- Telugu News Photo Gallery Cinema photos Heroine Sai Pallavi sister Pooja Kannan's wedding photos go viral
Sai Pallavi: చెల్లి పెళ్ళిలో చందమామలా మెరిసిన నేచురల్ బ్యూటీ.. ఎంత ముద్దుగా ఉందో..
స్టార్ హీరోయిన్ సాయి పల్లవికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికి తెలుసు. ముఖ్యంగా తెలుగులో ఈ అమ్మడిని లేడీ పవర్ స్టార్ అని పిలుస్తుంటారు. మలయాళ చిత్రాల ద్వారా కథానాయికగా తెరంగేట్రం చేసినా, తమిళంలో నటి కంగనా సరసన ధామ్ ధూమ్ చిత్రంలో బాలతారగా నటించింది. ఆ తర్వాత చాలా కాలం తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
Updated on: Dec 30, 2024 | 2:28 PM

స్టార్ హీరోయిన్ సాయి పల్లవికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికి తెలుసు. ముఖ్యంగా తెలుగులో ఈ అమ్మడిని లేడీ పవర్ స్టార్ అని పిలుస్తుంటారు. మలయాళ చిత్రాల ద్వారా కథానాయికగా తెరంగేట్రం చేసినా, తమిళంలో నటి కంగనా సరసన ధామ్ ధూమ్ చిత్రంలో బాలతారగా నటించింది. ఆ తర్వాత చాలా కాలం తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

మొదట్లో డ్యాన్సర్‌గా మారాలని ఆశించిన ఆమె తెలుగులో ఢీ ( ఎవరు నెక్స్ట్ ప్రభుదేవా.?) అనే కార్యక్రమం తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సాయి పల్లవి అనేక తెలుగు, మలయాళ టీవీ షోలలో పాల్గొని చేసి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.

నటి సాయి పల్లవి కోయంబత్తూరులోని పటాకా తెగకు చెందినది. పాఠశాల తర్వాత, ఆమె ఎంబీబీఎస్ చేసింది ఈ ముద్దుగుమ్మ జార్జియాలోని టిబిలిసి స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో తన వైద్య విద్యను పూర్తి చేసింది. ఇక ఇప్పుడు హీరోయిన్ గా రాణిస్తుంది.

సాయి పల్లవి తర్వాత ఆమె చెల్లెలు పూజా కన్నన్ కూడా సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపింది. దర్శకుడు AL విజయ్ నిర్మించిన చిత్రై సెవ్వనంలో నటుడు సముద్రగాని కుమార్తెగా నటించింది. జీ5 ఓటీటీలో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దీని తర్వాత ఆమెకు పెద్దగా ఆఫర్స్ రాలేదు.

సెప్టెంబర్ 5న తన చిరకాల ప్రియుడు వినీత్ శివకుమార్‌ను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళింది సాయి పల్లవి. తాజాగా సాయి పల్లవి తన సోదరి ఫోటోలను పంచుకుంది "పెళ్లి అయిన 3 నెలల తర్వాత, ఆమె తన సోదరి పూజను విష్ చేస్తూ సోషల్ మీడియాలో ఫోటోలను పంచుకుంది.