆకర్షణీయంగా ఉంటే, దానిలో కృత్రిమ రంగులు కలిపారని అర్ధం. కాబట్టి ఒక చిన్న ముక్కను నీటిలో కరిగించి చూడాలి. నీటి రంగు మారితే, అందులో రంగు కలిపారని అర్ధం.




