Health: ఇది పిచ్చి ఆకు అనుకుంటే మీరు తింగరోళ్లే.. లివర్‌ కడిగినట్లే క్లీన్…

మీ ఇంటి ముందు, రోడ్ల పక్కన, పొలం గట్లపై.. ఈ మొక్క పెరుగుతుంది. లివర్, కిడ్నీ నుంచి కీళ్ల నొప్పుల దాకా దివ్యఔషధం చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. కిడ్నీ స్టోన్స్‌తో బాధపడేవాళ్లకు ఇది చక్కని మెడిసిన్ అంటున్నారు. చెలకల్లో, బీడు భూముల్లో పెరిగే ఈ ఆకు కూర గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి...

Health: ఇది పిచ్చి ఆకు అనుకుంటే మీరు తింగరోళ్లే.. లివర్‌ కడిగినట్లే క్లీన్...
Punarnava
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 30, 2024 | 4:20 PM

ఈ రోజు మంచి ఔషధ గుణాలు ఓ మొక్క గురించి తెలుసుకుందాం. గలిజేరు పల్లెటూర్లలో ఉండేవారికి తెలుసు. పట్నాల్లో పెరిగినవారికి మాత్రం దీని  గురించి అవగాహన ఉండదు. గలిజేరు పొలం గట్ల వెంబటి.. రోడ్ల పక్కన తీగలా పాకుతుంది. రెయినీ సీజన్‌లో మంచి ఇళ్ల మధ్య కూడా పెరుగుతుంది. గ్రామల్లో దీన్ని ఆకుకూర మాదిరిగా వండుకుని తింటారు. ఇందులో కూడా ఎర్ర గలిజేరు, తెల్ల గలిజేరు.. రెండు రకాలున్నాయి. ఆయుర్వేదం, ఇంటి వైద్యంలో ఈ మొక్కను విరివిగా ఉపయోగిస్తారు. ఈ ఆకుకూర తినడం ఏమేం ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

కిడ్నీ సమస్యలు ఖతం :  ప్రస్తుతం కిడ్నీ సమస్యలతో చాలామంది సతమతం అవుతున్నారు. అలాంటివారు దీన్ని డైట్‌లో యాడ్ చేసుకుంటే సూపర్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ ఆకు కిడ్నీలను శుభ్రంగా, ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది. కిడ్నీల పనితీరు కూడా మెరుగ్గా ఉండేలా చూస్తుంది. గలిజేరులో ఉండే యాంటీఆక్సిడెంట్లు పుష్కలం. ఇతర పోషకాలు యూరిన్ ప్రవాహాన్ని పెంచి కిడ్నీలో రాళ్లను బయటకు పంపడంతో బాగా హెల్ప్ చేస్తాయి. అలాగే ఒంటికి పట్టని నీరును తగ్గిస్తుంది ఈ మొక్క. అలాగే మూత్రనాళ ఇన్ఫెక్షన్స్ కూడా గలిజేరు చెక్ పెడుతుంది.

లివర్‌కు ఎంతో మేలు : గలిజేరులో యాంటీఆక్సిడెంట్లు బాగా ఉంటాయి. అలాగే.. ఇతర మినరల్స్ సైతం ఉంటాయి. దీన్ని తినడం ద్వారా లివర్ చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఫ్యాటీ లివర్ సమస్య ఎదుర్కొనుందుకు సాయపడుతుంది.

ఎముకల పటుత్నం : ఈ ఆకుకూరలో కాల్షియం మస్త్ ఉంటుంది. దీన్ని తినడం ద్వారా బోన్స్ బలంగా తయారవుతాయి. కీళ్లనొప్పులు, ఆర్థరైటిస్, కాళ్ల వాపు లక్షణాలను తగ్గించడంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అదేవిధంగా గలిజేరు ఆకుల్లో డయాబెటిస్​ను కంట్రోల్ చేసే గుణం ఉందట.

చక్కని జీర్ణక్రియ : ఈ ఆకుకూరలో తింటే జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయంటున్నారు ఆయుర్వేద వైద్యులు. దీన్ని తినడం ద్వారా కడుపు ఉబ్బరం, అజీర్తి మలబద్ధకం సమస్యల నుంచి ఉపశమనం ఉంటుందంటున్నారు. అలాగే ఒబెసిటీని నియంత్రించడానికి ఇందులోని పోషకాలు సాయపడతాయని చెబుతున్నారు.

దీన్ని కూర వండుకుని తినొచ్చు. పప్పులో వేసుకోవచ్చు. కషాయం మాదిరిగా తీసుకోవచ్చు. లేదా ఆకులను ఎండబెట్టి పొడి చేసుకుని.. హాట్ వాటర్‌లో కలిపి తాగొచ్చు.

(ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. మీకు ఇలాంటి సమస్య ఉంటే డాక్టర్ల సలహాలు తీసుకోండి)

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం క్లిక్‌ చేయండి. 

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..